ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 29 JAN 2025 12:29PM by PIB Hyderabad

ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో తాను మాట్లాడాననీ, ఈ విషాద ఘటనలో బాధితులకు సాయపడడానికి అవసరమైన అన్ని  చర్యలను తీసుకొంటున్నారనీ శ్రీ మోదీ తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కూడా శ్రీ మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

 

‘‘ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో జరిగిన ఘటన అత్యంత దు:ఖదాయకంగా ఉంది. దగ్గరి బంధువులను కోల్పోయిన భక్తజనులకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దీంతోపాటే గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను. బాధితులకు అన్ని విధాలుగాను సాయపడడానికి స్థానిక పాలనా యంత్రాంగం
అప్రమత్తమైంది. ఈ విషయమై నేను ముఖ్యమంత్రి యోగి గారితో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నేను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాను’’.


(रिलीज़ आईडी: 2097310) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam