కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

నిర్వహణ సహకారం పెంపు లక్ష్యంగా కేంద్ర తపాలా విభాగం, ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మధ్య కీలక అవగాహన ఒప్పందం

Posted On: 04 OCT 2024 2:30PM by PIB Hyderabad

కేంద్ర తపాలా విభాగం-కామర్స్ సంస్థ అమెజాన్ గత పదేళ్ళకుపైగా పరస్పర సహకారంతో సేవలందిస్తున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ భాగస్వామ్యంలో భాగంగా అమెజాన్తపాలా శాఖ పార్సిల్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకుంటున్నది. విస్తృతమైన పంపిణీ వ్యవస్థ గల తపాలాశాఖప్రపంచ అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్ఈ రెండూ కలిసి పనిచేయడం ద్వారా పెరుగుతున్న దేశ ఇ-కామర్స్ రంగానికి ఊతమిచ్చే విధంగా మెరుగైన పంపిణీ వ్యవస్థను రూపొందించిమరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించితద్వారా దేశ ఆర్ధిక పురోభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాయి.

పరస్పర సహకారంతో దేశంలో ఇ-కామర్స్ రంగం అభివృద్ధిఅందుకు అనువుగా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన తపాలా శాఖఅమెజాన్ సెల్లర్ సర్వీసెస్ సంస్థఈ రోజు కీలక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయిన్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ కార్యదర్శి వందితా కౌల్అమెజాన్ సంస్థ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అమన్ జైన్ సమక్షంలో- తపాలా శాఖ తరుఫున పార్సెల్ కార్యాలయం జనరల్ మేనేజర్ కుషాల్ వశిష్ఠ్అమెజాన్ తరుఫున ఆపరేషన్స్ డైరెక్టర్ వెంకటేష్ తివారీ సంతకాలు చేశారు

అనేక సంవత్సరాలపాటు సాగుతున్న వ్యాపారబంధం పునాదిగా ఈ ఒప్పందం జరిగిందితపాలా శాఖ విస్తృత పంపిణీ వ్యవస్థను వినియోగించుకొని అమెజాన్ దేశవ్యాప్తంగా పార్సిళ్ళను పంపిణీ చేసేందుకు రెండు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంవ్యాపార కార్యకలాపాల విస్తృతంసదుపాయాలపంపిణీ వ్యవస్థల పరస్పర వినియోగం దిశగా పడిన కీలకమైన అడుగు

అవగాహన ఒప్పందంలోని ముఖ్యాంశాలు:

· లక్ష్యం: నిర్వహణ వ్యవస్థలవ్యాపార వృద్ధి దిశగా అవకాశాలను కలిసి అన్వేషించడంతద్వారా తపాలా శాఖకు గల విస్తృత పంపిణీ వ్యవస్థను వినియోగించుకొని అమెజాన్ దేశవ్యాప్తంగా పార్సిళ్ళను పంపిణీ చేయడం.

· సహకారం పెంపుసరఫరా కార్యకలాపాల్లో సహకారంసమాచార మార్పిడిసామర్ధ్యాలను పంచుకునే అవకాశాలను పరిశీలించడం సహా సహకారం సాధ్యమయ్యే కీలక అంశాలను ఒప్పందం తెలియచేసింది.

· నిరంతరాయ సమీక్షా పద్ధతుల ఏర్పాటుసహకారం సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షించే త్రైమాసిక సమావేశాలుసహకార బంధం బలోపేతం దిశగా చర్యలు.

అమెజాన్ కు ఒనగూడే ప్రయోజనాలు:

1.6 లక్షల పోస్టాఫీసుుల సహాతపాలా శాఖ విస్తృతమైన పంపిణీ వ్యవస్థ అమెజాన్ కు అందుబాటులోకి వస్తుంది. దరిమిలా మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు కూడా సులభంగా సేవలను అందించే అవకాశం కలుగుతుందిసరుకు పంపిణీ వ్యవస్థ బలపడి సంస్థ ఇ-కామర్స్ అవసరాలకు తగిన సదుపాయాలను ఈ భాగస్వామ్యం సమకూరుస్తుంది.

తపాలా శాఖకు ఒనగూడే ప్రయోజనాలు:

పార్సిళ్ళ అందజేత మెరుగవడం వల్ల తపాలాశాఖ వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయిఅమెజాన్ వంటి దిగ్గజ సంస్థతో కలిసి పనిచేయడం వల్ల మెరుగైన ఇ-కామర్స్ పంపిణీ వ్యవస్థల పట్ల అవగాహన పెరగడంతద్వారా సామర్ధ్యంనైపుణ్యాల పెంపుప్రపంచ లాజిస్టిక్స్ కేంద్రంగా నిలవాలన్న దేశ ఆశయానికి సహకారం.

 

***



(Release ID: 2062278) Visitor Counter : 18


Read this release in: English , Hindi , Manipuri , Tamil