వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2024-25 సంవత్సరానికి సవరించిన ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (దేశీయ) విధానాన్ని ప్రకటించిన కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి
క్వింటాలు బియ్యం రిజర్వు ధర రూ. 2,250..
ఇథనాల్ డిస్టిలరీలకు విక్రయించేందుకు క్వింటాలు బియ్యం రిజర్వు ధర రూ.2,250
प्रविष्टि तिथि:
17 JAN 2025 9:18PM by PIB Hyderabad
2024-25 సంవత్సరానికి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (దేశీయ) (ఓఎంఎస్ఎస్-డీ) విధానంలో భారీ సవరణలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఆహార భద్రతను పెంపొందించడం, వివిధ భాగస్వాములకు బియ్యం సమర్థవంతంగా పంపిణీ చేయడం లక్ష్యంగా ఈ విధానం పని చేస్తోంది.
సవరించిన విధానంలో ఈ విధమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1. బియ్యానికి రిజర్వ్ ధరను నిర్ణయించడం: ఈ-వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, కమ్యూనిటీ కిచెన్లకు విక్రయించడానికి బియ్యం రిజర్వ్ ధర క్వింటాలుకు రూ .2,250 (దేశ వ్యాప్తంగా) నిర్ణయించారు.
2. ఇథనాల్ ఉత్పత్తికి మద్దతు: ఇథనాల్ ఉత్పత్తి కోసం ఇథనాల్ డిస్టిలరీలకు విక్రయించేందుకు బియ్యం రిజర్వ్ ధరను క్వింటాలుకు రూ .2,250 (పాన్-ఇండియా) గా నిర్ణయించారు.
ఈ సవరణలు రాష్ట్ర పథకాల బాధ్యతలను నెరవేర్చడంలో వాటికి సహకరించటం, ఆహార భద్రతను ప్రోత్సహించడం, జాతీయ ఇంధన వ్యూహంలో భాగంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.
పౌరుల సంక్షేమాన్ని చూసుకునేందుకు, దేశ విస్తృత అభివృద్ధి లక్ష్యాలకు దోహదం చేసేందుకు రాష్ట్రాలు, వివిధ భాగస్వాములు ఈ సవరించిన విధానాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
(रिलीज़ आईडी: 2094110)
आगंतुक पटल : 85