ఆర్థిక మంత్రిత్వ శాఖ
పాన్ 2.0 ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం
Posted On:
25 NOV 2024 8:49PM by PIB Hyderabad
ఆదాయపు పన్ను విభాగానికి చెందిన పీఏఎన్ (‘ప్యాన్’) 2.0 ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఆఇఏ) ఆమోదాన్ని తెలిపింది.
పాన్ 2.0 ప్రాజెక్టును అమలు చేయడానికి రూ. 1435 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.
పన్ను చెల్లింపుదారు నమోదు సేవలలో టెక్నాలజీ ఆధారిత మార్పులకు పాన్ 2.0 ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు అందించే ముఖ్య ప్రయోజనాలలో:
i. మెరుగైన నాణ్యతతో పాటు సేవల అందజేతలో సౌలభ్యమే కాకుండా సేవలను కూడా త్వరిత గతిన అందించ గలగడం;
ii. వాస్తవం, డేటా కచ్చితత్వాలు ఒకే మూలం (సోర్స్) ద్వారా అందుబాటులోకి రావడం;
iii. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రక్రియలతోపాటు ఖర్చులను వీలైనంత వరకు తగ్గించేందుకు వీలు ఏర్పడడం;
iv. మరింత సామర్ధ్యాన్ని సాధించడానికి మౌలిక సదుపాయాలను సురక్షితంగా ఉంచడం, ఇంకా వాటిని సానుకూలంగా వినియోగించుకోవడం వంటివి భాగంగా ఉంటాయి.
పన్ను చెల్లింపుదారులకు ఇప్పటి కన్నా ఉన్నతమైన డిజిటల్ మాధ్యమ వినియోగానుభవాన్ని అందించడానికి, పాన్/టాన్ సేవలలో మార్పును తీసుకు రావడానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పన్ను చెల్లింపుదారు నమోదు సేవల ప్రక్రియలలో మార్పు చేర్పులను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టే ఈ ప్యాఎన్ 2.0 ప్రాజెక్టు. ఇది ఇప్పుడున్న పాన్/టాన్ 1.0 ఇకో-సిస్టమ్ ను ఉన్నతీకరిస్తుంది. ఇది తత్సంబంధిత ముఖ్య కార్యకలాపాలను, అంతగా కీలకం కాని కార్యకలాపాలనే కాకుండా పాన్ ప్రామాణికత సేవను సైతం సమన్వయ పరుస్తుంది.
ప్రభుత్వంలో నిర్దిష్ట ఏజెన్సీల అన్ని డిజిటల్ వ్యవస్థలకు ఒకే ఉమ్మడి గుర్తింపు చిహ్నంగా పాన్ ను ఉపయోగించుకోవడానికి పాన్ 2.0 ప్రాజెక్టు బాటను పరుస్తూ, డిజిటల్ ఇండియా ఆవిష్కారంలో ప్రభుత్వ దార్శనికతకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
***
(Release ID: 2077404)
Visitor Counter : 6