యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2023 కు అభ్యర్థుల కన్సాలిడేటెడ్ రిజర్వు జాబితా ప్రకటించిన యూపీఎస్సీ

Posted On: 25 OCT 2024 8:02PM by PIB Hyderabad

ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, మరికొన్ని కేంద్ర సర్వీసుల, గ్రూప్ 'ఎ', గ్రూప్ 'బి'లలో 1,143 ఖాళీల నియామకాలకు సంబంధించి అర్హత కలిగిన 1016 మంది అభ్యర్థులను సిఫార్సు చేస్తూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాలను 16.04.2024న పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్, 2023లోని రూల్ 20 (4), 20 (5) ప్రకారం, సంబంధిత రంగాల కింద చివరి సిఫార్సు చేసిన అభ్యర్థి కంటే తక్కువ అర్హత క్రమంలో కన్సాలిడేటెడ్ రిజర్వ్ జాబితాను కూడా నిర్వహించినట్లు కమిషన్ పత్రికా ప్రకటనలో తెలిపింది.

2023 సివిల్ సర్వీసెస్ పరీక్షల ఆధారంగా మిగిలిన పోస్టులను భర్తీ చేయడానికి 88 జనరల్, 05 ఈడబ్ల్యూఎస్, 23 ఓబీసీ, 03 ఎస్సీ, 01 ఎస్టీలతో సహా 120 మంది అభ్యర్థులను కమిషన్ సిఫారసు చేసింది. అలా సిఫార్సు చేసిన అభ్యర్థులకు నేరుగా డీవోపీ&టీ సమాచారం అందిస్తుంది.

ఎంపిక చేసిన 30 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికమే.

ఎంపికైన 120 మంది అభ్యర్థుల జాబితా యూపీఎస్సీ వెబ్‌సైట్ http//www.upsc.gov.in. లో అందుబాటులో ఉంది.

 

Click here to download Result



*****


(Release ID: 2068309) Visitor Counter : 54


Read this release in: English , Urdu , Hindi