వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయంలో కృత్రిమ మేధ

प्रविष्टि तिथि: 04 FEB 2025 7:04PM by PIB Hyderabad

 వ్యవసాయ రంగంలో వివిధ సవాళ్లను పరిష్కరించడం కోసం కృత్రిమ మేధ పద్ధతులను ఉపయోగించి ప్రభుత్వం రైతులకు సహాయపడింది. ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు:

  1. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై సందేహాలకు సమాధానాలను అందిస్తూ రైతులకు సహాయపడడం కోసం కృత్రిమ మేధ ఆధారిత చాట్ బాట్ ‘కిసాన్ ఇ-మిత్ర’ను ప్రభుత్వం ప్రారంభించింది. వివిధ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా సహాయమందించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
  2. వాతావరణ మార్పుల కారణంగా జరిగే ఉత్పత్తి నష్టాన్ని నివారించడం కోసం ఏర్పాటు చేసిన నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ కృత్రిమ మేధను, మెషీన్ లెర్నింగ్ ను ఉపయోగించి పంట సమస్యలలో చీడపీడల బెడదను గుర్తిస్తుంది. సకాలంలో ఆరోగ్యకరమైన పంటలు చేతకందేలా సహాయపడుతుంది.
  3. కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలు పంటపొలాల ఛాయాచిత్రాలను ఉపయోగించి పంట స్థితిని అంచనా వేస్తాయి, ఉపగ్రహాలను వినియోగించి పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి. వరి, గోధుమ పంటల విషయంలో వాతావరణంతోపాటు నేలలోని తేమ సమాచారాన్ని వినియోగించుకుంటాయి.

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ లోకసభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(रिलीज़ आईडी: 2099951) आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी