వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రధానమంత్రి గతిశక్తి’ కింద 27 ఆకాంక్షాత్మక జిల్లాల కోసం ‘జిల్లా బృహత్ ప్రణాళిక’ను ఆవిష్కరించిన శ్రీ పీయూష్ గోయల్


రవాణా ప్రణాళికల రూపకల్పనలో నగరాలకు తోడ్పాటు దిశగా ‘భారత నగరాల కోసం ‘సిటీ లాజిస్టిక్స్ ప్లాన్‌’ తయారీ మార్గదర్శకాల’ ఆవిష్కరణ

మౌలిక సదుపాయాల ప్రణాళిక తయారీలో ‘పిఎం గతిశక్తి’ ఒక అద్భుత ఉపకరణం: శ్రీ గోయల్

భవిష్యత్తులో యావత్ ప్రపంచం మౌలిక సదుపాయాల ప్రణాళికల కోసం ‘పిఎం గతిశక్తి’ని వాడుకుంటుంది: శ్రీ గోయల్

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2003లో ‘గతిశక్తి’ భావనకు రూపమిచ్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అమోఘమని కొనియాడిన శ్రీ గోయల్

Posted On: 15 OCT 2024 6:34PM by PIB Hyderabad

  ‘ప్రధానమంత్రి గతిశక్తి’ ప్రణాళిక సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో దీని స్ఫూర్తితో దేశంలోని 27 ఆకాంక్షాత్మక జిల్లాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పిఎం గతిశక్తి జిల్లా బృహత్ ప్రణాళిక’ను కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు ఆవిష్కరించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికల తయారీలో ‘గతిశక్తి’ అద్భుత ఉపకరణమని పేర్కొన్నారుఅందుకే జిల్లా బృహత్ ప్రణాళికను రాబోయే 18 నెలల్లో దేశంలోని 750కిపైగా జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారుఅలాగే రవాణా ప్రణాళికల రూపకల్పనలో నగరాలకు తోడ్పాటు దిశగా ‘‘భారత నగరాల కోసం ‘సిటీ లాజిస్టిక్స్ ప్లాన్‌’ తయారీ మార్గదర్శకాల’’ను కూడా కేంద్ర మంత్రి ఆవిష్కరించారుతద్వారా దేశంలోని నగరాలు తమ ప్రత్యేకావసరాలుస్థానిక పరిస్థితులులక్ష్యాలకు అనుగుణంగా రవాణా ప్రణాళిక రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

   అంతర్జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ ముందడుగు వేయడానికి ఈ జాతీయ బృహత్ ప్రణాళిక సమర్థసత్వరమెరుగైనతక్కువ ఖర్చుతో కూడినఅధిక నాణ్యతగల ఉపకరణమని శ్రీ గోయల్ స్పష్టం చేశారునేటి ఈ వేగంసామర్థ్యాలే భారత్ బలాన్ని నిర్వచించే లక్షణాలని ఆయన పేర్కొన్నారుభవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు సమర్థంగా అమలు చేయడం ద్వారా అత్యాధునికనాణ్యమైన మౌలిక సదుపాయాలను సకాలంలో నిర్మిస్తున్నందున భారతదేశం ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిందని తెలిపారురానున్న కాలంలో ప్రపంచ దేశాలు కూడా తమ మౌలిక సదుపాయాల ప్రణాళికల రూపకల్పన కోసం ఈ ఉపకరణాన్ని వాడుకుంటాయని పేర్కొన్నారు.

   ప్రధానమంత్రి గతిశక్తి బృహత్ ప్రణాళిక భూగోళ-ప్రాదేశికఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అనుసరించిందని మంత్రి గుర్తుచేశారుతద్వారా అనుసంధాన ప్రక్రియను విప్లవాత్మకంగా మార్చి గణనీయ పురోగతి సాధించిందని పేర్కొన్నారుఈ ప్రణాళికలో ప్రతి సమాచారం కచ్చితమైనదిగా ఉంటుందనిఒకటికి రెండుసార్లు పరీక్షిస్తూ క్రమానుగత నవీకరణ చేపట్టేలా ఒక యంత్రాంగం కూడా ఇందులో ఉందని ఆయన వివరించారుఈ అద్భుత ఉపకరణానికి రూపమిచ్చిన ‘బైశాగ్-ఎన్’ (బిఐఎస్ఎజి-ఎన్బృందాన్ని శ్రీ గోయల్ అభినందించారుఅత్యున్నత మేధకు గతిశక్తి ఒక ఉదాహరణ అని, ‘జిఐఎస్’ ఆధారిత వేదిక వల్ల ప్రభుత్వానికి వ్యయం గణనీయంగా ఆదా కాగలదని తెలిపారుఅలాగే దీనిద్వారా లభించే సమాచారం ఆధారంగా చేపట్టే నిర్ణయ ప్రక్రియ వల్ల మౌలిక సదుపాయాల నిర్మాణం మరింత సమర్థంగావేగంగా సాగుతుందని చెప్పారు.

   ప్రధానమంత్రి గతిశక్తి ఒక ఇరుసుగా మారిందనిదీనిచుట్టూ మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలు నానాటికీ మరింత పుంజుకుంటున్నాయని శ్రీ గోయల్ తెలిపారుశరవేగంగా పురోగమించే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ రూపొందడంలో ప్రధానమంత్రి గతిశక్తి బహుగుణ ప్రభావం చూపుతూ కీలకపాత్ర పోషించిందని ఆయన వివరించారుప్రాదేశిక సాంకేతికతకు 20 ఏళ్ల కిందట నాంది పలకడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టిని  శ్రీ గోయల్ గుర్తుచేశారుభూగోళ-ప్రాదేశక అంశాల పరస్పర ప్రభావాన్ని ఆయన ఆనాడే గుర్తించిగుజరాత్‌లో దానికి కార్యరూపం ఇచ్చారని కొనియాడారు.

   ‘నిర్దిష్ట ప్రాంత అభివృద్ధి విధానం’ కింద ‘పిఎం గతిశక్తి’ పరిధిని విద్యుత్ ప్రసార లైన్లుపాఠశాలలుఆస్పత్రులు వంటి సామాజిక మౌలిక సదుపాయాలకు ప్రధాని మోదీ విస్తరించారని కేంద్ర మంత్రి పేర్కొన్నారుభౌతిక మౌలిక సదుపాయాల కల్పనపై మనం ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో జీవన సౌలభ్యం దిశగా సామాజిక మౌలిక సదుపాయాల కోసం కూడా తయారు చేయవచ్చుఈ క్రమంలో వాణిజ్య సౌలభ్యంతో జనజీవన సౌలభ్యాన్ని జోడించే దిశగానూ ప్రధానమంత్రి గతిశక్తి ఇప్పుడు ముందడుగు వేస్తోందన్నారుఇవి రెండూ ఒకదానికొకటి పర్యాయపదాలు కావడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

 

****


(Release ID: 2065191)
Read this release in: Kannada , English , Urdu , Hindi