రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సరిహద్దు సాంకేతికతపై పట్టు సాధించడం తక్షణావసరం..


భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా శిక్షణ కేంద్రాలు సైనికులను సన్నద్ధం చేస్తున్నాయి: మౌ లోని ఆర్మీ వార్ కాలేజీలో రక్షణ మంత్రి

“సమీకరణ, ఏకీకరణ ద్వారా సాయుధ దళాలు సవాళ్లను కలిసికట్టుగా, మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలవు”

Posted On: 30 DEC 2024 1:00PM by PIB Hyderabad

నిరంతర పరిణామశీలంగా ఉన్న నేటి కాలంలో సరిహద్దు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం తక్షణావశ్యకత అనీఈ దిశగా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా మన సైనికులను సన్నద్ధం చేయడంలో సైనిక శిక్షణ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారుమధ్యప్రదేశ్ లోని మౌ లో ఉన్న ఆర్మీ వార్ కాలేజీ (ఏడబ్ల్యూసీ)లో అధికారులను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారుయుద్ధవిధానాల్లో వస్తున్న సమూల మార్పులను ప్రస్తావిస్తూ.. సమాచార యుద్ధంకృత్రిమ మేధ (ఏఐఆధారిత యుద్ధంపరోక్ష యుద్ధంవిద్యుదయస్కాంత యుద్ధంఅంతరిక్ష యుద్ధంసైబర్ దాడుల వంటి సంప్రదాయేతర యుద్ధ పద్ధతులు నేటి పరిస్థితుల్లో సవాళ్లుగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.

ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం సుశిక్షితంగాసన్నద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని రక్షణ శాఖ మంత్రి స్పష్టం చేశారుఈ కృషిలో విలువైన సహకారాన్ని అందిస్తున్నాయంటూ మౌ లోని శిక్షణ కేంద్రాన్ని అభినందించారుమారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణ పాఠ్యాంశాలను ఈ కేంద్రాలు నిరంతరం మెరుగుపరుస్తున్నాయనీపోరాట సిబ్బందిని అన్ని రకాల సవాళ్లనూ ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతున్నాయనీ ఆయన అభినందించారు.

2047 నాటికి దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ దార్శనికతను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ప్రస్తుత సమయాన్ని పరివర్తన కాలంగా అభివర్ణించారు. “భారత్ నిరంతరం అభివృద్ధి పథంలో పయనిస్తూశరవేగంగా తయారీ కేంద్రంగా ఎదుగుతోందిసైనిక పరంగా చూస్తే అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాంఇతర దేశాలకు కూడా భారత్ లో తయారైన పరికరాలను ఎగుమతి చేస్తున్నాందశాబ్దం క్రితం రూ.2,000 కోట్లుగా ఉన్న మన రక్షణ ఎగుమతులు నేడు రికార్డు స్థాయిలో రూ.21,000 కోట్లను దాటాయి. 2029 నాటికి రూ.50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం” అని ఆయన తెలిపారు.

త్రివిధ దళాల మధ్య సమీకరణఏకీకరణను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారుతద్వారా సాయుధ దళాలు మున్ముందు మరింత మెరుగ్గాసమర్థవంతంగా సవాళ్లను ఎదుర్కోగలవని ధీమా వ్యక్తం చేశారుమౌ కంటోన్మెంటులో అన్ని విభాగాల అధికారులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారుపదాతిదళ పాఠశాలలో ఆయుధ శిక్షణ.. మిలిటరీ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కళాశాల (ఎంసీటీఈ)లో కృత్రిమమేధప్రసార సాంకేతికత.. ఏడబ్ల్యూసీలో నాయకత్వం జూనియర్సీనియర్ కమాండ్ వంటి అంశాల్లో శిక్షణ ద్వారా సమీకరణను పెంపొందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆయన కోరారు.

భవిష్యత్తులో కొందరు అధికారులు సైనిక దౌత్యవేత్తలుగా పనిచేస్తారనీవారు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కృషిచేయాలని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. “సైనిక దౌత్యవేత్తలుగా బాధ్యతల్లో ఉండే సమయంలో ఆత్మనిర్భర భారత్ అనే ప్రభుత్వ దార్శనికతను పుణికిపుచ్చుకోవాలిస్వావలంబన ద్వారానే భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకునిఅంతర్జాతీయ వేదికపై మరింత గౌరవాన్ని పొందగలదు” అని ఆయన అన్నారు.

భారత్ ను ప్రపంచంలో బలమైన ఆర్థికసైనిక శక్తుల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అచంచలమైన నిబద్ధతతో ఉన్నదని రక్షణ మంత్రి పేర్కొన్నారు. “భద్రతపై పూర్తి శ్రద్ధ చూపినప్పుడే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుందిఅదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే భద్రత వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందిరెండూ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారడమే కాకుండా.. మన సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యంత ఆధునికబలమైన సైన్యాలలో ఒకటిగా నిలుస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవచించిన విలువలైన అంకిత భావంస్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాజ్ నాథ్ సింగ్ అధికారులను కోరారుబాబా సాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదుదార్శనికుడు కూడా అని ఆయన అభివర్ణించారుఆయన విలువలుఆదర్శాలను ప్రజలకు.. ముఖ్యంగా యువతకు పరిచయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

సరిహద్దుల రక్షణలోనూప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల్లోనూ సాయుధ బలగాలు ముందుంటాయని రక్షణ మంత్రి ప్రశంసించారు. “దేశ రక్షణలో ఈ అంకితభావంనిరంతరం మారుతున్న ప్రపంచంలో మన స్వీయ నవీకరణ స్ఫూర్తి మనల్ని ఇతరుల కన్నా ముందంజలో నిలపగలవు’’ అని ఆయన అన్నారు.

శిక్షణలోనూమొత్తం యుద్ధ రంగంలో పోరాటం దిశగా సేనా నాయకులను సాధికారులను చేయడంలోనూ ఏడబ్ల్యూసీ పాత్రప్రాధాన్యాలను ఆ సంస్థ వద్ద కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ సాహి మంత్రికి వివరించారువివిధ రంగాలకు సంబంధించిన కార్యకలాపాల ఏకీకరణశిక్షణ పాఠ్య ప్రణాళికలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంఅలాగే సీఏపీఎఫ్ అధికారుల శిక్షణతోపాటు విద్యాసంస్థలువిశ్వవిద్యాలయాలుపరిశ్రమలతో నిర్వహించే పరస్పర వినిమయ కార్యక్రమాల ద్వారా శిక్షణ విధానంలో ఉండే ముఖ్యమైన దశల గురించి ఆయనకు వివరించారుమిత్ర దేశాల అధికారులకు శిక్షణ ఇవ్వడం ద్వారాసైనిక దౌత్యానికి ఎనలేని తోడ్పాటు అందించడం ద్వారా సంస్థ అంతర్జాతీయంగా పోషించిన పాత్రను కూడా ఆయనకు వివరించారుసైనిక దళ ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేదిభారత సైన్యంలోని ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకుముందుసైనిక స్మారకం వద్ద రక్షణ మంత్రి వీర యోధులకు నివాళి అర్పించారు.

మౌ లోని ఏడబ్ల్యూసీఎంసీటీఈసైనిక పాఠశాలసైనిక శిక్షణ కేంద్ర యూనిట్లను రక్షణ మంత్రి ఆదివారం సందర్శించారుఈ సంస్థలన్నీ కలిసి భారత్ ను భద్రత పరంగా అత్యున్నతమైన స్థితిలో నిలిపాయనీ.. అలాగే బలమైనసుసంపన్నమైనఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇచ్చాయనీ ఆయన వ్యాఖ్యానించారుఎంసీటీఈలో నిర్వహిస్తున్న క్వాంటం టెక్నాలజీకృత్రిమ మేధ ప్రయోగశాలలను అనుకూల యుద్ధ తంత్రాన్ని సాధించే దిశగా కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.  

 

***


(Release ID: 2088935) Visitor Counter : 34


Read this release in: English , Urdu , Hindi , Tamil