కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐటీయూ కెలిడోస్కోప్ 2024 – నూతన ఆవిష్కరణలకు, ప్రాపంచిక సమన్వయానికి మార్గదర్శనం


అత్యధిక సంఖ్యలో అందిన అధ్యయన పత్రాలు

ప్రపంచ విపణిని దృష్టిలో పెట్టుకొని దేశీయ సాంకేతికతలను అభివృద్ధిపరచడంలో భారతదేశపు ప్రాముఖ్యతను చెప్పే కార్యక్రమం

Posted On: 20 OCT 2024 5:04PM by PIB Hyderabad

ప్రపంచం దీర్ఘకాలిక మనుగడను దృష్టిలో పెట్టుకొని నూతన ఆవిష్కరణలుడిజిటల్ పరివర్తన’ అన్న ఇతివృత్తం ఆధారంగా 15వ ఐటీయూ కెలిడోస్కోప్ ఎకడమిక్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపటి రోజు (2024 అక్టోబరు 21)న ప్రారంభం కానుందిఅంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల సంబంధిత పరిశోధనఇంకా ప్రమాణాల అభివృద్ధి పరంగా చూస్తే ఒక చెప్పుకోదగ్గ మేలిమలుపుగా ఈ సమావేశం నిలుస్తుందని భావిస్తున్నారుఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం అక్టోబరు 21న మొదలై అక్టోబరు 23 వరకు జరుగనుంది. 5జీకృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటీ), క్వాంటమ్ కమ్యూనికేషన్లుఇతర పరివర్తన ప్రధాన సాంకేతిక విజ్ఞానాలలో అత్యంత తాజా పరిణామాలను చర్చించడానికి విద్యపరిశ్రమప్రభుత్వం.. ఈ మూడు రంగాల అత్యంత ప్రతిభావంతులను ఈ సమావేశం ఒక చోటుకు తీసుకు రానుంది.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌టెలికమ్యూనికేషన్లలో నూతన ఆవిష్కరణలనుసహకారాన్ని పెంపొందింప చేసేందుకు ఒక కీలక వేదికగా కెలిడోస్కోప్ 2024 నిలవబోతోందిఇదివరకు ఎన్నడూ రానంత ఎక్కువ సంఖ్యలో అధ్యయన పత్రాలు ఈ సంవత్సరంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చాయిఈ సన్నివేశం డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టెలికమ్యూనికేషన్ల ప్రమాణాలకు సంబంధించి రాబోయే కాలంలో ఎలాంటి మార్పులూ చేర్పులు చోటు చేసుకోవచ్చనే అంశంపై ప్రపంచ దేశాలలో పెరిగిపోతున్న కుతూహలానికి అద్దం పడుతోంది. 140కి పైగా పత్రాలు అందడం ఈ కార్యక్రమం చరిత్రలో ఇదే తొలిసారిఈ అంశం దీర్ఘకాలం పాటు మనుగడడిజిటల్ ఇన్‌క్లూజన్ఇంకా భద్రతలు సహా ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించడంలో సరికొత్త పరిశోధనలు జరిగాయని నిరూపిస్తున్నది.

కెలిడోస్కోప్ 2024 తాలూకు కొన్ని ప్రధాన అంశాలు:

1. అగ్రగామి మూడు పత్రాలను తలా  2000 సీహెచ్ఎఫ్ బహుమతి తో సత్కరించనున్నారు

టెలికమ్యూనికేషన్స్ రంగంలో అత్యంత వినూత్నఅమిత ప్రభావాన్విత పరిశోధనలను మూడింటిని ఎంపిక చేసి ఒక్కొక్క పత్రానికి 2000 సీహెచ్ఎఫ్ (స్విస్ ఫ్రాంకు)ల నగదు బహుమతితో  సత్కరించనున్నారు

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ నిపుణుల సంఘం పరిశీలించిన అనంతరం వీటిని ఎంపిక చేశారువిజేతలుగా నిలిచిన పత్రాలు క్వాంటమ్ కమ్యూనికేషన్నెట్‌వర్క్ సెక్యూరిటీలతో పాటు 5జీ వినియోగం వంటి రంగాలలో అతి కీలక మార్పులను ఆవిష్కరించాయి.

2.   యువ రచయితలకు పట్టం

నవ తరం పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఒక ప్రత్యేక ప్రయత్నంలో భాగంగా ఐటీయూ ఎంపిక చేసిన పత్రాలను సమర్పించిన యువ రచయితలకు నైపుణ్య ధ్రువపత్రాలను ఇచ్చివారిని సత్కరించనుందియువ ప్రతిభాన్వితులను ప్రోత్సహించాలన్నప్రపంచంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కు తోడ్పడే టెలికమ్యూనికేషన్స్ రంగ సంబంధిత ఆధునిక పరిశోధనలకు పట్టం కట్టాలన్న ఐటీయూ దృఢదీక్షను ఈ కార్యక్రమం చాటిచెబుతున్నది.

3.  మూడు రోజుల పాటు సాగనున్న  ఆలోచనాపూర్ణ నాయకత్వ మేధోమథనం

6జీ తాలూకు నెట్‌వర్క్ నిర్మాణాలుకృత్రిమ మేధ (ఏఐఆరోగ్య సంరక్షణ రంగంలో పోషించదగ్గ పాత్రస్మార్ట్ సిటీస్ కోసం ఐఓటీ (ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్వినియోగంక్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి విస్తృత శ్రేణి అంశాలను గురించిన సాంకేతిక సదస్సులుఇంకా మండలి చర్చలు ఈ సమావేశంలో చోటు చేసుకోనున్నాయి.  ఉద్దండ నిపుణులుకీలక సంబంధిత వర్గాల వారు (స్టేక్ హోల్డర్స్ఈ సదస్సులలో పాలుపంచుకొనికొత్తగా ఉనికి లోకి వస్తున్న సాంకేతికతలు ఇవ్వజూపే అవకాశాలుసవాళ్ళను పట్టించుకొనివాటికి వారి వంతు పరిష్కారాలను సూచించనున్నారు.

4. భౌగోళిక ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్‌డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యుటీఎస్ఏ-24)లో భాగంగా జరుగుతున్న కెలిడోస్కోప్ 2024 తదుపరి తరం సాంకేతికతలకు అవసరమైన భౌగోళిక ప్రమాణాలను నిర్దేశించడంలో అంతర్జాతీయ సమన్వయం ఎంతైనా ముఖ్యమని కూడా చెప్పనుంది.  అన్ని వర్గాలను కలుపుకొనిపోతూభద్రమైన దీర్ఘకాలంపాటు మన్నే తరహాలో ఈ సాంకేతికతలను  అమలుపరచి తీరాలని స్పష్టం చేయనుంది

5.  మూడో రోజున మండలి చర్చ

సమావేశాలలో చివరి రోజైన అక్టోబరు 23న మండలి చర్చలను రెండిటిని నిర్వహించనున్నారు.  ఒకటో ప్యానెల్ డిస్కషన్ లో మిగిలిన ‘‘మూడు బిలియన్ మందిని కలపడం’’ అనే అంశంపై శ్రద్ధ తీసుకోనున్నారు.  రెండో ప్యానెల్ డిస్కషన్ లో భౌగోళిక ప్రమాణాలను అభివృద్ధి పరచడంలో యువతీ యువకులు పోషించవలసిన పాత్ర ఏమిటనేది పరిశీలిస్తారు.  దీనిలో భాగంగా టెలికమ్యూనికేషన్స్ఇంకా సాంకేతిక విజ్ఞానం సంబంధిత ప్రమాణాల అంశాలలో యువత ప్రాతినిధ్యాన్నియువత అందించవలసిన సేవలను మరింత పెంచడమే ధ్యేయంగా పెట్టుకోనున్నారు.

భౌగోళిక టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థలో భారతదేశం భూమిక

ఈ సంవత్సరంలో కెలిడోస్కోప్ నకు ఆతిధేయిగా వ్యవహరిస్తూ భారతదేశం భౌగోళిక డిజిటల్ ఇకోసిస్టమ్ లో తన నాయకత్వ పాటవం అంతకంతకూ పెరుగుతోందని రుజువు చేసుకొంటోంది. ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కీలక కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో నూతన ఆవిష్కరణలకు ఒక ముఖ్య కూడలిగా మన దేశం తనను ఆవిష్కరించుకొందికెలిడోస్కోప్ 2024  5జీ సేవల వినియోగం పరంగా భారతదేశం పురోగతిని తెలియజేయడం ఒక్కటే కాకుండాప్రపంచ విపణి కోసం దేశీయంగా సాంకేతికతల ఆవిష్కరణలో ఇండియా పోషిస్తున్న పాత్రను కూడా వెల్లడి చేస్తోంది.

టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రపంచ స్థాయి చర్చలకు ముఖ్య బిందువుగా న్యూఢిల్లీ నిలుస్తున్న క్రమంలోనవకల్పనఅన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగడంప్రపంచం అంతటా డిజిటల్ సాంకేతికతల దీర్ఘకాలిక మనుగడలకు చోదక శక్తిగా నిలచే భావి సహకార ప్రధాన కార్యాచరణకు ఒక దిశను ఈ నగరం చూపనుంది.

ఐటీయూ కెలిడోస్కోప్ ను గురించి

ఐటీయూ కెలిడోస్కోప్ ఏడాదిలో ఒకసారి జరిగే కార్యక్రమంఇది టెలికమ్యూనికేషన్స్ రంగ సాంకేతికతలకు ప్రపంచ స్థాయి ప్రమాణీకరణను ఏర్పరచడంలో దోహదం చేసే ఆలోచనల ఆదాన ప్రదానాన్ని ప్రోత్సహిస్తూపండితులకుపరిశ్రమకు మధ్య అంతరాన్ని పూడ్చే వంతెనలా ఉంటోంది.  కెలిడోస్కోప్ నిర్వహణను 2008లో మొదలు పెట్టినప్పటి నుంచి ఇది డిజిటల్ కమ్యూనికేషన్స్ భవితను చర్చించడంలో అత్యంత  ప్రభావాన్విత చర్చల వేదికలలో ఒకటిగా పేరు తెచ్చుకొందిఈ వేదిక పరిశోధకులకునూతన ఆవిష్కర్తలకు వారి అత్యంత ఆశాజనకమైన అధ్యయనాలను సమర్పించడానికి ఒక అవకాశాన్ని  ఇస్తూ వస్తోంది.

ఈ కార్యక్రమం గురించినవక్తలను గురించినఇంకా సదస్సులను గురించిన సమగ్ర సమాచారాన్ని https://www.itu.int/en/ITU-T/academia/kaleidoscope/2024/Pages/default.aspx లింకు లో ఆధికారిక ఐటియూ కెలిడోస్కోప్ 2024 వెబ్ సైట్ ను తెరవడం ద్వారా గానిలేదా గూగుల్ లో ఇంగ్లిషులో ITU Kaleidoscope 2024 అని టైప్ చేశాక మొదటగా కనపడే వెబ్ సైట్ ను ఎంచుకొని గాని చూడవచ్చు.

 

క్రమం తప్పక తాజా సమాచారం కోసంఈ కింది మాధ్యమాలలో డీఓటీ హేండల్స్ ను అనుసరించగలరు:

 

ఎక్స్’ లో X - https://x.com/DoT_India

ఇన్ స్టా గ్రామ్ లో Insta- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

ఫేస్ బుక్ లో Fb - https://www.facebook.com/DoTIndia

యూట్యూబ్ లో YT- https://www.youtube.com/@departmentoftelecom]

 

 

 

***


(Release ID: 2066743) Visitor Counter : 59


Read this release in: English , Urdu , Hindi