బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యాలయ ప్రాంగణాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి: స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అమలు ప్రారంభం

प्रविष्टि तिथि: 04 OCT 2024 6:56PM by PIB Hyderabad

స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అమలు దశ ప్రారంభం సందర్భంగా బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి  బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యాలయ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారుబొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్.కాంతారావుఅదనపు కార్యదర్శులు శ్రీమతి విస్మితా తేజ్శ్రీమతి రూపిందర్ బ్రార్ఇతర సీనియర్ అధికారులు కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.  పరిశుభ్రత,  మొత్తం పనివాతావరణాన్ని మదింపు చేయడం ఈ సందర్శన లక్ష్యం. ఇది ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించడంపై ప్రత్యేక  ప్రచారం ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.

స్వచ్ఛత (పరిశుభ్రతప్రభుత్వ కార్యక్రమాలలో పెండింగ్ ను తగ్గించాలన్న బలమైన సంకల్పంతో 2024 అక్టోబర్ నుండి అక్టోబర్ 31, 2024 వరకు నడిచే ప్రత్యేక ప్రచారం (స్పెషల్ క్యాంపెయిన్ ) 4.0 ని ప్రభుత్వం ప్రారంభించిందికార్యాలయ స్థలాలను పెంచడంఆధునిక పరిశుభ్రత పద్ధతులను అవలంబించడంసమర్థమంతంగా వ్యర్థాలను తొలగించడంస్థలాన్ని పూర్తిగా వినియోగించేలా చేయడండిజిటలైజేషన్ నుపర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడంవ్యర్థాలను సంపదగా మార్చడంసమ్మిళితను పెంపొందించడంపౌరుల అవసరాలపై దృష్టి కేంద్రీకరించే  విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రోటోకాల్స్,  యంత్రాంగాలను బలోపేతం చేయడం ప్రత్యేక ప్రచారం 4.0 ముఖ్య లక్ష్యాలు.

ఈ తనిఖీ సందర్భంగా మంత్రి శ్రీ కిషన్ రెడ్డి వ్యర్థ పదార్థాలతో వినూత్న ఆర్ట్ బాక్స్ ను రూపొందించిన ఉద్యోగిని ప్రత్యేకంగా అభినందించారుఆ ఉద్యోగి సృజనాత్మకతను నైపుణ్యాన్ని మంత్రి ప్రశంసించారురీ సైక్లింగ్దైనందిన కార్యకలాపాల్లో సుస్థిర విధానాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారువ్యర్థాల తగ్గింపుపర్యావరణ సుస్థిరతకు దోహదం చేస్తూ పని ప్రాంతం సౌందర్యాన్ని పెంపొందించే సృజనాత్మక పరిష్కారాలను కనుగొనాలని ఆయన సిబ్బందికి సూచించారు

ప్రత్యేక ప్రచారం 4.0 ఒక క్రమబద్ధమైన పని ప్రదేశాన్ని నిర్వహించడానికి మించి పరిశుభ్రత పాటించవలసిన బాధ్యతనుతెలియచేస్తుంది.  మన పరిసరాల పట్ల బాధ్యతగౌరవం కలిగిన సంస్కృతిని కూడా పెంపొందిస్తుందిఉత్పాదకతఉద్యోగుల్లో నైతికతను పెంపొందించే పరిశుభ్రమైన పనిప్రాంతం ప్రాముఖ్యతను ఈ చొరవ స్పష్టంగా తెలియచేస్తుంది.  

 

****


(रिलीज़ आईडी: 2062277) आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी