ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆదాయపు పన్ను చట్టాన్ని సమగ్రంగా సమీక్షించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన సిబిడిటి: ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ పై పన్నుల విశ్లేషకులు / నిపుణులు / ప్రజల నుంచి సూచనలకు ఆహ్వానం

Posted On: 07 OCT 2024 5:14PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్ లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, ఆదాయపు పన్ను చట్టం, 1961 (చట్టం) సమగ్ర సమీక్షను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా , సులభంగా అర్థం అయ్యేలా చేయడమే దీని లక్ష్యం, ఇది వివాదాలు, వ్యాజ్యాలను తగ్గిస్తుంది.  పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ భరోసాను అందిస్తుంది.

ఈ కమిటీ నాలుగు కేటగిరీల్లో ప్రజల నుంచి సలహాలు, సూచనలను కోరుతోంది.

భాష ను సరళీకరించడం

లిటిగేషన్ తగ్గింపు

షరతుల భారం తగ్గింపు,
 
అనవసరమైన/ వాడుకలో లేని నిబంధనలు

దీనిని సులభతరం చేయడానికి, ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఒక వెబ్ పేజీ ప్రారంభించారు. దీనిని ఈ  లింక్ తో చూడవచ్చు. https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/ita-comprehensive-review

పై లింక్ 06.10.2024 నుంచి ఇ-ఫైలింగ్ పోర్టల్ లో పన్నుల విశ్లేషకులు  / నిపుణులు / ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పన్నుల విశ్లేషకులు  / నిపుణులు/ ప్రజలు తమ పేరు , మొబైల్ నంబర్ ను నమోదు చేయడం ద్వారా పేజీని యాక్సెస్ చేయవచ్చు, తరువాత ఓటిపి ద్వారా ధ్రువీకరణ  చేయవచ్చు.
 
పన్నుల విశ్లేషకులు   /నిపుణులు/ప్రజల సూచనలు, పై చెప్పిన నాలుగు విభాగాలకు సంబంధించి, ఆదాయపన్ను చట్టం, 1961 లేదా ఆదాయపన్ను నిబంధనలు, 1962 (తగిన సందర్భంలో నిర్దిష్ట సెక్షన్, ఉప-సెక్షన్, క్లాజ్, రూల్, ఉప-రూల్ లేదా ఫారమ్ నంబర్) లోని సంబంధిత నిబంధనను స్పష్టంగా పేర్కొనాలి.


 

****



(Release ID: 2063017) Visitor Counter : 4


Read this release in: English , Urdu , Hindi , Tamil