కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన వెబ్‌సైట్ (https://trai.gov.in/)ను లాంఛనంగా ప్రారంభించిన ట్రాయ్

Posted On: 23 DEC 2024 2:34PM by PIB Hyderabad

ఎక్కువ మందికి చేరువయ్యేలా తన పరిధిని విస్తృతం చేసే దిశగా మెరుగుపరిచిన వెబ్‌సైట్‌ను ట్రాయ్ అందుబాటులోకి తీసుకువచ్చిందిపెరుగుతున్న సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించి సమాచారాన్ని ప్రజలందరికీ అందించేలా సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చారుభారతదేశంలో టెలికాంబ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలువిధానాలుచట్టాలుగణాంకాలుపోకడలపై సమగ్ర సమాచారాన్ని ఈ వెబ్‌సైట్ అందిస్తుందిఈ వనరులు ప్రజలకునిబంధనలుపరిశోధకులుఅంతర్జాతీయ వీక్షకులకు సులభంగా అందుబాటులో ఉంటాయి.

కొత్త వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న అదనపు ఫీచర్లు:

·         టెలికాంబ్రాడ్‌కాస్టింగ్ రంగానికి కొత్త డ్యాష్ బోర్డు పరిచయం

·         పరిశోధన నిమిత్తం డేటా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం

·         గ్రిడ్ వ్యూ ఫీచర్సమాచారాన్ని కొత్తగా ఇంటరాక్టివ్ పద్ధతిలో వీక్షించే విధంగా వినియోగదారులను అనుమతిస్తుంది.

·         -మెయిల్ ద్వారా మాత్రమే కాకుండా ఇన్ స్టాగ్రామ్యూట్యూబ్లింక్డిన్వాట్సాప్పేస్బుక్ఎక్స్ తదితర ప్రధాన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా నేరుగా డాక్యుమెంట్లను పంచుకోవచ్చు.

·         ట్రాయ్ విడుదల చేసే తాజా సమాచారం పొందేందుకు ఆన్ లైన్ నమోదు

·         సంస్థకు సంబంధించిన సంక్షిప్త సమాచారం.

·         ఈ కొత్త వెబ్‌సైట్ ఐఓఎస్ఆండ్రాయిడ్ఇతర వేదికలకు అనుగుణంగా ఉంటుంది.

·         నమోదు చేసుకున్న వినియోగదారులు తమ వ్యాఖ్యలు తెలియజేసేందుకు వీలుగా బ్లాగ్ సౌకర్యం.

·         జరగబోయే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే సదుపాయం

·         బహిరంగ చర్చల్లో పాల్గొనేందుకు ఆన్ లైన్ నమోదు

·         సౌకర్యాలను వినియోగించుకొనేందుకు వెసులుబాటు

·         టెండర్లునోటీసులు

·         వెబ్‌సైట్ చివరన పేర్కొన్న సవరణలతో ఒకే చోట సంక్షిప్తంగా సంకలనం చేసిన నిబంధనలు

కొత్త వెబ్సైట్‌ ఎన్ఐసీ క్లౌడ్‌ ద్వారా సేవలు అందిస్తుందికొత్త వెబ్‌సైట్ ప్రారంభమైన మూడు నెలల వరకు పాత వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంటుందిఇంటరాక్టివ్ సెర్చ్ సౌకర్యం కోసం ‘తార’ (టెలికాం అథారిటీ రెస్పాన్సివ్ అడ్వైజర్అనే చాట్‌బాట్‌ను కూడ పరిచయం చేశారు.

ఈ కొత్త ఫీచర్లు టెలికాంబ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ట్రాయ్ నింయత్రణ కార్యక్రమాల్లో పారదర్శకతనుసౌలభ్యాన్నిప్రజా భాగస్వామ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఏదైనా స్పష్టత/సమాచారం కోసం సలహాదారు (ఐటీశ్రీమతి అర్చనా సావంత్‌ను 011-20907756 ద్వారా సంప్రదించవచ్చులేదా jait@trai.gov.in ద్వారా వెబ్ మేనేజర్‌ను సంప్రదించవచ్చు.

 

****


(Release ID: 2087467) Visitor Counter : 23