గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన గౌరవ దినోత్సవం: గిరిజన సంస్కృతీ సంబరాలు

Posted On: 14 NOV 2024 1:11PM by PIB Hyderabad

పరిసరాలతో సమన్వయం చేసుకుంటూ ఎలా జీవించాలో, మన సంస్కృతి ఎంత గర్వకారణమైనదో భగవాన్ బిర్సా ముండా బోధించారు. అదే స్ఫూర్తితో, ఆయన కలలను సాకారం చేస్తూ.. గిరిజన ప్రజల సాధికారత కోసం మేం కృషిచేస్తున్నాం. –

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

పరిచయం

భారతీయ సాంస్కృతిక వైవిధ్యానికి మూలం.. గిరిజన సమాజాలుదేశ చరిత్రలోఅభివృద్ధిలో ఈ సమాజాలు కీలక పాత్ర పోషించాయిఈ గిరిజన ప్రజలు అందించిన సేవలనుముఖ్యంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో వారి చేసిన కృషినీ స్మరించుకుంటూ ఏటా నవంబరు 15న గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తారుఆ రోజు ఆదివాసీ నాయకుడుస్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతిఆయన వారసత్వం స్ఫూర్తినిస్తూనే ఉంటుందిదేశ వారసత్వ పరిరక్షణలోదేశాన్ని ముందుకు నడపడంలో గిరిజనుల విశిష్టతను ఈ సందర్భం చాటుతుంది.

 

నేపథ్యం

ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ 2021 నుంచి దేశవ్యాప్తంగా గిరిజన గౌరవ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారుభారత స్వాతంత్ర్య పోరాటంలో ఆదివాసీ ప్రజలు కీలకపాత్ర పోషించారు. సంతాల్తామరులుకోలుభిల్లులుఖాసీలుమిజో మొదలైన తెగల నేతృత్వంలో ఉద్యమాలు జరిగాయిఅపారమైన ధైర్య సాహసాలతో విప్లవాత్మకమైన పోరాటాలు చేసినా విస్తృత ప్రజాబాహుళ్యం చాలా వరకూ వారి కృషిని తగినంతగా గుర్తించలేదు.  

బిర్సా ముండా నేతృత్వంలోని ఉల్గులాన్ (విప్లవం) వంటి బ్రిటీష్ వ్యతిరేక గిరిజన ఉద్యమాలు... బ్రిటిష్ అణచివేతను సవాలు చేయడంలో కీలకంగా నిలవడంతోపాటు జాతీయ జాగరూకతను ప్రేరేపించాయిగిరిజనులు భగవాన్ గా ఆరాధించే బిర్సా ముండా నాయకత్వంలో దోపిడీ వలస పాలన వ్యవస్థకు వ్యతిరేకంగా తీవ్ర ప్రతిఘటన వెల్లువెత్తిందిఆయన జయంతి అయిన నవంబర్ 15 గిరిజన వీరులను స్మరించుకోవడానికి తగిన సందర్భం.

 

ఈ విస్మృత వీరుల త్యాగాలను మరువలేమని చాటుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన 2021లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారత ప్రభుత్వం నవంబర్ 15ను గిరిజన గౌరవ దినోత్సవంగా ప్రకటించిందిగిరిజనుల అద్భుతమైన చరిత్రసంస్కృతివారసత్వానికి ఈ రోజు నిదర్శనంభారతదేశ స్వాతంత్ర్యంపురోగతిలో వారి విశేష కృషికి గుర్తింపుగా.. ఐక్యతగౌరవ భావాలను పెంపొందించేలా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

2024లో గిరిజన గౌరవ దినోత్సవాలు

2024లో గిరిజన గౌరవ ఉత్సవాలలో భాగంగాభగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో నవంబర్ 13న ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడలుకార్మికఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మై భారత్ యువ వలంటీర్లతో కలిసి మాతి కే వీర్’ పాదయాత్రకు నాయకత్వం వహిస్తారుబిర్సా ముండాకు నివాళిగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ సాయిరాష్ట్రానికి చెందిన ఇతర మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారుభారత స్వాతంత్ర్య పోరాటంలో ముండా పోషించిన కీలకపాత్రకూదేశాభివృద్ధికి గిరిజన సమూహాల విశేషమైన కృషికీ ఈ కార్యక్రమం నివాళి.

 

నవంబరు 15న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ బీహార్ లోని జముయీని సందర్శించి జనజాతీయ గౌరవ్ దివస్ స్మారకోత్సవంతోపాటు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారుభగవాన్ బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణెంపోస్టల్ స్టాంపును కూడా ప్రధాని ఆవిష్కరిస్తారుగ్రామీణమారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంగిరిజన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా రూ.6,640 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవంశంకుస్థాపన చేస్తారు.

కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంశంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి:

·         గృహ ప్రవేశ వేడుకప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్ మన్కింద 11,000 గృహాల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు.

·         సంచార వైద్య కేంద్రాలు (ఎంఎంయూలు): గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ సదుపాయాలను మెరుగుపరచడం కోసం పీఎం-జన్ మన్ ద్వారా 23 ఎంఎంయూలుధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ద్వారా మరో 30 ఎంఎంయూలను ప్రధాని ప్రారంభిస్తారు.

·         గిరిజనుల్లో వ్యవస్థాపకతవిద్య300 వన్ ధన్ వికాస కేంద్రాలను (వీడీవీకే)గిరిజన విద్యార్థుల కోసం 10 ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలను (రూ. 450 కోట్లతోప్రారంభించడంతోపాటు మరో 25 ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలకు (రూ. 1,100 కోట్లతోశంకుస్థాపన చేస్తారు.

·         సాంస్కృతిక పరిరక్షణమధ్యప్రదేశ్ లోని ఛింద్వారాజబల్పూర్ లలో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల ప్రదర్శనశాలల ప్రారంభోత్సవంతోపాటు.. జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్సిక్కింలోని గ్యాంగ్ టక్ లలో రెండు గిరిజన పరిశోధన సంస్థలు.

·         మౌలిక సదుపాయాల అభివృద్ధి: పీఎం-జన్ మన్ ద్వారా 500 కి.మీ కొత్త రహదారులు100 బహుళ ప్రయోజన కేంద్రాలకు (ఎంపీసీశంకుస్థాపన.

గిరిజనుల సంక్షేమం కోసం పథకాలు

జనజాతీయ గౌరవ్ దివస్‌తోపాటు సామాజిక-ఆర్థిక సాధికారతసుస్థిరాభివృద్ధిసాంస్కృతిక పరిరక్షణ ద్వారా గిరిజన సమాజాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశపు షెడ్యూల్డు తెగల (ఎస్టీజనాభా 10.42 కోట్లు లేదా మొత్తం జనాభాలో 8.6%వారిలో 705 విభిన్నమైన సమూహాలు మారుమూలప్రవేశించలేని ప్రాంతాల్లో ఉన్నాయిఈ సమూహాల అభ్యున్నతి కోసం.. విద్యవైద్యంఆర్థిక అవకాశాలను మెరుగుపరచి గిరిజన సంస్కృతిని పరిరక్షించడంపై దృష్టి సారించే వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందివారి సమగ్ర అభివృద్ధితోపాటు జాతీయ ప్రధాన స్రవంతిలో వారిని ఏకీకరణ చేయడంలో భరోసా కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం వాటిని చేపట్టింది.

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలుఆర్థిక చేయూత

1974-75లో గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ)తో గిరిజనుల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయిఅవి షెడ్యూల్డు ట్రైబ్ కాంపొనెంట్ (ఎస్టీసీ), షెడ్యల్డు తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక (డీఏపీఎస్టీ)గా మార్పు చెందాయిఈ కార్యక్రమాలు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో గిరిజన సంక్షేమానికి హామీ ఇచ్చాయిడీఏపీఎస్టీ బడ్జెట్ రూ. 25,000 కోట్ల నుంచి 2023-24లో రూ. 1.2 లక్షల కోట్లకు పెరగడం ద్వారా ఆర్థిక సహకారం గణనీయంగా మెరుగుపడింది. 2024-25 కేంద్ర బడ్జెట్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 13,000 కోట్లు కేటాయించిందిఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 73.60% పెరిగింది.

ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ప్రారంభం

2024 అక్టోబరు 2న జార్ఖండ్ లోని హజారీబాగ్ లో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారురూ. 79,156 కోట్ల వ్యయంతో దాదాపు 63,843 గిరిజన గ్రామాల్లో సాంఘిక మౌలిక సదుపాయాలుఆరోగ్యంవిద్యజీవనోపాధిని అభివృద్ధి చేయడం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమ లక్ష్యం. 30 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లోని 549 జిల్లాల్లోని 2,911 బ్లాకుల్లో ఉన్న 5.38 కోట్ల మందికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందికేంద్ర ప్రభుత్వ 17 మంత్రిత్వ శాఖలువిభాగాల్లోని 25 ప్రత్యేక విభాగాలను ఇది ఏకీకృతం చేస్తుంది.

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్ మన్)

ధర్తీ ఆబా కార్యక్రమంతో పాటుప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్ మన్కింద ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. 2023 నవంబరు 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా జార్ఖండ్ లోని ఖుంతీ జిల్లాలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారుఇది అత్యంత దుర్బల గిరిజన సమూహాల (పీవీటీజీఅభ్యున్నతి కోసం ఉద్దేశించిన కార్యక్రమం. 2023-24 నుంచి 2025-26 వరకూ రూ. 24,104 కోట్ల బడ్జెట్ తో పీవీటీజీ బృందాల జీవన నాణ్యతను మెరుగుపరచడంపై ఈ కార్యక్రమం దృష్టిపెడుతుందిఆధార్ నమోదుకుల ధ్రువీకరణ పత్రాలుపీఎం-జనధన్ యోజనఆయుష్మాన్ కార్డులు సహా నిర్దేశిత సహకారాన్ని అందించడం ఈ పథకం కార్యాచరణలో భాగంపీవీటీజీ కుటుంబాల్లో సాధికారత కల్పించిదేశ సామాజిక-ఆర్థిక ప్రధాన స్రవంతితో వారిని ఏకీకృతం చేయడం కోసం.. ఎక్కువమందిని చేరడంస్థానిక భాగస్వామ్యంబలమైన సమన్వయంపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంది.

ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏఏజీవై)

గిరిజనుల జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్న గ్రామాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏఏజీవైలక్ష్యంప్రాథమిక మౌలిక సదుపాయాలను అందించడం కోసం.. 50% గిరిజన జనాభా ఉన్న, 500 మంది షెడ్యూల్డు తెగ వ్యక్తులు ఉన్న 36428  గ్రామాలను ఈ పథకం కింద గుర్తించారునీతి ఆయోగ్ గుర్తించిన అభిలషణీయ జిల్లాల్లోని గ్రామాలు కూడా అందులో ఉన్నాయి.

ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు (ఈఎంఆర్ఎస్)

మారుమూల ప్రాంతాల్లోని షెడ్యూల్డు తెగల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారికి ఉన్నత విద్యఉపాధి అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించిన కేంద్రప్రభుత్వ పథకంలో భాగంగా 2018-19లో ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు (ఈఎంర్ఎస్ప్రారంభమయ్యాయిఈ పాఠశాలలు నవోదయ విధానాన్ని అనుసరిస్తాయిఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు 480 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తాయి.

ఇప్పటి వరకు ఈ పాఠశాల్లో 1.29 లక్షల మంది గిరిజన విద్యార్థులు నమోదు చేసుకున్నారుప్రభుత్వం 728 ఈఎంఆర్ఎస్ పాఠశాలలకు అనుమతులు ఇచ్చిందివాటిలో 440 కొత్త పాఠశాలలను (ఇప్పటికే ఉన్న 12 ప్రాంతాలు మినహాప్రస్తుత పథకం కింద ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారుతద్వారా గిరిజన సమూహాలకు మరింత నాణ్యమైన విద్యా సదుపాయాలను విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గిరిజన సాధికారత కోసం ప్రభుత్వ ఉపకార వేతనాలునిధులు

విద్యనైపుణ్యాభివృద్ధిపై దృష్టిసారిస్తూ.. సాధికారత దిశగా గిరిజన సమూహాలకు చేయూతనిచ్చేలా వివిధ ఉపకార వేతనాలుఆర్థిక చేయూతను ప్రభుత్వం అందిస్తోంది.

1. ప్రీ-మెట్రిక్పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతన పథకాలు

ఈ ఉపకార వేతనాలు మధ్యలో బడి మానేసే వారి సంఖ్యను తగ్గించివిద్యాపరంగా గిరిజన విద్యార్థులకు చేయూతనివ్వడానికి ఉద్దేశించినవి.

·         ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్: ఉన్నత విద్యాభ్యాసం దిశగా ప్రోత్సహించేందుకు 9, 10 తరగతుల్లోని ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక చేయూత.

·         పోస్ట్-మెట్రిక్ స్కాలర్ షిప్: పదకొండో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల వరకూ ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా ఇచ్చేలా ఆర్థిక సాయం అందించడం.

2. ఎస్టీ విద్యార్థుల కోసం జాతీయ స్థాయి విదేశీ ఉపకార వేతనం

ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్డాక్టరేట్పోస్ట్-డాక్టరల్ విద్యను అభ్యసించే అవకాశాన్ని ఈ పథకం అందిస్తుందియోగ్యతఅంతర్జాతీయ అవగాహనలకు ప్రాధాన్యమిస్తూ ఏటా 20 వార్డులను ప్రభుత్వం అందిస్తుందివాటిలో 30% మహిళా అభ్యర్థులకు కేటాయించారు.

3. ఎస్టీ విద్యార్థుల కోసం జాతీయ ఫెలోషిప్

ఉన్నత విద్య అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు ఈ ఫెలోషిప్ పథకం పూర్తి డిజిటల్ ప్రక్రియ ద్వారా చేయూతనిస్తుందిసమయానుకూల ఆర్థిక సాయండిజిలాకర్ తో ఏకీకరణ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం లభిస్తుంది.

 ఆదాయ సృష్టిఆర్థిక సాధికారత పథకాలు

గిరిజన సమాజాల ఆదాయాన్ని సృష్టించడంఆర్థికాభివృద్ధిపై దృష్టిపెడుతూ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది.

·         నిర్ణీత కాలపరిమితి రుణాల పథకం (టర్మ్ లోన్ స్కీమ్వ్యాపార వ్యయంలో 90% వరకూ మార్కెట్ రేటు కన్నా తక్కువ వడ్డీకి అందిస్తుందితిరిగి చెల్లింపునకు కాలపరిమితి నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.

·         ఆదివాసీ మహిళా సశక్తికరణ్ యోజన (ఏఎంఎస్ వైగిరిజన మహిళలకు 4% వడ్డీకి లక్షల వరకు రాయితీ రుణాలను అందిస్తుంది.

·         సూక్ష్మరుణ పథకం గిరిజన స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది.

v.            ఆదివాసీ శిక్షా రిణ్ యోజన (ఏఎస్ఆర్ వైఉన్నత విద్య అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు మార్కెట్ రేటు కన్నా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుందిఈ కార్యక్రమాలు గిరిజన జనాభాలో వ్యవస్థాపకతవిద్యస్వావలంబనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మెరుగైన ఫలితాల కోసం ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు

గిరిజన సమూహాల్లో వ్యాధి నివారణఆరోగ్య రక్షణ సదుపాయాలపై దృష్టిసారిస్తూ మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం అనేక ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది.

1. సికిల్ సెల్ రక్తహీనత నివారణ కార్యక్రమం

2023 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారుసికిల్ సెల్ వ్యాధి (ఎస్ సీడీ)ని నివారించడం ఈ మిషన్ లక్ష్యంమధ్యపశ్చిమదక్షిణ భారతదేశంలోని గిరిజన జనాభాలో ఎక్కువగా ఉన్న జన్యుపరమైన రక్త రుగ్మత.

2. మిషన్ ఇంద్రధనుష్ 

గిరిజన సమూహాలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతూ.. రెండేళ్ల లోపు పిల్లలుగర్భిణులకు టీకాలు వేస్తూ వారిలో పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధకతను పెంచే కార్యక్రమంఉచితంగా కోవిడ్-19 టీకాలను కూడా అందించి గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా కల్పించిందివ్యాధి నిరోధకతను పెంచడంవెనుకబడినమరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో టీకాల ద్వారా అరికట్ట వ్యాధులను తగ్గించడం ఈ మిషన్ లక్ష్యం.

3. నిక్షయ్ మిత్ర కార్యక్రమం

ఇది క్షయ వ్యాధి లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమంక్షయ వ్యాధిగ్రస్తులకుముఖ్యంగా గిరిజన వర్గాల వారికి రోగనిర్ధారణపోషకాహారంవృత్తిపరమైన సహాయాన్ని అందిస్తోందిపోషకాహార సాయంవృత్తిపరమైన శిక్షణతో రీకవరీని మెరుగుపరచడం సహా టీబీ రోగులకు ఈ కార్యక్రమం అదనపు సహకారాన్ని అందిస్తోందిగిరిజన ప్రాంతాల్లో టీబీని సమర్థవంతంగా ఎదుర్కోవడంఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంముందస్తుగా గుర్తింపుచికిత్సలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది.

5. జాతీయ ఆరోగ్య కార్యక్రమం (నేషనల్ హెల్త్ మిషన్ ఎన్ హెచ్ఎం), హెమోగ్లోబినోపతి మార్గదర్శకాలు

గిరిజన జనాభాలో ఎక్కువగా కనిపించే సికిల్ సెల్ వ్యాధి (ఎస్ సీడీసహా హిమోగ్లోబినోపతి నివారణనియంత్రణ కోసం ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర మార్గదర్శకాలను అభివృద్ధి చేసిందిఎస్ సీడీ ప్రభావ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం పరీక్షించడంఅవగాహన కార్యక్రమాలుఆరోగ్య రక్షణ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా నిర్మూలన చర్యలను వేగవంతం చేస్తోంది.

6. ప్రధానమంత్రి మాతృ వందన యోజన: గిరిజన మహిళలకు ప్రసూతి పూర్వప్రసవానంతర ఆర్థిక చేయూతను అందించడం ద్వారా తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించిన పథకం.

భారతీయ గిరిజన సమాజాలకు గుర్తింపుగౌరవం

గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా.. బ్రిటీష్ పాలనను గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటించిన రాష్ట్రాలలో 10 గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. 2022 నవంబరు 1న రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో మాన్‌గర్ ధామ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు1913లో బ్రిటీష్ మారణకాండలో 1,500 మంది భిల్లు తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు అమరులైన ప్రాంతమదిరాజస్థాన్గుజరాత్మధ్యప్రదేశ్మహారాష్ట్రల సంయుక్త ప్రయత్నమైన ఈ స్మారక నిర్మాణం.. గిరిజనుల ప్రతిఘటననూసాంస్కృతిక వారసత్వాన్నీ జాతీయ స్థాయిలో చాటుతుంది.

ప్రభుత్వ ఇతర చర్యలతోపాటు ఈ కార్యక్రమాలన్నీ గిరిజన సమాజాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి బాటలు వేయడంతోపాటు వారి సంస్కృతీ వారసత్వాలుజీవన విధానాలకు గుర్తింపు తెస్తున్నాయి.

ముగింపు

విద్యఆరోగ్యంసామాజిక-ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించి.. ఈ వర్గాల సాధికారత కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందిఅవగాహనను పెంచడంసంఘీభావాన్ని పెంపొందించడం ద్వారా గిరిజనుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తూదేశ పురోగతితో వారిని ఏకీకృతం చేస్తూ గిరిజన సంస్కృతులను పరిరక్షించగలంఈ చర్యల ద్వారా గిరిజన సమాజాలు అభివృద్ధి చెందుతూదేశాభివృద్ధికి దోహదపడతాయిగిరిజన వారసత్వ సంరక్షణ ప్రాధాన్యాన్ని చాటడంతోపాటు గిరిజన సమాజాల సేవలను గౌరవించడాన్ని గిరిజన గౌరవ దినోత్సవం లక్ష్యంగా పెట్టుకుంది.  

 

***


(Release ID: 2073518) Visitor Counter : 20


Read this release in: Urdu , English , Hindi , Tamil