ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కామేశ్వర్ చౌపాల్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
07 FEB 2025 11:54AM by PIB Hyderabad
శ్రీ కామేశ్వర్ చౌపాల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. రామునికే జీవనాన్ని అంకితం చేసిన భక్తుల్లో శ్రీ కామేశ్వర్ చౌపాల్ ఒకరు, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చాలా విలువైన తోడ్పాటును ఆయన అందించారంటూ ప్రధాని ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘బీజేపీ సీనియర్ నేతలలో ఒకరు, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ధర్మకర్త కామేశ్వర్ చౌపాల్ జీ మన మధ్య లేరని విని దు:ఖం కలిగింది. అనన్య రామభక్తుల్లో ఆయన ఒకరు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చాలా విలువైన తోడ్పాటును అందించారు. దళిత నేపథ్యం నుంచి వచ్చిన కామేశ్వర్ జీ, సమాజంలో వంచనకు గురైన సముదాయాల వారి శ్రేయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన పనుల కారణంగా ఆయనను సదా స్మరించుకొంటూ ఉంటాం. ఈ శోక ఘడియల్లో ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి.’’
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2100586)
आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam