రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

అక్టోబర్ 08న విశాఖపట్నంలో ప్రారంభం కానున్న మలబార్-2024 ఆతిథ్యం ఇవ్వనున్న భారత్.. పాల్గొననున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌

Posted On: 05 OCT 2024 1:12PM by PIB Hyderabad

మలబార్ 2024’ పేరుతో నిర్వహించనున్న నౌకా వాణిజ్య భద్రతా విన్యాసాలు అక్టోబర్ 08 నుంచి 18 వరకు విశాఖపట్నంలో హార్బర్ దశతో ప్రారంభం కానున్నాయిదీని తర్వాత సముద్ర దశ ఉంటుందిభారత్ ఆతిధేయ దేశంగా జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియాజపాన్అమెరికా పాల్గొంటున్నాయి.
అమెరికాభారత నావికాదళం మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసాలుగా 1992‌లో మలబార్ విన్యాసాలు ప్రారంభమయ్యాయిహిందూ మహాసముద్రంఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పరం కలిసి పనిచేసే అవకాశాలను తెలుసుకోవడంపరస్పర అవగాహనను పెంపొందించుకోవటంసముద్రాలకు సంబంధించి ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఒక కీలక బహుళపక్ష కార్యక్రమంగా ఇది రూపాంతరం చెందింది.

గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లుమల్టీ పర్పస్ ఫ్రిగేట్లుజలాంతర్గాములుఫిక్స్డ్ వింగ్ ఎంఆర్యుద్ధ విమానాలుహెలికాప్టర్లతో సహా వివిధ భారత నావికాదళ ఆయుధ వ్యవస్థలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయిఆస్ట్రేలియా తన ఎంహెచ్ -60ఆర్ హెలికాప్టర్‌తో కూడిన అన్జాక్ క్లాస్ ఫ్రిగేట్ అయిన హెచ్‌ఎంఏఎస్-స్టువర్ట్‌తో పాటు పీమారిటైమ్ పెట్రోలింగ్ విమానాన్ని మోహరించనుందిహెలికాప్టర్‌తో అంతర్భాగంగా ఉండే ఆర్లీ బర్క్-క్లాస్ డిస్ట్రాయర్ అయిన యూఎస్ఎస్ డ్యూయ్‌‌తో పాటుగా పీమారిటైమ్ పెట్రోలింగ్ విమానాన్ని అమెరికా రంగంలోకి దించనుందిమురాసామే క్లాస్ డిస్ట్రాయర్ అయిన జేఎస్ అరియాకేతో జపాన్ పాల్గొననుందినాలుగు దేశాలకు చెందిన ప్రత్యేక బలగాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి.

విషయ నిపుణత బదిలీ (ఎస్ఎంఈఈ-సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టైస్ ఎక్సేంజీద్వారా స్పెషల్ ఆపరేషన్స్ఉపరితలంగగనతలంయాంటీ సబ్ మెరైన్ యుద్ధ క్షేత్రం వంటి అంశాలపై చర్చలతో సహా సహకారంకార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి రూపొందించిన విస్తృత శ్రేణి కార్యకలాపాలపై మలబార్ 2024 దృష్టి సారించనుందిసముద్రాలపై పరిస్థితుల విషయంలో అవగాహనను మెరుగుపరచడంపై దృష్టి పెడుతూ.. యాంటీ సబ్ మెరైన్ఉపరితల యుద్ధ క్షేత్రాలు.. గగనతల రక్షణ తదితరాలకు సంబంధించిన సంక్లిష్టమైన విన్యాసాలు సముద్రంలో జరగనున్నాయి.


 

హార్బర్ దశలో అక్టోబర్‌ 09న విశిష్ట సందర్శకుల దినోత్సవాన్ని నిర్వహిస్తారుఇందులో నాలుగు దేశాల ప్రతినిధులకు తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆతిథ్యం ఇవ్వనున్నారుహార్బర్ దశలో పాల్గొన్న అన్ని దేశాల ప్రతినిధులు.. సంయుక్త పత్రికా సమావేశం కూడా నిర్వహించనున్నారు.

సంక్లిష్టమైన విన్యాసాలతో కూడిన మలబార్ 2024 ఇప్పటి వరకు నిర్వహించిన వాటితో పోల్చితే అత్యంత సమగ్రమైనదిగా ఉంటుందనే అంచనా ఉంది.

 

***



(Release ID: 2062516) Visitor Counter : 7


Read this release in: English , Urdu , Hindi