ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ పథకం-2024పై తరచూ అడిగే ప్రశ్నలపై సీబీడీటీ స్పష్టత
Posted On:
15 OCT 2024 7:56PM by PIB Hyderabad
ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్(డీటీవీఎస్‌వీ) పథకం-2024 అమల్లోకి వచ్చిన అనంతరం పన్ను చెల్లింపుదారులు లేవనెత్తిన వివిధ సందేహాలకు సమాధానాలను తరచూ అడిగే ప్రశ్నల(ఎఫ్ఏక్యూస్) రూపంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఈ రోజు విడుదల చేసింది. పథకానికి సంబంధించిన నిబంధనలను పన్ను చెల్లింపుదారులు సులభంగా అర్థం చేసుకొనేందుకు వీలుగా ఈ మార్గనిర్దేశక సూచనలు రూపొందించారు.
ఈ మార్గనిర్దేశక సూచనలను ఆదాయ పన్ను విభాగానికి చెందిన అధికారిక పోర్టల్ నుంచి పొందవచ్చు. https://incometaxindia.gov.in/news/circular-12-2024.pdf .
పెండింగ్‌లో ఉన్న పన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్(డీటీవీఎస్‌వీ) పథకం, 2024ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆర్థిక(నెం.2) చట్టం-2024 ద్వారా ఈ పథకం అమల్లోకి వచ్చింది. దీని అమలుకు సంబంధించిన నియమాలు, విధానాలను సెప్టెంబర్ 20న నోటిఫై చేశారు.
డీటీవీఎస్‌వీ పథకం-2024 పూర్తి నిబంధనల కోసం, డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ నియమాలు 2024 తో పాటు ఆర్థిక(నెం.2) చట్టం, 2024లోని 88 నుంచి 99 వ సెక్షన్ వరకు చూడొచ్చు.
***
(Release ID: 2065375)
Visitor Counter : 93