గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
స్మార్ట్ నగరమైన కరీంనగర్లో రూ. 1,117 కోట్లతో అమలు చేస్తున్న 50 ప్రాజెక్టులు, వాటిలో రూ.233 కోట్ల విలువైన 36 ప్రాజెక్టుల పనులు పూర్తి
కరీంనగర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 53 స్మార్ట్ తరగతులు, మరో 27 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం మౌలిక వసతుల అభివృద్ధి
స్మార్ట్ సిటీ కరీంనగర్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఘన వ్యర్థాల నిర్వహణ
Posted On:
24 JAN 2025 4:28PM by PIB Hyderabad
విద్య, ఘన వ్యర్థాల నిర్వహణ, మౌలికవసతుల రంగంలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ఈ రోజు (జనవరి, 24) ప్రారంభించారు.
గౌరవ మంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులు
డా.బీ.ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి: 22 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో వాణిజ్య సముదాయం, ఇండోర్ హాల్ పునరుద్ధరణ, ఆధునిక శౌచాలయాలు, పార్కింగ్ స్థలం, వినోదం, క్రీడల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రదేశం ఉన్నాయి.
బహుళ ప్రయోజనాల పాఠశాల పార్కు: 5.96 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ పార్కును రూ. 12.35 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, మ్యూజికల్ ఫౌంటెయిన్, వినోద సౌకర్యాలతో కుటుంబ సమేతంగా గడిపేందుకు అనువైన ప్రదేశాన్ని అందిస్తుంది.
24x7 నీటి సరఫరా: హౌసింగ్ బోర్డు కాలనీలో రూ. 18 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన నీటి సరఫరా వ్యవస్థ – నగర వాసులకు పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచి నీటిని అందిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, స్మార్ట్ తరగతి గదులు: రూ. 9.20 కోట్లతో చేపట్టిన మరమ్మతులు - 27 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన టాయిలెట్లు, ప్రహారీ గోడలు, బోరుబావులు, క్రీడా సౌకర్యాలు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తాయి. అలాగే, కరీంనగర్లోని 53 ప్రభుత్వ పాఠశాలల్లో నగర విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు స్మార్ట్ తరగతి గదులను అభివృద్ది చేశారు.
రూ.1,117 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులను కరీంనగర్ స్మార్ట్ సిటీ చేపట్టింది. వాటిలో రూ.884 కోట్ల విలువైన 36 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.233 కోట్ల విలువైన మరో 14 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఆధునిక రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల వంటి కీలక రంగాలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీ చేపట్టిన ఈ బహుళ రంగ ప్రాజెక్టులు పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి. ఈ మిషన్ ద్వారా రూ.480 కోట్ల విలువైన స్మార్ట్ మొబిలిటీ, రూ.402 కోట్ల విలువైన నీటిసరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థలు తదితరమైన వివిధ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేశారు.
53 ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులను, 27 పాఠశాలల్లో మౌలిక వసతులను, క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేశారు. ఇవి విద్యార్థులకు ఈ-లెర్నింట్ టూల్స్ ద్వారా విద్యార్థులకు ఆధునిక అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తాయి. బయో మైనింగ్ ప్రాజెక్టు ద్వారా లక్షకు పైగా3 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేస్తారు. ఇది పర్యావరణ సుస్థిరతను కాపాడటంలో నగర నిబద్ధతను తెలియజేస్తుంది. డా. బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో సైకిల్ మార్గాల, స్కేటింగ్ రింగులు, బాస్కెట్ బాల్ కోర్టులు, పార్కింగ్ ప్రదేశాలు సహా ఇతర సౌకర్యాలు కల్పించి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణంగా మార్చారు.
స్మార్ట్ సిటీకి చెందిన అధికారులు, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
100 నగరాల్లో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా 2015లో స్మార్ట్ సిటీ మిషన్ ప్రారంభించారు. నగరాల సుస్థిరాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు ప్రధాన భూమిక పోషిస్తాయి. పట్టణ నిర్వహణలో ఈ 100 స్మార్ట్ నగరాలు సాంకేతికతను వినియోగించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి.
***
(Release ID: 2096014)
Visitor Counter : 9