నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

76వ గణతంత్ర దినోత్సవం.. వంద మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీ జయంత్ చౌధరి సన్మానం .. నైపుణ్యం కల శ్రామికులకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది: మంత్రి

Posted On: 27 JAN 2025 1:09PM by PIB Hyderabad

భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  కౌశల్ భవన్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో  కేంద్ర నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామికత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), విద్యాశాఖ  సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరి మన దేశంలో వివిధ ప్రాంతాల్లో నైపుణ్యాలకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థ స్కిల్ ఇకో సిస్టమ్)లో ఘన విజయాలను సాధించిన 100 మంది ప్రముఖ ఔత్సాహిక పారిశ్రమికవేత్తలను సన్మానించారుభారత ప్రభుత్వం ఆహ్వానించిన ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా దేశ వృద్ధినవకల్పనలను వేగంగా ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్రను పోషించినందుకు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేక అతిథులుగా కూడా గౌరవించారు

 

దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డబ్ల్యూఈఎఫ్ 2025 వార్షిక సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన శ్రీ చౌధరి వ్యాపార రంగంలో ప్రపంచ ప్రముఖులతో తాను నిర్వహించిన సంభాషణల సారాంశాన్ని ఈ కార్యక్రమంలో పంచుకొన్నారు. ‘‘భారత్‌కు చెందిన నైపుణ్యం గల కార్మికులకు ప్రపంచంలో గొప్ప గుర్తింపు లభిస్తోందిమన ప్రతిభావంతులకు వేనోళ్ల ప్రశంసలు దక్కుతున్నాయిమనం ప్రపంచంలో నైపుణ్య రాజధానిగా ఎదుగుతుండడం శ్రేష్ఠత్వానికి మనం ఎంతగా కట్టుబడి ఉన్నామో తెలిపే నిదర్శనంగా ఉంది’’ అని మంత్రి అన్నారుదావోస్‌లో జరిపిన చర్చలలో దీర్ఘకాలికత్వంక‌ృత్రిమ మేధ (ఏఐవంటి అత్యాధునిక టెక్నాలజీలుమహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధనపై అమిత శ్రద్ధ వంటి అంశాలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు


భారతదేశంలో అంకుర సంస్థల విస్తారిత అనుబంధ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది. 118 యూనికార్న్‌లు మన దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నాయివీటి విలువ 354 బిలియన్ (35400 కోట్లడాలర్లుదార్శనిక విధానాలువాటిని తు.తప్పకుండా అమలు చేయడంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ధీరత్వాలతో ఈ విజయం సాధ్యపడిందిఎంఎస్ఎంఈ రంగం పోషిస్తున్న కీలక పాత్రకు ప్రాధాన్యాన్ని ఇస్తున్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందిఈ రంగంలో 63 మిలియన్ (6 కోట్ల 30 లక్షలవ్యాపార సంస్థలు పనిచేస్తున్నాయిఈ సంస్థలలో 11 కోట్ల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారుజీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 30 శాతం వాటాతోపాటు ఎగుమతుల్లో 45 శాతం వాటాను సమకూరుస్తోంది ఈ రంగమేదీనికి అదనంగాస్కిల్ ఇండియా మిషన్ గణనీయ మార్పులకు కారణమవుతూ తన ప్రభావాన్ని చూపుతోందన్న విషయాన్నీయువతకు సాధికారతను కల్పించడంలోమన దేశాన్ని స్వయంసమృద్ధమైంది (ఆత్మనిర్భర్ భారత్)గా మలచడంలో స్కిల్ ఇండియా మిషన్ పోషిస్తున్న పాత్రనూ లెక్కలోకి తీసుకొన్నారు.

నైపుణ్యం సాధించిన ప్రతిభావంతుల నిలయంగా భారత్‌ పేరు తెచ్చుకోవడానికి తోడ్పడిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను శ్రీ జయంత్ చౌధరి అభినందించారు. ‘‘ఈ జాతీయ సంబరంలో 100 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాలుపంచుకోవడం మన నైపుణ్య సాధన ప్రధాన కార్యక్రమాలు ప్రభావాన్ని చాటుతోందిఈ కార్యక్రమాలు దేశమంతటా వ్యక్తులకు సాధికారతను కల్పించిదీర్ఘకాలం పాటు మనుగడలో ఉండగల జీవనోపాధి మార్గాలను ఏర్పరిచాయిఅంతేకాకఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఇతరులకు సైతం ప్రేరణనిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ఉత్తరాఖండ్ఛత్తీస్‌గఢ్‌లతోపాటు ఈశాన్య ప్రాంతాల వంటి విభిన్న ప్రాంతాలకు చెందిన ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి ప్రధానంగా చెప్పారుఝార్ఖండ్ లో రాంగఢ్ నివాసి శ్రీ రితేంద్ర ప్రసాద్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చారుఆయన ఏబీఐటీ చెన్నైలో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో పట్టభద్రుడయ్యారుసౌర శక్తి రంగంలో పది సంవత్సరాల అనుభవాన్ని సంపాదించారుఎన్ఐఈఎస్‌బీయూడీ (ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆంట్రప్రనర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్)  లో ఈడీపీ (ఆంట్రప్రనర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్కోర్సును చదువుకుని మరీ తన సొంత సౌర శక్తి ప్రధాన వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

దేశ ఈశాన్య ప్రాంతానికి చెందిన 16 మంది మార్గదర్శక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సమాదరించడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా నిలిచిందిఈ 16 మందిలోనూ ఆరుగురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారుమళ్లీ వారిలో అసోం లోని ధుబ్రి జిల్లాకు చెందిన శ్రీమతి నమిత ఎంమారక్ఉడల్‌గురీ జిల్లాకు చెందిన శ్రీమతి మందిర బగ్‌లారీల గురించి చెప్పుకోవాలివీరు పెద్ద సవాళ్లను దీటుగా ఎదురొడ్డి తమ ధీరత్వాన్ని చాటుకొని సఫలమయ్యారువారి గాథలు  గణనీయ మార్పులకు కారణమయ్యే  నైపుణ్యాభివ‌ద్ధికున్న శక్తినీఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తినీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలుప్రయోజనాలకు అంతగా నోచుకోని ప్రాంతాల్లోని మహిళల ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తినీ చాటిచెబుతున్నాయి.
రాజ్యాంగాన్ని సన్మానించడం
భారత రాజ్యాంగ సుదీర్ఘ వారసత్వం మన దేశంలో ప్రజాస్వామిక సంప్రదాయాలకు వెన్నెముకగా ఉంటూ సమానత్వాన్నిన్యాయాన్నిఅవకాశాలను పదిలంగా ఉంచుతోందని కూడా మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో  నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామికత్వ మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈసంయుక్త కార్యదర్శి హీనా ఉస్మాన్ సహా ఉన్నతాధికారులుసిబ్బంది పాల్గొన్నారుఅంతక్రితం అంటే శనివారం, 100 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పీఎం మ్యూజియాన్ని కూడా సందర్శించారు.


ఈ ఉత్సవం మన దేశానికి ఒక గర్వకారణమైన సందర్భంగా చెప్పాలిప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతోపాటు దేశంలోని నైపుణ్యం కల కార్మికుల ఘనతలను ఈ కార్యక్రమం కళ్లకు కట్టిందిఅలాగే ఔత్సాహిక పారిశ్రామికత్వం అన్ని వర్గాలనూ వెంట తీసుకు ముందుకు సాగుతూ ఒక ఉజ్జ్వల భవితపై ఆశలను రేకెత్తించింది.

 

***


(Release ID: 2096684) Visitor Counter : 21


Read this release in: English , Hindi , Tamil , Urdu