సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వ్యర్థాల నుంచి సంపద వరకు కనీస పరిశుభ్రతా విధానం ద్వారా ప్రజాపాలనలో మార్పులు
Posted On:
24 DEC 2024 2:23PM by PIB Hyderabad
‘‘ప్రశంసనీయం! సమర్థవంతమైన నిర్వహణ, క్రియాశీలక చర్యలపై దృష్టి సారించడం ద్వారా ఈ ప్రయత్నం (ప్రత్యేక ప్రచారం 4.0) మంచి ఫలితాలను సాధించింది. సుస్థిర ఫలితాలకు దారి తీసి పరిశుభ్రతను, ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం ద్వారా సుస్థిరమైన ఫలితాలు ఎలా సాధ్యమవుతాయో ఇది చూపిస్తుంది.
- ప్రధానమంత్రి నరేంద్రమోదీ
శుభ్రత, సమర్థమైన వ్యర్థాల నిర్వహణే సుపరిపాలనకు మూలాధారాలు: ఈ పద్ధతులు ఆరోగ్యకరంగా జీవించే వాతావరణాన్ని కల్పించడంతో పాటు పాలనా దక్షతను, పౌర కేంద్రక పరిపాలనను సూచిస్తాయి. 2001లో జరిగిన ఐరాస నివాస ప్రపంచ సదస్సులో నగర పరిశుభ్రత, వ్యర్థపదార్థాల నిర్వహణను సుపరిపాలనకు కొలమానంగా భావించవచ్చని సూచించారు. దేశంలో చేపట్టిన పారిశుద్ధ్య ప్రచారాలు పరిశుభ్రత గురించి వివరించే స్థాయి నుంచి మార్పులకు శ్రీకారం చుట్టే కార్యక్రమాలుగా రూపాంతరం చెందాయి. ఇవి సమూహాలను పురోగతి దిశగా నడిపించడానికి, ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకొనేందుకు శుభ్రత, పరిపాలన ఎలా కలిసి పనిచేస్తాయో వివరిస్తాయి.
లదాఖ్ లోని నుబ్రా లోయ దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఒకప్పుడు ఈ ప్రాంతం చెత్తతో నిండి ఉండేది. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ప్రచారం 4.0 ద్వారా వనరులను సమీకరించి, 12 టన్నులకు పైగా చెత్తను తరలించి, ఈ ప్రాంతానికి కాంక్రీటు రోడ్డును నిర్మించారు. తద్వారా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగవడమే కాకుండా సుస్థిరాభివృద్ధిలో మార్పు తీసుకొచ్చే శక్తి... పారిశుద్ధ్యానికి ఉందన్న విషయాన్ని ఈ ప్రయత్నం తెలియజేస్తుంది.
పారిశుద్ధ్యాన్ని సంస్థాగతం చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను తెలియజేసేలా 2021 నుంచి కొనసాగుతున్న వరుస కార్యక్రమాల్లో ఈ ప్రత్యేక ప్రచారం 4.0 ఒక భాగంగా ఉంది. డిసెంబర్ 2023 నుంచి జులై 2024 మధ్య ఈ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఈ విజయాలు ఆర్థిక వనరుల సద్వినియోగం, వనరుల సమర్థ నిర్వహణతో పారిశుద్ధ్యం మిళితమవడాన్ని సూచిస్తాయి.
గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయంలో భారీ కూలింగ్ టవర్‌కు చెందిన వ్యర్థాల కుప్పలను వేలం వేసి అక్కడి నుంచి తరలించారు. ఫలితంగా పెద్ద విస్తీర్ణంలో స్థలం ఖాళీ అయింది. ప్రత్యేక క్యాంపెయిన్ 4.0లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం కార్గో సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరిచి, నౌకాశ్రయ కార్యకలాపాల్లో సౌలభ్యాన్ని పెంచింది. పారిశుద్ధ్యం ఆర్థిక కార్యకలాపాలపై నేరుగా ఎలా ప్రభావం చూపుతుందో ఉదాహరణగా నిలవడంతో పాటు ఆచరణాత్మక పరిష్కారాలను అనుసరించే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది.
సమగ్ర పారిశుద్ధ్య లక్ష్యాలను సాధించే దిశగా భారత ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాన కార్యక్రమాలు:
1. స్వచ్ఛభారత్ అభియాన్ (ఎస్‌బీఏ): 2014లో ప్రారంభమైన ఈ ఎస్‌బీఏ కార్యక్రమం పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు, ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంచే కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చేసింది. డిసెంబర్ 24, 2024 నాటికి దేశంలో 4,75,210 గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, 5,14,102 గ్రామాల్లో ద్రవ్య వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు ఉన్నాయి.
2. వ్యర్థాల నుంచి సంపద: ఈ కార్యక్రమం ద్వారా పారేసిన లోహాలను కళాకృతులుగా, వినియోగ వస్తువులుగా తయారుచేస్తున్నారు. ఉదాహరణకు రాంచీలో వ్యర్థాలతో రూపొందించిన జింక శిల్పాలు, చెత్తకు ఎలా విలువను తీసుకొచ్చాయో తెలియజేయడంతో పాటు పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. డిసెంబర్ 24, 2024 నాటికి 3 లక్షల మందికి పైగా పౌరులు వ్యర్థాల నిర్వహణలో శిక్షణ పొందారు. చెత్తను సంపదగా మార్చేందుకు 800కు పైగా టెక్నాలజీలను రూపొందిస్తే వాటిలో 80 వరకు సాంకేతికతలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయి.
అదనంగా, పని ప్రదేశాల్లో సైబర్ స్వచ్ఛతా కేంద్ర, పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పాలనా వ్యూహాల్లో పరిశుభ్రతను ఏకీకృతం చేస్తాయి. ఎలక్ట్రాన్సిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సైబర్ స్వచ్ఛతా కేంద్ర భాగంగా ఉంది. ఇది భారత్‌లోని బాట్‌నెట్ ఇన్ఫెక్షన్లను గుర్తించి, వాటిని తొలగించి, వినియోగదారులకు సురక్షితమైన వ్యవస్థలను అందించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కాపాడతాయి.
పరిశుభ్రతను పాటించడం, వ్యర్థాలను పారవేయడమనేది పారిశుద్ధ్య విధులకంటే ఎక్కువ, అవి దేశ ప్రాధాన్యతలను ప్రతిబింబించే పాలనా సాధనాలు. సామాజిక సంక్షేమాన్ని, ఆర్థిక వృద్ధిని, పరిపాలనా సామర్థ్యాన్ని ఎలా పెంపొందిస్తుందో స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రత్యేక ప్రచారం 4.0 మనకు తెలియజేశాయి. ఈ విధానాలను స్వీకరించడం ద్వారా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా స్థిరత్వాన్ని, జవాబుదారీతనంగా ఉండే సంస్కృతిని పెంపొందిస్తుంది. ఇది మంచి పాలనకు నిదర్శనం.
ప్రామాణికాలు:
· పాలనా సంస్కరణలు, ప్రజా సమస్యలు విభాగం ప్రత్యేక ప్రచారం 4.0పై రూపొందించిన నివేదిక
· https://www.csk.gov.in/
· https://sbm.gov.in/sbmgdashboard/statesdashboard.aspx
· https://www.psa.gov.in/waste-to-wealth
· https://www.undp.org/mongolia/blog/cleanliness-city-and-effectiveness-its-waste-management-system-can-be-used-useful-proxy-indicator-good-governance
· https://x.com/DrJitendraSingh/status/1855492508630868404
Click here to see in PDF:
(Release ID: 2087975)
Visitor Counter : 8