రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో ప్రాజెక్ట్ డిజిటల్ కోస్ట్ గార్డ్‌కు సంబంధించిన టైర్-3 డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ఐసీజీ

Posted On: 06 NOV 2024 1:01PM by PIB Hyderabad

డిజిటల్ కోస్ట్ గార్డ్ (డీసీజీ) ప్రాజెక్టుకు చెందిన టైర్-3 డేటా కేంద్రానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (విధానం, ప్రణాళికలు), భారత తీర రక్షక దళం (ఐసీజీ) ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆనంద్ ప్రకాశ్ బడోలా న్యూఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో ఈ నెల 5న శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు డీసీజీకి సంబంధించిన అన్ని అప్లికేషన్లు, ఐటీ వ్యవస్థలను పర్యవేక్షించే, నిర్వహించే ప్రధాన కేంద్రంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ టైర్-3 డేటా సెంటర్ పనిచేస్తుంది. తద్వారా ఐసీజీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన తోడ్పాటును అందిస్తుంది.

టెలి కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ డీసీజీని చేపడుతోంది. దీనితో పాటుగా న్యూఢిల్లీలోని స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ డేటాసెంటర్‌ను, కర్ణాటకలోని న్యూమంగళూరులో డిజాస్టర్ రికవరీ డేటా సెంటర్‌ను నిర్మిస్తుంది. ఓడలతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన ఐసీజీ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. అలాగే ‘ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అప్లికేషన్‌’ అమలు చేస్తుంది.

 

***




(Release ID: 2071110) Visitor Counter : 17


Read this release in: English , Urdu , Hindi , Tamil