పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: కాలం చెల్లిన వాహనాల నియమాలు- 2025 అమలు

Posted On: 03 FEB 2025 3:42PM by PIB Hyderabad

కాలం చెల్లిన వాహనాల నిర్వహణను పర్యావరణ హితంగా ఉంచడం కోసం పర్యావరణఅటవీవాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నాటి ఎస్ వో 98 (ద్వారా పర్యావరణ పరిరక్షణ (కాలం చెల్లిన వాహనాలునియమాలు- 2025ను ప్రకటించిందితయారీదారుకు మరిన్ని బాధ్యతలు (ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీఈపీఆర్సూత్రంపై ఈ నియమాలు ఆధారపడి ఉంటాయిదీనిప్రకారం కాలం చెల్లిన వాహనాలను తుక్కుకింద మార్చేలా వాహన తయారీదారులకు తప్పనిసరి ఈపీఆర్ టార్గెట్లను ఇస్తారువ్యవసాయ ట్రాక్టర్లువ్యవసాయ ట్రైలర్కంబైన్ హార్వెస్టర్పవర్ టిల్లర్ మినహా అన్ని రకాల రవాణారవాణాయేతర వాహనాలు ఈ నియమాల పరిధిలోకి వస్తాయి.

 

స్వీయ వినియోగ వాహనాలు సహా దేశీయ మార్కెట్ లో ప్రవేశపెట్టినప్రవేశపెట్టే వాహనాలకు సంబంధించి ఉత్పత్తిదారులు తమ ఈపీఆర్ బాధ్యతను తప్పక నెరవేర్చాలని ఆదేశిస్తూ.. ఈ నియమాలు నిర్దేశిత స్క్రాపింగ్ లక్ష్యాలను ఉత్పత్తిదారుల ముందుంచుతున్నాయికాలం చెల్లిన వాహనాల స్క్రాపింగ్ కు సంబంధించిన వార్షిక లక్ష్యాలను 2025-26 సంవత్సరం నుంచి ఉత్పత్తిదారులకు అందించారురవాణా వాహనాల విషయంలో 15 సంవత్సరాలురవాణాయేతర వాహనాల విషయంలో 20 సంవత్సరాలను వాటి కాలవ్యవధిగా పరిగణిస్తారు.

 

పనిచేయని లేదా కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ కోసం తీసుకోవడంతోపాటు వాటి నిర్వహణకాలుష్య నిర్మూలనవిచ్ఛిన్నంవేర్పాటుస్క్రాపింగ్ కార్యకలాపాల కోసం నమోదైన వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్ వీఎస్ఎఫ్ఏర్పాటును తప్పనిసరి చేశారుఆర్ వీఎస్ఎఫ్ లో పునరుద్ధరణ సదుపాయం ఉంటేకాలం చెల్లిన వాహనాల నుంచి సేకరించినవేరు చేసిన సామగ్రిని ఆ విడిభాగాల పునరుద్ధరణపునర్వినియోగం కోసం నమోదై ఉన్న పునరుద్ధరణదారులుకో-ప్రాసెసర్లకు పంపించాల్సి ఉంటుందిదానితోపాటు పునరుద్ధరించలేని సామగ్రినినిరుపయోగమైన హానికర సామగ్రిని.. ప్రమాదకరమైనఇతర వ్యర్థాల (నిర్వహణతరలింపునియమాలు- 2016 ప్రకారం నిర్వహించే ఉమ్మడి ప్రమాదకర వ్యర్థాల నిర్వహణనిల్వతొలగింపు కేంద్రాలకు వారు పంపించాల్సి ఉంటుంది.

 

ఉత్పత్తిదారులు ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాలు కాలం చెల్లిన వాహనాలను పర్యావరణ హితమైన రీతిలో నిర్వహించి.. వాటిని నమోదై ఉన్న స్క్రాపింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందివాహనం నమోదై ఉన్న యజమాని లేదా బల్క్ వినియోగదారుడు కాలం చెల్లిన వాహనాన్ని.. ఉత్పత్తిదారు నిర్దేశించిన ఏదైనా విక్రయ కేంద్రంలో లేదా నిర్ణీత సేకరణ కేంద్రం లేదా ఆర్ వీఎస్ఎఫ్ లో.. వాహనం గడువు తీరిన నూట ఎనభై రోజుల్లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

 

ఈ నియమాల్లోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించినా లేదా అమలు చేయకపోయినా.. వివరణను స్వీకరించి వారి నమోదును రద్దు చేయవచ్చుఉత్పత్తిదారు విషయంలో కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ (సీపీసీబీ); ఆర్ వీఎస్ఎఫ్బల్క్ వినియోగదారు విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ (ఎస్ పీఎస్బీఈ చర్యలు తీసుకుంటాయిఈ నియమాలు అందించిన బాధ్యతలకు సంబంధించి రిటర్నులను ఉత్పత్తిదారుబల్క్ వినియోగదారుడుఆర్వీఎస్ఎఫ్ కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్‌లో దాఖలు చేయాల్సి ఉంటుంది.

 

ఆ కేంద్రం ఈ నియమాలు ఏర్పరిచిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించేలా.. సీపీసీబీ కాలానుగుణంగా ఉత్పత్తిదారులపై తనిఖీఆడిట్ వంటి చర్యలను తప్పక తీసుకోవాలినమోదు చేసుకున్న వాహన స్క్రాపింగ్ కేంద్రంపై కాలానుగుణ తనిఖీఆడిట్ ను సీపీసీబీ చేపట్టవచ్చులేదా ఏదైనా ఆధీకృత సంస్థ ద్వారా నిర్వహించవచ్చుఈ నియమాల ద్వారా నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఉల్లంఘించిన లేదా అమలు చేయని ఉత్పత్తిదారు లేదా నమోదు చేసుకున్న వాహన స్క్రాపింగ్ కేంద్రం లేదా ఎవరైనా ఇతర వ్యక్తులపై కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ తగిన చర్యలు తీసుకోవచ్చు.

 

అదేవిధంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థలు కూడా ఆర్వీఎస్ఎఫ్ లపై కాలానుగుణంగా తనిఖీలుఆడిట్ లు చేపట్టిలేదా ఏదైనా ఆధీకృత సంస్థ ద్వారా వాటిని నిర్వహించి ఈ నియమాలు తప్పక అమలయ్యేలా చర్యలు తీసుకోవాలిఈ నియమాల ద్వారా నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఉల్లంఘించిన లేదా అమలు చేయని ఉత్పత్తిదారు లేదా నమోదు చేసుకున్న వాహన స్క్రాపింగ్ కేంద్రం లేదా బల్క్ వినియోగదారు లేదా ఎవరైనా ఇతర వ్యక్తులపై ఎస్పీసీబీ తగిన చర్యలు తీసుకోవచ్చు.

 

ఒకవేళఈ నిబంధనల ప్రకారం పర్యావరణ హిత పద్ధతిలో కాలం చెల్లిన వాహనాల నిర్వహణస్క్రాపింగ్‌కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో ఉత్పత్తిదారు లేదా ఆర్వీపీఎస్ లేదా బల్క్ వినియోగదారు విఫలమైతే.. పర్యావరణం లేదా ప్రజారోగ్యానికి కలిగిన నష్టంహానిపై పర్యావరణ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

 

ఉపయోగార్హం కాని పాతకాలుష్య కారక వాహనాలను దశలవారీగా తొలగించడం కోసం రోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖ వాహనాల స్క్రాపింగ్ విధానాన్ని రూపొందించిందిఫిట్నెస్ ప్రాతిపదికగా.. ఉపయోగార్హం కానికాలుష్య కారక వాహనాలను స్క్రాప్ చేయడం ఈ విధానం లక్ష్యంఈ విధానం కింద దేశవ్యాప్తంగా ఆర్వీఎస్ఎఫ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారుఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 84 ఆర్వీఎస్ఎఫ్ లు పనిచేస్తున్నాయి.

 

ఆర్వీఎస్ఎఫ్ నమోదువాహనాల స్క్రాపింగ్ కు ప్రమాణాలుస్క్రాపింగ్ ప్రక్రియఆడిట్ఆర్వీఎస్ఎఫ్ ల పనితీరుకు ధ్రువీకరణల విధానాలను రోడ్డు రవాణారహదారి మంత్రిత్వ శాఖ ప్రకటించిన మోటారు వాహనాల (నమోదువాహన స్క్రాపింగ్ కేంద్రాల విధులునిబంధనలు- 2021 వివరిస్తాయిఅంతే కాకుండా సీపీసీబీ జారీ చేసిన ‘పర్యావరణ అనుకూల పద్ధతిలో కాలం చెల్లిన వాహనాల నిర్వహణ’ మార్గదర్శకాలను ఆర్వీఎస్ఎఫ్ అమలు పరచాల్సి ఉంటుంది.

 

2021 అక్టోబరు నాటి జీఎస్ఆర్ 714 (ప్రకారం కేంద్ర మోటారు వాహనాల (ఇరవై మూడవ సవరణనిబంధనలు-2021ని రోడ్డు రవాణారహదారి మంత్రిత్వ శాఖ ప్రకటించిందిదీని ప్రకారం.. కొత్త వాహన కొనుగోలుదారు కాలం చెల్లిన వాహనానికి సంబంధించిన ‘డిపాజిట్ సర్టిఫికెట్’ను సమర్పిస్తే కొత్త వాహనంపై రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదుఇదే కాకుండా, 2021 అక్టోబరు నాటి జీఎస్ఆర్ 720 (ప్రకారం కేంద్ర మోటారు వాహనాల (ఇరవై నాలుగవ సవరణనిబంధనలు- 2021ని రోడ్డు రవాణారహదారి మంత్రిత్వ శాఖ ప్రకటించిందిదీని ప్రకారం రవాణాయేతర వాహనాల విషయంలో ఇరవై ఐదు శాతం వరకురవాణా వాహనాలైతే పదిహేను శాతం వరకు మోటారు వాహన పన్నులో రాయితీ లభిస్తుంది.

 

వీటితోపాటు.. ఎలక్ట్రిక్ వాహనాలుపర్యావరణ హిత ప్రత్యామ్నాయాల స్వీకరణను ప్రోత్సహించడానికి రోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖ కింది ప్రకటనలు జారీ చేసింది:

 

a. 2018 అక్టోబరు 18 నాటి ఎస్వో 5333 (ద్వారా బ్యాటరీతోఇథనాల్ – మిథనాల్ ఇంధనాలతో నడిచే రవాణా వాహనాలకు పర్మిట్ అవసరాల నుంచి మినహాయింపులు కల్పించింది.

 

b. 2021 ఆగష్టు నాటి జీఎస్ఆర్ 525 (ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ లేదా పునరుద్ధరణకొత్త రిజిస్ట్రేషన్ మార్కు కేటాయింపులపై రుసుముల చెల్లింపు నుంచి బ్యాటరీతో నడిచే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది.

 

c. 2023 ఏప్రిల్ 18 నాటి జీఎస్ఆర్ 302 (ద్వారా బ్యాటరీతో నడిచే వాహనాలకు ఎలాంటి అనుమతి రుసుమూ లేకుండా ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ జారీ.

 

d. 2018 ఆగష్టు నాటి జీఎస్ఆర్ 749 (ద్వారా బ్యాటరీతో నడిచే రవాణా వాహనాలకు వెనుక ఆకుపచ్చ రంగుపై పసుపు రంగులోనుబ్యాటరీతో నడిచే అన్ని ఇతర వాహనాలకు వెనుక ఆకుపచ్చ రంగుపై తెలుపు రంగులోను రిజిస్ట్రేషన్ మార్కు జారీ.

 

వీటితోపాటు.. దేశంలో ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సహించడం కోసం రూ. 10,900 కోట్ల వ్యయంతో రెండేళ్ల కాలానికి ‘ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నొవేటివ్ వెహికిల్ ఎన్హాన్స్ మెంట్ (పీఎం ఇ-డ్రైవ్)’ పథకాన్ని గతేడాది సెప్టెంబరు 29న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందిఈ పథకం ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలుఎలక్ట్రానిక్ త్రిచక్ర వాహనాలు-అంబులెన్సులు-ట్రక్కులుకొత్తగా రూపొందుతున్న ఇతర తరహా ఎలక్ట్రానిక్ వాహనాలకు రాయితీలనుడిమాండ్ ఆధారిత ప్రోత్సాహకాలను అందిస్తుంది. 24.79 లక్షల ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రానిక్ త్రిచక్ర వాహనాలు, 14,028 -బస్సులకు ఇది ప్రయోజనాలను అందిస్తుంది.

 

పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖా మంత్రి శ్రీ కృతివర్ధన్ సింగ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

***


(Release ID: 2099375) Visitor Counter : 57