ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ఎస్ ఎం కృష్ణ మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 10 DEC 2024 9:01AM by PIB Hyderabad

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎస్ ఎం కృష్ణ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన నేతగా శ్రీ కృష్ణ గుర్తింపు పొందారని ప్రధాని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని సందేశమిస్తూ:

 “శ్రీ ఎస్ ఎం కృష్ణ అన్ని వర్గాల ఆదరణను చూరగొన్న గొప్ప నేత. పౌరుల జీవితాలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమించేవారాయన.. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడంపై దృష్టి కేంద్రీకరించారు. విస్తారంగా చదివే అలవాటు ఉన్న శ్రీ కృష్ణ గొప్ప  ఆలోచనాపరులు.

అనేక సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా మసలే అవకాశం నాకు లభించింది.. ఆ అవకాశాలను నేను ఎంతో ఆస్వాదించాను. శ్రీ కృష్ణ మృతి నన్ను కలిచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని పేర్కొన్నారు.

"ಶ್ರೀ ಎಸ್.ಎಂ ಕೃಷ್ಣ ಅವರು ಅಸಾಧಾರಣ ನಾಯಕರಾಗಿದ್ದರು, ಸಮಾಜದ ಎಲ್ಲ ವರ್ಗಗಳ ಜನರ ಮೆಚ್ಚುಗೆಗೆ ಪಾತ್ರರಾಗಿದ್ದರು. ಅವರು ಯಾವಾಗಲೂ ಇತರರ ಜೀವನವನ್ನು ಸುಧಾರಿಸಲು ದಣಿವರಿಯದೆ ಶ್ರಮಿಸಿದರು. ಕರ್ನಾಟಕದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿದ್ದ ಅವಧಿಯಲ್ಲಿ ಅವರು ವಿಶೇಷವಾಗಿ ಮೂಲಸೌಕರ್ಯ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಗಮನಹರಿಸಿದ್ದನ್ನು ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಶ್ರೀ ಎಸ್.ಎಂ ಕೃಷ್ಣ ಅವರು ಸಮೃದ್ಧ ಓದುಗ ಮತ್ತು ಚಿಂತಕರೂ ಆಗಿದ್ದರು."

"ಕಳೆದ ಹಲವಾರು ವರ್ಷಗಳಿಂದ ಶ್ರೀ ಎಸ್.ಎಂ. ಕೃಷ್ಣ ಅವರೊಂದಿಗೆ ಸಂವಾದ ನಡೆಸುವ ಅನೇಕ ಅವಕಾಶಗಳು ನನಗೆ ದೊರೆತವು ಮತ್ತು ಆ ಸಂವಾದಗಳನ್ನು ನಾನು ಯಾವಾಗಲೂ ಗೌರವಿಸುತ್ತೇನೆ. ಅವರ ನಿಧನದಿಂದ ನನಗೆ ಅತೀವ ದುಃಖವಾಗಿದೆ. ಅವರ ಕುಟುಂಬ ಮತ್ತು ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ನನ್ನ ಸಂತಾಪಗಳು. ಓಂ ಶಾಂತಿ."

 

 

***

MJPS/SR


(Release ID: 2082987) Visitor Counter : 36