శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తియ్యనిదే కాదు.. ఔషధంగా పని చేసే స్టీవియా
Posted On:
21 OCT 2024 4:07PM by PIB Hyderabad
స్టీవియా ఆకులు తినడానికి తియ్యగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం.. స్టీవియా బౌవుడియానా బెర్టోనీ. క్యాండీ లీఫ్ అన్నా ఇదే. సహజసిద్ధమైన తియ్యదనాన్ని కలిగి ఉండటం, శక్తినిచ్చే పదార్ధాలేవీ లేకపోవడం దీని ప్రత్యేకత. హార్మోన్లు, జీవక్రియ, రోగ నిరోధకశక్తి, గుండె జబ్బులు వంటి వ్యాధులను తగ్గించే ఔషధ గుణాలు ఈ స్టీవియా మొక్కలకు ఉంది. కణ స్థాయిలో జరిగే సంకేతాలను ప్రభావితం చేయడమే అందుకు కారణమని ఒక తాజా అధ్యయనంలో తేలింది.
స్టీవియాను ప్రపంచం నలుమూలలకు అస్సాం రాష్ట్రం ఎగుమతి చేస్తోంది. స్టీవియా వినియోగం అధికంగా ఉన్న కారణంగా దీనిని మరిన్ని ప్రాంతాల్లో సాగు చేసినట్లయితే భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలకు లాభదాయకమని భారత ప్రభుత్వ ఈశాన్య మండలి సూచించింది.
ఔషధ లక్షణాలు, కణాల మధ్య సంకేతాల పరంగా స్టీవియా ప్రభావంపై శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన విభాగంలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఏఎస్ఎస్‌టీ)కి చెందిన పరిశోధకుల బృందం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ బృందం సభ్యుల్లో అసోసియేట్ ప్రొఫెసరు డాక్టర్ ఆశీస్ బాల, డైరెక్టరు ప్రొఫెసరు ఆశీస్ కె. ముఖర్జీ, పరిశోధక విద్యార్థిని పియాలి దేవ్ రాయ్ ఉన్నారు.
ఇన్ విట్రో, ఇన్ వివో విధానాల్లో నెట్ వర్క్ ఫార్మకాలజీలో వీరు అధ్యయనాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రొటీన్ కైనసీ సి (పీకేసీ)ని ఉపయోగించుకుని ఫాస్ఫేట్ తో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని గుర్తించారు. ఈ ఫాస్ఫోరైలేషన్ ప్రక్రియ ద్వారా మొక్క... కణాల మధ్య సంకేతాలను నిరోధించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
కణజాల వాపు, రోగ నిరోధకశక్తి, వినాళ గ్రంథుల వ్యవస్థ, గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యకూ, పీకేసీ మధ్య సంబంధం ఉంది. అయితే పీకేసీ ఫాస్ఫోరైలేషన్ ను పూర్తిగా అడ్డుకుంటున్నది. తద్వారా- వినాళ గ్రంథుల జైవిక క్రియ సమస్యలకూ, గుండె రక్తనాళాల సమస్యలకు దారితీసే పరిస్థితుల్ని పూర్తిగా మార్చివేస్తున్నది.
ఈ రంగంలో స్టీవియా మొట్టమొదటిసారిగా ఒక ఆశను రేకేత్తిస్తోందని ఈ అధ్యయనం చాటుతోంది. అంతేకాకుండా, క్రియాశీల స్టీవియా అణువులు ఏఎమ్‌పీకేకి ప్రతిస్పందిస్తున్నాయి. అయితే ఈ దిశలో మరిన్ని పరిశోధనలను చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ అధ్యయనం సూచిస్తోంది.
ఈ పరిశోధన ముఖ్యాంశాలను ‘‘ఫూడ్ బయోసైన్స్’’ పత్రికలో ప్రచురించారు. వ్యాధి నిరోధక చికిత్సలో ఉపయోగపడగల స్టీవియా సత్తాను ఈ కథనంలో వివరించారు. టైప్ వన్, టైప్ టూ మధుమేహం, రోగ నిరోధక శక్తి వల్ల వచ్చే మధుమేహం,
పూర్వ దశలో ఉన్న మధుమేహం... దీర్ఘకాల వ్యాధి కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్), మూత్రపిండాల వ్యాధులు, బీపీ, గుండె జబ్బులు, ఇతర రక్తనాళ సమస్యలకు స్టీవియా పని చేస్తుంది.
ఈ అధ్యయనాన్ని నిర్వహించడం ద్వారా స్టీవియాకి సంబంధించిన ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఆలోచించడం, లభిస్తున్న శాస్త్రీయ సమాచారం సంప్రదాయ వైద్య విధానాలను బలోపేతం చేస్తాయి.
చిత్రం: పరిశోధక బృందం ఉపయోగించిన వైజ్ఞానిక పద్ధతి : లక్ష్యాన్ని గుర్తించడానికి నెట్ వర్క్ ఫార్మకాలజీ వినియోగం, అటు తరువాత లక్ష్యాన్ని రూఢి పరచడానికి మాలిక్యులర్ డాకింగును చేపట్టారు. తదనంతరం, హెచ్ పీటీఎల్ సీ యొక్క ఇన్ విట్రో, ఇన్ వివో అధ్యయనాలు ప్రొటీన్ కినేస్ సి ఫాస్ఫరైలేషన్ చురుకుదనాన్ని తగ్గించడంలో స్టీవియా రెబావుడియానా ఎంత ప్రభావశీలంగా ఉన్నదీ తేటతెల్లం చేశాయి.
(Release ID: 2067019)
Visitor Counter : 92