భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ లో 24.91 శాతం వాటాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకొనే ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం
ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లో 25.18 శాతం వాటాను కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేజిక్కించుకోవడానికి ఆమోదం
Posted On:
15 OCT 2024 6:55PM by PIB Hyderabad
ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌జీఐఐసీఎల్)లో 24.91 శాతం వాటాను, ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌జీఐఎల్ఐసీఎల్)లో 25.18 శాతం వాటాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేజిక్కించుకునేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదాన్ని తెలిపింది. ప్రతిపాదిత అంశాలలో ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌జీఐఐసీఎల్) ఈక్విటీలో 24.91 శాతం వాటా తో పాటు ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌జీఐఎల్ఐసీఎల్) ఈక్విటీలో 25.18 శాతం వాటా కూడా అధికారపూర్వకంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరం కావడం కలిసి ఉన్నాయి. ఈ ప్రక్రియను, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (కార్పొరేట్ సంస్థల దివాలా పరిష్కార సంబంధిత ప్రక్రియ) నిబంధనావళి, 2016 లో భాగంగా బిడ్ ను, పరిష్కార ప్రణాళికను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసి, పూర్తి చేస్తుంది.
మన దేశంలో ఒక షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఎఫ్‌జీఐఐసీఎల్ ఒక సాధారణ బీమా కంపెనీగా తన విధులను నిర్వహిస్తోంది. ఇది వ్యక్తిగత బీమా, వాణిజ్య బీమా, సామాజిక, గ్రామీణ బీమా మొదలైన సేవలను అందిస్తోంది.
ఎఫ్‌జీఐఎల్ఐసీఎల్ ఒక జీవిత బీమా కంపెనీ. ఇది పొదుపు మొత్తాల బీమా, పెట్టుబడి సంబంధిత ప్రణాళికలు (యుఎల్ఐపి), టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలు, ఆరోగ్య బీమా పథకాలు, బాలల బీమా పథకాలు, పదవీ విరమణ సంబంధిత బీమా ప్లానులు, గ్రామీణ బీమా పథకాలతో పాటు సామూహిక బీమా పథకాలను అందిస్తోంది.
కమిషన్ సమగ్ర ఉత్తర్వు ను త్వరలో జారీ చేయనున్నారు.
***
(Release ID: 2065423)
Visitor Counter : 79