సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: దేశవ్యాప్తంగా బధిరుల కోసం సంకేత భాష
Posted On:
04 DEC 2024 2:44PM by PIB Hyderabad
దివ్యాంగ జనాభా గణాంకాల కోసం ప్రభుత్వం ప్రధానంగా జనాభా లెక్కల సమాచారంపై ఆధారపడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం 2.68 కోట్ల మంది వైకల్యంతో ఉండగా, వీరిలో 19% మందికి వినికిడి లోపాలు ఉన్నాయి. 42 సంస్థలు బధిరులైన విద్యార్థుల కోసం సంకేత భాషా వివరణలో డిప్లొమా కోర్సును (డీఐఎస్ఎల్ఐ) నిర్వహిస్తున్నారు. 13 సంస్థలు భారతీయ సంకేత భాషా బోధనలో డిప్లొమా (డీటీఐఎస్ఎల్) అందిస్తున్నాయి. 2024-25 సంవత్సరంలో డీటీఐఎస్ఎల్ కోర్సును నిర్వహించే సంస్థల సంఖ్య 7 నుంచి 13కు, డీఎస్ఎల్ఐ కోర్సు నిర్వహించే సంస్థల సంఖ్య 20 నుంచి 42కు పెరిగింది.
భారతీయ సంకేత భాష పరిశోధన, శిక్షణ సంస్థ (ఐఎస్ఎల్ఆర్టీసీ) చెవుడు, వినికిడి లోపాలపై అవగాహన కల్పించడానికి కింది చర్యలు తీసుకుంది:
-
ప్రస్తుతం ఈ శాఖ పరిధిలోని జాతీయ సంస్థలు, సంయుక్త ప్రాంతీయ కేంద్రంలో 665 మంది విద్యార్థులు డీఐఎస్ఎల్ఐ, డీటీఐఎస్ఎల్ లో శిక్షణ పొందుతున్నారు.
-
వివిధ సంస్థలు, కళాశాలు, విశ్వవిద్యాలయాల వంటి చోట్ల ఐఎస్ఎల్ఆర్టీసీ ఉచిత సదస్సులు నిర్వహించి అందులో పాల్గొన్న 1,000 మందికి పైగా వ్యక్తులకు చెవిటితనం, ఐఎస్ఎల్ పై సమగ్ర అవగాహన కల్పించింది.
-
ఐఎస్ఎల్ఆర్టీసీ రూపొందించిన ఐఎస్ఎల్ నిఘంటువును మరో 10 ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, దానిని ప్రాంతీయ భాషా వినియోగదారులకు అందుబాటులోకి తేవడంతోపాటు దాని పరిధిని విస్తరించారు (ఇప్పటికే ఉన్న ఇంగ్లిష్, హిందీ భాషలు కాకుండా). అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు – పది భాషలను ఐఎస్ఎల్ నిఘంటువులో నవీకరించారు.
-
బధిరులైన పాఠశాల పిల్లలతోపాటు డీఐఎస్ఎల్ఐ, డీటీఐఎస్ఎల్, డీఈడీ/బీఈడీ/ఎంఈడీ ప్రత్యేక విద్య కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారికి ఐఎస్ఎల్ఆర్టీసీ ఏటా ఐఎస్ఎల్ పోటీ నిర్వహించి ఐఎస్ఎల్ వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం పాఠశాలలను ప్రోత్సహిస్తుంది.
దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో డీఐఎస్ఎల్ఐ, డీటీఐఎస్ఎల్ కోర్సుల్లో ప్రవేశాలు, బ్యాచుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2080897)
Visitor Counter : 83