గనుల మంత్రిత్వ శాఖ
కీలక ఖనిజాల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంపై సౌదీ మంత్రితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ
प्रविष्टि तिथि:
04 FEB 2025 7:16PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఢిల్లీలో సౌదీ అరేబియా పరిశ్రమలు, ఖనిజ వనరుల శాఖ మంత్రి బండర్ బిన్ ఇబ్రహీం అల్ఖోరాయేఫ్‌తో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కీలకమైన ఖనిజాల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడం లక్ష్యంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.
భవిష్యత్ ఖనిజాల ఫోరం (ఫ్యూచర్ మినరల్స్ ఫోరం) కింద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (జీఎస్ఐటీఐ)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉండడం ఈ చర్చల సందర్భంగా కీలక పరిణామం. ఇది సౌదీ అరేబియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అందించేందుకూ, ప్రపంచ మైనింగ్ రంగంలో సామర్ధ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుంది.
సమావేశం ముఖ్యాంశాలు:
సుస్థిర ఖనిజ సరఫరా మార్గాలు: దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు విశ్వసనీయమైన, సురక్షితమైన ఖనిజ సరఫరా మార్గాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఇద్దరు మంత్రులు అంగీకరించారు.
విలువ ఆధారిత ప్రాసెసింగ్ లో పెట్టుబడులు: స్వచ్ఛ ఇంధన సాంకేతికత ( క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ) కు మద్దతుగా కీలకమైన ఖనిజాల ప్రాసెసింగ్ కోసం సంయుక్త వెంచర్లను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
సాంకేతిక సహకారం: సుస్థిర ఖనిజ అన్వేషణ, వెలికితీత కోసం అధునాతన మైనింగ్ సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను అవలంబించడంలో సహకారంపై కూడా చర్చించారు.
రియాద్ లో జరిగిన ఫ్యూచర్ మినరల్స్ ఫోరం (ఎఫ్ ఎమ్ ఎఫ్)-2025 లో భారతదేశం పాలుపంచుకున్నది. ఇంధన మార్పు, స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలకు అవసరమైన కీలకమైన ఖనిజాలను పొందడానికి భారతదేశం కట్టుబడి ఉందని శ్రీ కిషన్ రెడ్డి ఆనాటి సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎఫ్ఎంఎఫ్- 2025 సమావేశంలోనే... బ్రెజిల్, ఇటలీ, మొరాకో ప్రతినిధులతో కూడా శ్రీ కిషన్ రెడ్డి చర్చలు నిర్వహించారు.
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ (ఎన్ సిఎంఎం) కు అనుగుణంగా ఖనిజ భద్రత, సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాల అభివృద్ధి దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ సమావేశం ఒక ముఖ్యమైన అడుగు.
****
(रिलीज़ आईडी: 2099866)
आगंतुक पटल : 76