గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


రెండో దశలో 1) మాధవరం నుంచి సిప్కాట్ వరకు 2) లైట్ హౌస్ నుంచి పూనమల్లే బైపాస్ వరకు 3) మాధవరం నుంచి షోలింగనల్లూరు వరకు మూడు కారిడార్లు

రెండో దశలో 128 స్టేషన్ల ఏర్పాటు; 118.9 కిమీ కొత్త మార్గాలతో కలిపి చెన్నైలో మొత్తం 173 కిలోమీటర్లుగా విస్తరించనున్న మెట్రో రైల్ నెట్‌వర్క్

రెండో దశకు రూ.63,246 కోట్ల ఆర్థిక వ్యయం

21 చోట్ల ప్రయాణికులకు అనుకూలమైన మల్టీ-మోడల్ ఇంటిగ్రేషన్

ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి చెన్నై పశ్చిమం వరకు కలపనున్న ఆమోదిత కారిడార్లు

Posted On: 03 OCT 2024 8:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం మూడు కారిడార్లతో కూడిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు సంబంధించి గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది128 స్టేషన్లతో మొత్తం 118.9 కిలోమీటర్ల మేర ఈ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.

రూ.63,246 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  రెండో దశ మెట్రో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నగరం మొత్తం మెట్రో రైలు వ్యవస్థ 173 కిలోమీటర్ల మేర పరిధికి విస్తరిస్తుందిరెండో దశ ప్రాజెక్టులో ఈ క్రింది మూడు కారిడార్లు ఉన్నాయి:

  • కారిడార్ (1): మాధవరం నుంచి సిప్ కాట్ వరకు 50 స్టేషన్లతో 45.8 కిలోమీటర్లు.

  • కారిడార్ (2): లైట్ హౌస్ నుండి పూనమల్లె బైపాస్ వరకు 30 స్టేషన్లతో 26.1 కిలోమీటర్లు.

  • కారిడార్ (3): మాధవరం నుంచి షోలింగనల్లూరు వరకు 48 స్టేషన్లతో 47 కిలోమీటర్లు.

రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నగరానికి మొత్తం 173 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నెట్ వర్క్ అందుబాటులో ఉంటుంది

ప్రయోజనాలువృద్ధికి ఊతం:

చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందినగరంలో మెట్రో రైల్ నెట్ వర్క్ కు రెండో దశ ప్రధాన విస్తరణగా పనిచేస్తుంది.

మెరుగైన కనెక్టివిటీ: రెండోదశలో సుమారు 118.9 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాలు అందుబాటులోకి వస్తాయిఈ దశలోని కారిడార్లు మాధవరంపెరంబూర్తిరుమయిలైఅడయార్షోలింగనల్లూరుసిప్కాట్కోడంబాక్కంవడపళనిపోరూర్విల్లివాక్కంఅన్నా నగర్సెయింట్ థామస్ మౌంట్ వంటి ప్రధాన ప్రభావిత ప్రాంతాల మీదుగా చెన్నై పశ్చిమానికి ఉత్తరం నుండి దక్షిణానికి తూర్పుకు అనుసంధానిస్తాయిఇవి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవాణిజ్యనివాస ప్రాంతాలనుకార్యాలయాలను కలుపుతాయిఈ సముదాయాలలోని కార్మికులకు సమర్థమంతమైన ప్రజా రవాణాను కూడా అందిస్తాయినగరంలోని వివిధ ప్రాంతాలను కూడా కలుపుతాయిదక్షిణ చెన్నై ఐటీ కారిడార్ కు కేంద్రంగా పనిచేస్తున్న షోలింగనల్లూరు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఇది కనెక్టివిటీని విస్తరిస్తుందిఎల్కాట్ ద్వారా షోలింగనల్లూరును అనుసంధానం చేయడం ద్వారా పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల రవాణా అవసరాలను మెట్రో కారిడార్ తీరుస్తుంది.

తగ్గనున్న ట్రాఫిక్ రద్దీసమర్థమంతమైన ప్రత్యామ్నాయ రోడ్డు రవాణాగా మెట్రో రైల్ నెట్ వర్క్ కు పొడిగింపుగా ఫేజ్ -2తో మెట్రో రైలు చెన్నై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందనినగరంలో భారీ రద్దీ ఉండే మార్గాలపై ముఖ్యంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారురోడ్లపై ట్రాఫిక్ తగ్గడం వల్ల వాహనాల రాకపోకలు సజావుగా సాగడంప్రయాణ సమయం తగ్గడంమొత్తంగా రోడ్డు భద్రత మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయి

పర్యావరణ ప్రయోజనాలు: ఫేజ్-2 మెట్రో రైల్ నిర్మాణంచెన్నై నగరంలో మొత్తం మెట్రో రైల్ నెట్ వర్క్ పెరుగుదలతోసంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.

ఆర్థికాభివృద్ధి: తక్కువ ప్రయాణ సమయాలునగరంలోని వివిధ ప్రాంతాలకు సునాయాసంగా ప్రయాణంఉద్యోగులు తమ కార్యాలయాలకు మరింత సులభంగా చేరుకునే వీలు ఉత్పాదకత పెంపునకు దోహద పడవచ్చుఫేజ్-2 నిర్మాణంనిర్వహణ వల్ల నిర్మాణ కార్మికుల నుంచి ఉద్యోగులునిర్వహణా సిబ్బంది వరకు వివిధ రంగాల్లో అనేక ఉద్యోగాలు లభిస్తాయిఅలాగేమెరుగైన అనుసంధానం వల్ల ముఖ్యంగా కొత్త మెట్రో స్టేషన్ల సమీపంలోని ప్రాంతాలలో స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందిఇది గతంలో తక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాలలో పెట్టుబడులనుఅభివృద్ధిని కూడా ఆకర్షించగలదు.

సామాజిక ప్రభావంచెన్నైలో రెండోదశ మెట్రో రైల్ విస్తరణ ప్రజా రవాణాకు కూడా మరింత సమానమైన అవకాశాలను అందిస్తుందివివిధ సామాజిక-ఆర్థిక సమూహాలకు ప్రయోజనం చేకూరుస్తుందిరవాణా అసమానతలను తగ్గిస్తుందిఇది ప్రయాణ సమయాలను తగ్గించడం ద్వారాఅత్యవసర సేవల లభ్యతను మెరుగుపరచడం ద్వారా అధిక జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుంది.

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ నగరానికి ఒక ప్రభావవంతమైన అభివృద్ధిగా ఉండనుందిఇది మెరుగైన అనుసంధానంట్రాఫిక్ రద్దీ తగ్గింపుపర్యావరణ లాభాలుఆర్థిక వృద్ధిజీవన నాణ్యత మెరుగుదలను అందించే అవకాశముందినగరం లోని కీలకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా  భవిష్యత్తులో నగర విస్తరణకు ప్రాతిపదికను అందించడం లోనూసుస్థిరత్వాన్ని పెంపొందించడంలోనూ  కూడా మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ  ముఖ్య పాత్ర పోషిస్తుంది.

 

***


(Release ID: 2061770) Visitor Counter : 42


Read this release in: English , Urdu , Hindi , Marathi