సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైతుల కోసం అతి పెద్ద నిల్వ సదుపాయం

प्रविष्टि तिथि: 04 FEB 2025 3:28PM by PIB Hyderabad

 

సహకార సంఘాల రంగంలో ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక’’కు ప్రభుత్వం 2023 మే 31న ఆమోదం తెలిపింది. దీనిని ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టు తరహాలో ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) స్థాయిలో వివిధ రూపాల్లోని వ్యవసాయ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రణాళికలో ఓ భాగం. గోదాములు, కస్టమ్ హైరింగ్ సెంటర్, ప్రాసెసింగ్ యూనిట్లు, చౌక ధర దుకాణాలు ఈ వ్యవసాయ సంబంధ మౌలిక సదుపాయాల్లో కలిసి ఉంటాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్), వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల పథకం (ఏఎంఐ), సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (పీఎంఎఫ్ఎంఈ) వంటి వివిధ పథకాలను దీనిలో కలిపేస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2099830) आगंतुक पटल : 100
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil