వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైట్ గూడ్స్ (ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీ లైట్లు)


పీఎల్ఐ పథకం..మూడో విడతలో రూ.3,156 కోట్ల పెట్టుబడి హామీతో 24 కంపెనీల ఎంపిక

రూ.2,299 కోట్ల పెట్టుబడులు పెడతామన్న 18 కొత్త కంపెనీలు, రూ.1,217 కోట్ల మేరకు అదనపు పెట్టుబడికి సిద్ధమన్న ప్రస్తుత పీఎల్ఐ లబ్ధిదారు సంస్థలు

15 ఏసీ కంపెనీల నుంచి రూ.3,260 కోట్ల పెట్టుబడులు...

మరో రూ.256 కోట్ల పెట్టుబడిని తీసుకురానున్న 9 ఎల్ఈడీ కంపెనీలు

వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీ లైట్ల) పీఎల్ఐ పథకం పరిధిలో మొత్తం 84 కంపెనీలు..పెట్టుబడులు రూ.10,478 కోట్లు..

పథకం అమలయ్యే కాలంలో ఉత్పత్తి అంచనా రూ.1,72,663 కోట్లు

Posted On: 20 JAN 2025 12:20PM by PIB Hyderabad

ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పథకం (ప్రొడక్షన్ లింక్‌డ్ స్కీమ్మూడో విడతలో మొత్తం 24 లబ్ధిదారు సంస్థలు రూ.3,516 కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకు రావడంతోఈ పథకం దేశవ్యాప్తంగా ఎయిర్‌కండిషనర్లుఎల్ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్లైట్లకు అవసరమైన విడిభాగాల ఉత్పాదన పెద్దఎత్తున పుంజుకోవడానికి తోడ్పడనుందిపీఎల్ఐ పథకంలో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తుల స్వీకరణ మూడో దఫాలో మొత్తం 38 దరఖాస్తులు వచ్చాయిఈ దరఖాస్తులను సమీక్షించిన తరువాత ప్రభుత్వం 18 కొత్త కంపెనీలను తాత్కాలికంగా ఎంపిక చేసిందిఈ కంపెనీల్లో 10 కంపెనీలు ఎయిర్ కండీషనర్ల విడిభాగాల తయారీలోనూ, 8 కంపెనీలు ఎల్ఈడీ లైట్ల తయారీలోనూ నిమగ్నం అవుతాయిఈ కంపెనీలన్నీ రూ.2,299 కోట్ల పెట్టుబడిని పెట్టడానికి వాగ్దానం చేశాయి.

దీనికి అదనంగాఇప్పటికే పీఎల్ఐ లబ్ధిదారులుగా ఉన్న కంపెనీలను అధిక పెట్టుబడి కేటగిరీల స్థాయికి పెంచే దృష్టితో తాత్కాలికంగా ఎంపిక చేశారుఈ కంపెనీలు మరో రూ.1,217 కోట్ల పెట్టుబడిని తీసుకురానున్నాయి.

ప్రస్తుత దరఖాస్తుదారు కంపెనీలు రెండిటితో సహా 13 దరఖాస్తుదారు కంపెనీలను సిఫారసుల కోసం నిపుణుల సంఘానికి (సీఓఈనివేదించారుదరఖాస్తుదారుల వివరాలను ‘అనుబంధం’లో పొందుపరిచారు.

దరఖాస్తుదారు కంపెనీల్లో ఒక కంపెనీ ఈ పథకం నుంచి వైదొలగాలని నిర్ణయించుకొనితన దరఖాస్తును వెనక్కి తీసుకుందిమొత్తంమీదవైట్ గూడ్స్‌ కోసం ఉద్దేశించిన పీఎల్ఐ పథకంలో భాగంగా 84 కంపెనీలు రూ.10,478 కోట్ల పెట్టుబడిని తీసుకురానున్నాయితత్ఫలితంగా రూ.1,72,663 కోట్ల విలువైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.

ఈ చర్య... ఈ రంగంలో తయారీ సామర్థ్యాలతోపాటు ఆర్థిక వృద్ధికి ఊతాన్నిస్తుందన్న ఆశ ఉందిఏసీల కోసం కంపెనీలు కంప్రెషర్లనురాగి గొట్టాలను (ఐడీయూ లేదా ఓడీయూ కోసం అవసరమయ్యేప్లెయిన్లేదా గ్రూవ్‌డ్ కంట్రోల్ అసెంబ్లీలనుహీట్ ఎక్స్‌చేంజర్లనుబీఎల్‌డీసీ మోటర్లు సహా ఇతర భాగాలను తయారు చేయబోతున్నాయిఇదే విధంగాఎల్ఈడీ లైట్ల కోసం ఎల్ఈడీ చిప్ ప్యాకేజింగ్ఎల్ఈడీ డ్రైవర్స్ఎల్ఈడీ ఇంజిన్లుఎల్ఈడీ లైట్ మేనేజ్‌మెంట్ సిస్లమ్స్ఇంకా కెపాసిటర్ల కోసం వినియోగించే మెటలైజ్డ్ ఫిల్ముల వంటి వాటిని మన దేశంలోనే తయారు చేయనున్నారు.

వైట్ గూడ్స్ (ఏసీలుఎల్ఈడీ లైట్లుతయారీ కోసం రూ.6,238 కోట్ల ఖర్చుతో ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై) 2021-22 నుంచి 2028-2వరకు అమలు చేసేలా పీఎల్ఐ స్కీముకు కేంద్ర మంత్రిమండలి 2021 ఏప్రిల్ 7న ఆమోదం తెలిపిందిఈ పథకాన్ని డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్2021 ఏప్రిల్ 16న నోటిఫై చేసింది.

వైట్ గూడ్స్ ఉత్పత్తిని లక్షించిన పీఎల్ఐ పథకాన్నిదేశంలో ఎయిర్ కండీషనర్లుఎల్ఈడీ లైట్ల తయారీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ఒక పక్కా విడిభాగాల ఉత్పాదన ప్రధాన విస్తారిత అనుబంధ వ్యవస్థ (కోసిస్టమ్)ను ఏర్పరచాలనే ఉద్దేశంతోనూప్రపంచంలో సరఫరా శ్రేణుల (గ్లోబల్ సప్లయ్ చైన్స్)లో భారతదేశాన్ని ఒక అంతర్భాగంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనూ రూపొందించారుఈ పథకం ఆధార సంవత్సరం (బేస్ ఇయర్తరువాత నుంచి అయిదు సంవత్సరాల కాలంపాటుఅలాగే మొదలుపెట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు అమ్మకాలలో పెరుగుదల ప్రాతిపదికన తగ్గిస్తూ పోయే తరహాలో శాతం మొదలు శాతం వరకూ ప్రోత్సాహకాన్ని అందిస్తుందిదేశీయ విలువ జోడింపు ఇప్పుడున్న 15-20 శాతం నుంచి పెరిగి, 75-80 శాతానికి చేరుకోగలదన్న అంచనా ఉంది.

 

***


(Release ID: 2094647) Visitor Counter : 34