బొగ్గు మంత్రిత్వ శాఖ
‘వాణిజ్య బొగ్గు గనుల వేలం’ బిడ్లను తెరిచిన మంత్రిత్వ శాఖ
10వ రౌండ్ బిడ్లనూ 8, 9వ రౌండ్ల కోసం రెండో విడతలో దాఖలైన బిడ్లనూ తెరిచిన మంత్రిత్వ శాఖ
Posted On:
21 OCT 2024 6:42PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత నామినేటెడ్ అథారిటీ ఈరోజు వాణిజ్య బొగ్గు గనుల 10వ రౌండ్ బిడ్లను అలాగే 9, 8వ రౌండ్ కోసం రెండో విడతలో దాఖలైన బిడ్లను తెరిచింది. ఈ రౌండ్ జూన్ 21న ప్రారంభమైంది, అయితే బిడ్డర్లకు తగినంత సమయం ఇవ్వడం కోసం బిడ్ సమర్పణ తేదీని రెండుసార్లు పొడిగించారు.
ఆన్‌లైన్ బిడ్లను డీక్రిప్ట్ చేసి బిడ్డర్ల సమక్షంలో ఎలక్ట్రానిక్‌గా తెరిచారు. అనంతరం, ఆఫ్‌లైన్ బిడ్ పత్రాలు గల సీల్డ్ ఎన్వలప్‌లను కూడా బిడ్డర్ల సమక్షంలో తెరిచారు. బిడ్డర్ల కోసం ఈ మొత్తం ప్రక్రియను స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ రౌండ్ కోసం, ఆన్‌లైన్‌లో మొత్తం 45 బిడ్‌లు స్వీకరించగా, భౌతిక రూపంలో 44 బిడ్‌లు మాత్రమే వచ్చాయి.
10వ రౌండ్ కోసం కేటాయించిన 61 బొగ్గు గనుల్లో 16 గనుల కోసం మొత్తం 43 బిడ్‌లు వచ్చాయి. అలాగే, 9వ రౌండ్ రెండో విడత కోసం కేటాయించిన 5 గనులకు గానూ కేవలం 1 బిడ్ మాత్రమే దాఖలవగా, 8వ రౌండ్ రెండో విడత కోసం కేటాయించిన 1 గని కోసం ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు.
ఈ బిడ్లను మల్టీ-డిసిప్లినరీ టెక్నికల్ ఎవల్యూషన్ కమిటీ మదింపు చేయనుంది. సాంకేతికంగా అర్హత సాధించిన బిడ్డర్స్‌ను ఎమ్ఎస్‌టీసీ పోర్టల్‌పై నిర్వహించే ఎలక్ట్రానిక్ వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు.
****
(Release ID: 2066896)
Visitor Counter : 48