కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 17న దిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఐటీయూ-డబ్ల్యూటీఎస్ఏ 24 రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ ఇండియా
విపత్తులకు సంబంధించిన విశ్వసనీయమైన సృజనాత్మక సాంకేతిక పరిష్కారాలను తెలుసుకునేందుకు 11 రాష్ట్రాల నుంచి పాల్గొన్న విద్యార్థులు
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) విషయంలో ముందుకెళ్లటానికి రోబోటిక్స్‌లో ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శించటమే ఈ కార్యక్రమం లక్ష్యం
Posted On:
19 OCT 2024 9:02AM by PIB Hyderabad
ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) - వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (ఐటీయూ-డబ్ల్యూటీఎస్ఏ 2024).. రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్‌ను నిర్వహించింది. మంచి ప్రభావం కోసం కృత్రిమ మేధ- భారత్ (ఏఐ ఫర్ గుడ్ ఇంపాక్ట్ ఇండియా)లో భాగంగా నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి కార్యక్రమం ఇది. మంచి కోసం కృత్రిమ మేధ ప్రపంచ సదస్సు 2025 (ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ సమ్మిట్) సందర్భంగా జెనీవాలో జరిగే గ్రాండ్ ఫైనల్‌కు అర్హత పోటీగా ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ ఆవిష్కర్తలు రోబోటిక్స్, కోడింగ్‌లో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.
మొత్తం 120 బృందాలు దరఖాస్తు చేసుకోగా.. రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్‌లో తమ రోబోటిక్స్ పరిష్కారాలను ప్రదర్శించేందుకు 51 బృందాలను ఎంపిక చేశారు. విపత్తు నిర్వహణ ఇతివృత్తంతో జరిగిన ఈ పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వాళ్లు 2025 జూలైలో జెనీవాలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీ లక్ష్యాలు ఇవి:
* విద్యార్థులందరూ రోబోటిక్స్, కోడింగ్ నేర్చుకోవడంలో సమ్మిళితత్వాన్ని పెంపొందించటం
* సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగా మిషన్‌ను పూర్తి చేయడానికి రోబోలను రూపొందించడం, నిర్మించడం, వాటికి సంబంధించిన కోడింగ్ చేయటం.
* బృందంగా కలిసి పని చేయటం, సమస్యల పరిష్కారం, సుస్థిర పద్ధతులను ప్రోత్సహించటం
భూకంప బాధితుల ప్రాణాలను కాపాడే రోబోటిక్స్ వ్యవస్థను రూపొందించడం అనేది ఈ పోటీలో మొదటి సవాలుగా ఇచ్చారు. నిజమైన భూకంపాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇందులో రోబోలను ప్రాణాలను కాపాడటానికి..బాధితులను ఆశ్రయం కల్పించటానికి, ఆసుపత్రులకు తరలించడానికి ఉపయోగించారు.
ఈ కార్యక్రమంలో ఐటీయూ డిప్యూటీ సెక్రటరీ జనరల్ థామస్ లామనౌస్కాస్.. టెలికమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్.. ఐటీయూకు చెందిన టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ బ్యూరో (టీఎస్‌బీ) డైరెక్టర్ సీజో ఒనో.. టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సభ్యుడు (ఫైనాన్స్) మనీశ్ సిన్హా కీలకోపన్యాసం చేశారు. ఇతర ప్రత్యేక అతిథులుగా ఐటీయూ సెక్రటరీ జనరల్ శ్రీమతి డోరీన్ బోగ్డాన్-మార్టిన్, ఐ-హబ్ ఫౌండేషన్ ఫర్ కోబోటిక్స్ (ఐహెచ్ఎఫ్సీ) ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కె సాహా ఉన్నారు.
ఈ ఛాలెంజ్... అవార్డుల కార్యక్రమంతో ముగిసింది. సీనియర్ విభాగంలో ఢిల్లీ మథుర రోడ్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ‘ఏఐ పయనీర్స్’ బృందం… జూనియర్ విభాగంలో ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కోయిరాజ్పూర్‌కు చెందిన సంత్ అతులానంద్ కాన్వెంట్ స్కూల్ నుంచి ‘రెస్క్యూ రేంజర్స్’ బృందం అవార్డులు గెలుచుకున్నారు.
ఐటీయూ-డబ్ల్యూటీఎస్ఏ 2024: ప్రపంచ టెలీకమ్యూనికేషన్స్ భవిష్యత్తును తీర్చిదిద్దడం
సామాజిక శ్రేయస్సు, ప్రజారోగ్యం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ నిబద్ధతను ఇవాళ జరిగిన కార్యక్రమాలు ప్రధానంగా తెలియజేశాయి. విభిన్న భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా డబ్ల్యూటీఎస్ఏ 2024.. క్లిష్టమైన ప్రపంచ స్థాయి సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తూనే ఉంది.
అప్‌డేట్స్ కోసం టెలికమ్యూనికేషన్స్ (డాట్) విభాగాన్ని సామాజిక మాధ్యమాల్లో అనుసరించండి.
ఎక్స్ - https://x.com/DoT_India
ఇన్‌స్టాగ్రాం- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
ఫేస్‌బుక్ - https://www.facebook.com/DoTIndia
యూట్యూబ్- https://www.youtube.com/@departmentoftelecom
***
(Release ID: 2066422)
Visitor Counter : 83