వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వర్ధమాన దేశాలకు టెలికాం సేవలు, డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడంలో భారత్ పాత్ర: పీయూష్ గోయల్


దేశవ్యాప్తంగా అంతరాయం లేని బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ భారత్‌ను ప్రపంచంలో నమ్మకమైన భాగస్వామిగా మార్చింది: పీయూష్ గోయల్

ఆవిష్కరణలు భారతదేశ వృద్ధిని నిర్ణయిస్తాయి.. ప్రపంచ దేశాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడంలో భారత్‌ అగ్రగామి అని ప్రపంచం గుర్తించింది: పీయూష్ గోయల్

Posted On: 15 OCT 2024 5:28PM by PIB Hyderabad

భారతదేశం టెలికాం సేవలను అందించడానికి సిద్ధంగా ఉందని.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత కంపెనీలు అధిక భద్రతనాణ్యమైన సాంకేతిక పరికరాలను అందించే సంస్థలుగా మారతాయని కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు.

వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ, 8వ విడత ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో అంతర్జాతీయ టెలికాం సరఫరా వ్యవస్థలకు భారత్ నాయకత్వం వహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమాచార వ్యవస్థలో ఇంకా వెనుకబడి ఉన్న దేశాలకు టెలికాంను తీసుకెళ్లటానికి పరిష్కారాలను కనుగొనాలని కంపెనీలను కోరారుఅభివృద్ధి చెందుతోన్న దేశాల్లో (గ్లోబల్ సౌత్‌సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంలోప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీని చౌకగా చేయాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్‌డీజీనెరవేర్చడంలో అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వం వహించడంలో భారత్‌ పాత్ర ఉందిదేశవ్యాప్తంగా అంతరాయం లేని బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ వల్ల భారత్‌కు 'ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిఅనే పేరు వచ్చిందని ఆయన అన్నారు.

దేశంలోని గ్రామీణపట్టణ ప్రాంతాల్లో స్థిరమైన సమాచార వ్యవస్థ ఏర్పడటానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015లో  ప్రారంభించిన ప్రతిష్టాత్మక 'డిజిట‌ల్ ఇండియాసాధించిన ఘనత అని వాణిజ్యపారిశ్రామిక శాఖ మంత్రి ప్రధానంగా చెప్పారుసుపరిపాలనకువ్యాపార అవకాశాలను కల్పించడానికిదేశ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ప్రధాని దూరదృష్టిని ఆయన ప్రశంసించారుభారతదేశం నేడు ఒకే దేశంగా ఆలోచిస్తోందనిప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత ఆలోచనలో మార్పుకు నాంది పలికారనియావత్ దేశ ఆలోచనా విధానాన్ని దేశాభివృద్ధి వైపు మళ్లించారని ఆయన అన్నారు.


 

2015లో డిజిటల్‌ వైపు మళ్లే విషయంలో చేసిన కృషి వల్ల కోవిడ్ మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా అత్యవసర సేవలను కొనసాగాయనిఇది ఆటంకం లేకుండా వ్యాపార కార్యకలాపాలు సాగేందుకు దారితీసిందని ఆయన అన్నారువివిధ దేశాలు భారతదేశంతో కలిసి పనిచేసినప్పుడుఅధిక నాణ్యతసరైనసమర్థవంతమైన ధరతో కూడిన పరిష్కారాలకు హామీ లభిస్తుందిఅంతరాయం లేని కార్యకలాపాల విషయంలో ధీమా లభిస్తుండటంతో తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల‌ (జీసీసీఏర్పాటు కోసం భారత్‌ వైపు కంపెనీలు చూస్తాయని అన్నారు.

ఆవిష్కరణపరికరాల లభ్యతసేవలుడేటా వంటి టెలికాం సేవల్లో సాంకేతిక అభివృద్ధి పరంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ చాలా ముందంజలో ఉందన్నారునిన్న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని భారత్‌ నిర్వహించుకున్నదనీ
భారతదేశాన్ని నాణ్యమైన వస్తువులుసేవలను అందించే దేశంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందనీ అన్నారుభారత్ చేసే ప్రతి పనిలోనూ దేశ వృద్ధిని ప్రోత్సహించే నాణ్యత ప్రమాణాలు ఉంటాయని ఆయన అన్నారు.

'
భవిష్యత్ ఇప్పుడేఅనే ఇతివృత్తాన్ని ప్రస్తావిస్తూభారత్‌ తన భవిష్యత్తు కోసమే కాకుండా ప్రపంచ భవిష్యత్ కోసం పని చేస్తోందని తెలిపారుప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చేయటంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం అంతర్భాగమని అన్నారుమెషిన్ లెర్నింగ్కృత్రిమ మేధఇంటెలిజెన్స్డేటా విశ్లేషణతో కూడిన పూర్తి డిజిటలైజేషన్ వ్యవస్థ దేశంలో తన ముద్రను కలిగి ఉందని పేర్కొన్నారుఆవిష్కరణలుప్రతిభపెద్ద మార్కెట్‌ అందించే దేశంగా భారత్‌ గుర్తింపు పొందిందిఆవిష్కరణ దేశ వృద్ధిని నిర్ణయిస్తుందని.. నిరుపేదలకుయావత్ ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటంలో నాయకుడిగా భారత్‌ను ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు.
అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలియజేసిన మంత్రి.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఆయన చేసిన కృషిని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారనియువతతో ఆయన అనుబంధం ఎల్లప్పుడూ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మంత్రి ఉద్ఘాటించారు.

సాంకేతికతకు సంబంధించి భారత్‌ స్వయం సమృద్ధి సాధించే విషయంలో ఆత్మవిశ్వాసాన్ని నింపినందుకు టెలికాం పరికరాలుసేవల ఎగుమతి ప్రోత్సాహక మండలి (టీఈపీసీ)ని పీయూష్ గోయల్ అభినందించారుప్రపంచ దేశాలతో సమానంగా 5జీని ప్రారంభించిన భారత్ కథ నేడు భిన్నమైనదని అన్నారు. 6జీని ప్రారంభించడంలోఅభివృద్ధి చేయడంలో దేశం అగ్రగామిగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారునేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతం 5జీ టెక్నాలజీతో ప్రయోజనాన్ని పొందుతుందన్నారు.

 

***


(Release ID: 2065196) Visitor Counter : 51


Read this release in: English , Urdu , Hindi , Tamil