మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇటీవల షీ-బాక్స్ పోర్టల్ ను ప్రారంభించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ


పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం- 2013 నిబంధనలకు అనుగుణంగా రూపకల్పన
రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన స్థాయిలో ప్రైవేటు రంగంలో పని ప్రదేశాల్లో అంతర్గత కమిటీలు, స్థానిక కమిటీల కేంద్ర భాండాగారంగా పోర్టల్ రూపకల్పన

Posted On: 29 NOV 2024 4:21PM by PIB Hyderabad

దేశంలోని మహిళల రక్షణభద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్య అంశందీన్ని దృష్టిలో ఉంచుకునిప్రభుత్వం ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణనిరోధపరిష్కారచట్టం-2013’ను అమలు చేసిందిదీని ద్వారా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు సంబంధిత ఫిర్యాదులను పరిష్కరిస్తోందివయస్సుఉద్యోగ హోదాపని స్వభావంప్రైవేటు-వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగాలుగ్రామీణ-పట్టణ ప్రాంతాలు అన్న భేదం లేకుండా మహిళలందరూ ఈ చట్టం పరిధిలో రక్షణ పొందుతారుప్రభుత్వప్రైవేటు తారతమ్యం లేకుండా అన్ని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేని సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ చట్టం ప్రకారం యాజమాన్యాలపై ఉందిఉద్యోగులుకార్మికుల సంఖ్య 10 కన్నా ఎక్కువగా ఉన్న చోట యాజమాన్యం తప్పనిసరిగా ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందిఅదేవిధంగా పది మంది కన్నా తక్కువ కార్మికులున్న సంస్థల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి లేదా యజమానిపైనే ఫిర్యాదులు అందే సందర్భాల్లో వాటిని స్వీకరించడానికి ప్రతి జిల్లాలో స్థానిక కమిటీని ఏర్పాటు చేయడానికి ఆయా ప్రభుత్వాలకు అధికారం ఉందియజమానులు సహా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్షలతోపాటు వివిధ అంశాలకు సంబంధించిన తగినన్ని నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయినోడల్ మంత్రిత్వ శాఖ అయిన మహిళాశిశు అభివృద్ధి శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలురాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తుందిఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాల నిర్వహణ ద్వారా యజమానులుఉద్యోగులకు అవగాహన కల్పిస్తుంది.

ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం – స్వీకరించినపరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని సబంధిత ప్రభుత్వం తప్పకుండా నిర్వహించాలిఇటీవలి వరకు అంతర్గత కమిటీలుస్థానిక కమిటీల సంఖ్యతోపాటు నమోదైనపరిష్కృతమైన ఫిర్యాదుల సంఖ్యపై సమాచార నిర్వహణ కోసం కేంద్రీకృత వ్యవస్థ లేదుకాబట్టినోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న ఉన్న మహిళాశిశు అభివృద్ధి శాఖ ఇటీవల షీ-బాక్స్ ను ప్రారంభించిందికేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలు మెజార్టీ సంఖ్యలో పోర్టల్ లో ప్రవేశించిన అనంరం అక్టోబరు 19 నుంచి షీ-బాక్స్ లో ఫిర్యాదుల నమోదు మొదలైందిఅప్పటి నుంచి పోర్టల్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయివివిధ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత పరిపాలన స్థాయిల్లోప్రైవేటు రంగంలో పని ప్రదేశాల్లో అంతర్గత కమిటీలుస్థానిక కమిటీలకు ఓ కేంద్రీకృత వ్యవస్థగా ఉపయోగపడడం కోసం ఈ పోర్టల్ ను రూపొందించారు.

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణనిరోధకపరిష్కారచట్టం- 2013 నిబంధనలకు అనుగుణంగా షీ-బాక్స్ పోర్టల్ ను రూపొందించారుఈ చట్టం ప్రకారం విచారణ కోసం నిర్దేశిత కాల పరిమితి 90 రోజులు.

లోకసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో మహిళాశిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ఈ సమాచారాన్ని అందించారు.  

 

***


(Release ID: 2079476) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Hindi , Tamil