బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024'లో 5జీ టెక్నాలజీని ప్రదర్శించిన సీఎంపీడీఐ

Posted On: 15 OCT 2024 6:28PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 (ఐఎంసి 2024)లో విభిన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శనకు వేదిక అయిందిఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఐఎంసి 2024లో టైడల్ వేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో సీఎంపీడీఐ '5జీ టెక్నాలజీ మైనింగ్ పరిశ్రమలో ఎలా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందిఅనే ఇతివృత్తంతో తన అత్యాధునిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించిందిప్రతి వినియోగ కేసు మైనింగ్‌లో భద్రతసామర్థ్యంకార్యాచరణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో 5జి ప్రయోజనాన్ని వివరిస్తుందిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024ను మంగళవారం నాడు ప్రారంభించారు.


 

 

కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి.ఎం.ప్రసాద్ ఐఎంసి 2024లో సీఎంపీడీఐ స్టాల్‌కు  మొదటిగా సందర్శకుడిగా సందర్శించారు.   సీఎంపీడీఐ సీఎండీ శ్రీ మనోజ్ కుమార్ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎంపీడీఐ ఐఎంసి 2024లో మొత్తం 13 ఉదాహరణలను ప్రదర్శిస్తోందిఅవి క్రింది విధంగా ఉన్నాయి:

  1. 5జి  నెట్‌వర్క్ ఇన్‌ఫ్రా

  2. మిషన్ క్రిటికల్ కమ్యూనికేషన్ (ఎంసిఎక్స్)

  3. 5జి ఎనేబుల్డ్ రిమోట్ డ్రోన్ ఆపరేషన్స్ 

  4. 5జి  ఏఐ ఎనేబుల్డ్ వీడియో అనలిటిక్స్‌ కెమెరా

  5. 5జి ఐఓటి పర్యావరణ సెన్సార్లు.

  6. 5జి   ఐఓటి మెషినరీ సెన్సార్లు.

  7. సీపీఈ ద్వారా ప్రాచీన పరికరాలకు కూడా కంపాటిబిలిటీ 

  8. 5జి ఎనేబుల్డ్ ఆటోమేటెడ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్.

  9. ఏఐ ఎనేబుల్డ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం 

  10. 5జి ఎనేబుల్డ్ స్లోప్ స్టెబిలిటీ రాడార్ సిస్టం 

  11. ఏఆర్ తో 5జి ఎనేబుల్డ్ రిమోట్ మెయింటినెన్స్ 

  12. 5జి సి-వి2ఎక్స్ బేస్డ్ కొలిజిన్ డిజిటల్ ట్విన్ అఫ్ లోడ్ హాల్ దమ్ ఆపరేషన్స్ 

 

 

5జి రియల్ టైమ్ కమ్యూనికేషన్‌ని అనుమతిస్తుందివైఫైటెట్రా వంటి సంప్రదాయ వైర్‌లెస్ టెక్నాలజీలను అధిగమించడం ద్వారా అత్యంత సవాలుగా ఉండే వాతావరణంలో రిమోట్ పర్యవేక్షణనియంత్రణను అనుమతిస్తుందిఇది నిరంతరాయమైన ఆటోమేషన్‌ను నిర్ధారిస్తుందిప్రమాదాన్ని తగ్గిస్తుందిమైనింగ్ డిజిటల్ భవిష్యత్తుకు ఇది  మద్దతు ఇస్తుంది.

ఐఎంసి 2023, న్యూఢిల్లీ నుండి నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన అమ్లోహ్రీ ఓపెన్ కాస్ట్ గని (ఓసీపీ)లో బొగ్గు మంత్రిత్వ శాఖ 5జి సాంకేతిక వినియోగ కేసులను (5జి ఎనేబుల్డ్ డ్రోన్స్ఏఐ  పవర్డ్ కెమెరావెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (విటీఎస్), మిషన్ క్రిటికల్ వాయిస్వీడియో కమ్యూనికేషన్లువిజయవంతంగా ప్రదర్శించింది. . అంలోరీ ఓసీపీ వద్ద కోల్ మైనింగ్‌లో భారతదేశం మొదటి ప్రైవేట్ 5జి  నెట్‌వర్క్‌ని అమలు చేయడంలో సీఎంపీడీఐ కీలక పాత్ర పోషించింది.

 

***


(Release ID: 2065189) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Hindi