యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్


‘ఇఎస్ఇ-2025’కు అక్టోబరు 18 నుంచి 22 నవంబరు వరకూ తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ‘యుపిఎస్‌సి’ నిర్ణయం

అభ్యర్థులకు తగిన సమయమిస్తూ ‘ఇఎస్ఇ-2025’ ప్రిలిమినరీని 2025 జూన్ 8వ తేదీకి... మెయిన్ పరీక్షను 2025 ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసిన కమిషన్

Posted On: 18 OCT 2024 6:17PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్’ (ఇఎస్ఇ-2025)ను వాయిదా వేసింది. ‘ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్’ (ఐఆర్ఎంఎస్)ను ‘ఇఎస్ఇ’లో విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిందిఇందులో భాగంగా ‘ఇఎస్ఇ-2025’ పరీక్షకు అభ్యర్థులు 2024 అక్టోబరు 18 నుంచి నవంబరు 22 వరకూ తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపిందిఅయితేఇప్పటికే (సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు వరకూదరఖాస్తు చేసినవారు మళ్లీ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొందిఈ సవరణకు అనుగుణంగా దరఖాస్తులలో మార్పుచేర్పులకు కమిషన్ రోజుల గడువిచ్చిందిదీని ప్రకారం వారు 2024 నవంబరు 23 నుంచి 29 వరకూ వివరాల దిద్దుబాటు/సవరణ చేసుకోవచ్చుఅంతేకాకుండా అవసరమైతే తాజా దరఖాస్తులకు ఇచ్చిన గడువులోగా కూడా వివరాలను నవీకరించుకోవచ్చు.

   ఈ నేపథ్యంలో ‘ఇఎస్ఇ-2025’కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావడం కోసం మరింత సమయమిస్తూ ‘ప్రిలిమినరీ’ పరీక్షను 2025 జూన్ 8వ తేదీకి, ‘మెయిన్’ పరీక్షను 2025 ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.

   యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వార్షిక పరీక్షల నిర్వహణ కార్యక్రమం-2025 ప్రకారం ‘ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025’ కోసం 2024 సెప్టెంబరు 18న నోటిఫికేషన్ జారీ చేసిందిదరఖాస్తుల దాఖలుకు ఆ రోజు నుంచి 2024 అక్టోబరు దాకా గడువిచ్చిందిఅయితే, ‘ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్’ (ఐఆర్ఎంఎస్) కింద (ట్రాఫిక్అకౌంట్స్పర్సనల్ సబ్-కేడర్నియామకాలను కూడా ‘ఇఎస్ఇ’ (సివిల్ఎలక్ట్రికల్మెకానికల్సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్టోర్స్ సబ్-కేడర్‌)ద్వారానే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందిదీనికి అనుగుణంగా రైల్వే మంత్రిత్వ శాఖ 2024 అక్టోబరు 9న ‘ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (సవరణనిబంధనలు-2024’ను జారీ చేసింది.

   ఈ సవరణను అనుసరించి ‘ఇఎస్ఇ-2025’ పరీక్ష నిబంధనలునోటీసుపై కమిషన్ 2024 అక్టోబరు 18న అనుబంధ సవరణను జారీ చేసింది. ‘ఇఎస్ఇ’కి తాజాగా దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగా వీటిని పరిశీలించాలని సూచించింది.

 

***



(Release ID: 2066252) Visitor Counter : 18


Read this release in: English , Urdu , Marathi , Hindi