ఆయుష్
azadi ka amrit mahotsav

ముంబయిలో ప్రారంభమైన ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024 ఇతివృత్తం:'ఆయుష్ అంతర్జాతీయ బంధం: మెడికల్ వాల్యూ ట్రావెల్ ద్వారా ఆయురారోగ్యాలు


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయుష్; శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుతో కూడిన సమగ్ర ఆరోగ్యంపై దృష్టి; ఆరోగ్య పర్యాటకంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్నాం: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ ప్రతాప్ రావు జాదవ్



ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా 'దేశ్ కా ప్రాకృతిక్ పరీక్షణ్ - ఘర్ ఘర్ తక్ ఆయుర్వేద్' పేరుతో కోటి కుటుంబాల లక్ష్యంగా కార్యక్రమం; భువనేశ్వర్ లో వివిధ కార్యక్రమాలు, ఢిల్లీలో తుది కార్యక్రమం

Posted On: 30 SEP 2024 7:13PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్రశ్రీ ప్రతాప్ రావు జావ్ నేడు ముంబయిలో ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024ను ప్రారంభించారు. 'ఆయుష్ లో అంతర్జాతీయ బంధంమెడికల్ వాల్యూ ట్రావెల్ ద్వారా ఆయురారోగ్యాలు' అన్నది ఈ సమావేశానికి ఇతివృత్తంఈ సమావేశాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖమహారాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖఇతర కీలక భాగస్వాముల సహకారంతో నిర్వహించారు.

ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి శ్రీ ప్రతాప్ రావు జావ్ మాట్లాడుతూ.. దేశ సహజ సౌందర్యాన్నిసంపూర్ణ ఆరోగ్య సంరక్షణను అందించే ఆయుర్వేదయోగాయునానిసిద్ధహోమియోపతిని ఒక వేడుగా చేస్తున్నాం. ఏటా వేలాది మంది అంతర్జాతీయ పర్యాటకులను ఈ రంగం ద్వారా ఆకర్షిస్తున్నాంశారీరకమానసికఆధ్యాత్మిక శ్రేయస్సుతో కూడిన సమగ్ర ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాంఆరోగ్య పర్యాటకంలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్నామని అన్నారుప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందిఎయిమ్స్రక్షణ శాఖ ఆసుపత్రుల్లో ఆయుష్ సేవలు అందిస్తున్నారుదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఆయుష్ ప్రస్తుతం చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారుభారత్ చేపట్టిన జీ20 అధ్యక్ష పదవి ద్వారా ఆయుష్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చాందేశవ్యాప్తంగా వివిధ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలుసంస్థల్లో ఈ పద్ధతులను ఏకీకృతం చేశామని మంత్రి తెలిపారు.

ప్రజలు ప్రామాణిక ఆయుష్ సేవలను పొందేందుకు ఆసక్తి చూపుతున్నారనిఅయితే చాలాసార్లు వారికి ఈ సేవల గురించి తెలియకపోవడమోఅందుబాటులో లేకపోవడం జరుగుతోందని మంత్రి తెలిపారుఇలాంటి సమావేశాలు అనుసంధానాన్ని పెంచుతాయన్నారుఅదేవిధంగా సాంప్రదాయ ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తెస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారుమహారాష్ట్రలో ఆయుష్ మంత్రిత్వ శాఖఆయుష్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండేతో జరిపిన సంభాషణను ఆయన సమావేశంలో ప్రస్తావించారు.

మధుమేహంకాలేయ వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలను ఆధారాలతో కూడిన చికిత్సలను ఆయుష్ పరిష్కరిస్తోందనిఅందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారుఉద్యోగులందరికీ ఉచితంగా ఆయుష్ చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామనిమండలంతహసీల్ స్థాయిల్లో చౌక ఆయుష్ కేంద్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారుఆరోగ్య సంరక్షణలో సంప్రదాయ పద్ధతులను సమ్మిళితం చేయడానికి మొదటి ఆయుష్ జన ఔషధి కేంద్రాన్ని అక్టోబర్ న ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారుదేశవ్యాప్త 'మహిళల ఆరోగ్య పరీక్ష(హెల్త్ చెక్‌అప్)' కార్యక్రమం ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తుందిఆయుర్వేద దినోత్సవం సందర్భంగా 'దేశ్ కా ప్రాకృతిక్ పరీక్షణ్ ఘర్ ఘర్ తక్ ఆయుర్వేద్తో కోటి కుటుంబాలు లక్ష్యంగా ముంబయిలో తొలి మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024, భువనేశ్వర్ వేదికగా వివిధ కార్యక్రమాలుఢిల్లీలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు.

ఆయుష్ శాఖ కార్యదర్శివైద్య రాజేష్ కొటేచా ప్రసంగిస్తూ, "ఆయుష్ ప్రపంచ పరిధి గణనీయంగా విస్తరించిందిఎగుమతుల్లో గొప్ప వృద్ధిని సాధించిందిఈ రంగ పరిమాణం విపరీతంగా పెరిగిందివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్ఐఎస్ (రీసెర్చ్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్అనే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థభారతీయ సాంప్రదాయ వైద్య ఫోరం(ఎఫ్ఐటీఎం)పై అధ్యయనం చేసిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారువారి విశ్లేషణ ప్రకారంఆయుష్ రంగం 2014 లో మిలియన్ డాలర్ల నుండి 2020 లో 18.1 మిలియన్ డాలర్లకు పెరిగిందిఇది ఆరేళ్లలో ఆరు రెట్లు పెరిగిందన్నారుఅంతేకాకుండా, 2023 అంచనాల ప్రకారంఈ పరిమాణం 24 మిలియన్ డాలర్లకు చేరుకోనుందిఇది 2014 నుంచి చూస్తే దాదాపు ఎనిమిది రెట్లు పెరుగుదలను సూచిస్తుంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ మనోజ్ నేసరి ఆయుష్ మెడికల్ వాల్యూ అండ్ వెల్ నెస్ ట్రావెల్ సమ్మిట్ లో పాల్గొన్న 650 మందికి స్వాగతం పలికారుఆయుష్మెడికల్ వాల్యూ ట్రావెల్ ను పెంచడానికి  ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతోఆయుష్ మంత్రిత్వ శాఖపర్యాటక మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందిఆయుర్వేద వెల్‌నెస్ ట్రావెల్ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వారివారి పర్యాటక శాఖలతో కలిసి పనిచేయాలన్నారుఆయుష్ చికిత్సలను కోరుకునే విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న సందర్భంగాపర్యాటక సంస్థలుబీమా అందించే సంస్థలుఆతిథ్య రంగ సంస్థలు సహా అన్ని భాగస్వాములు ఏకమవ్వాలని పిలుపునిచ్చారువీరందరూ ఈ ముఖ్యమైన రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం అని అన్నారువివిధ రాష్ట్రాల్లోని ఆయుర్వేదంయోగా చారిత్రిక ప్రదేశాలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ఆయుష్ శాఖలురాష్ట్ర ఆరోగ్య శాఖలతో కలిసి పనిచేసిఆయుష్ ఆధారిత వైద్య పర్యాటకాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు.

పద్మశ్రీపద్మభూషణ్ పురస్కార గ్రహీతఅఖిల భారత ఆయుర్వేద కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్య శ్రీ దేవేంద్ర త్రిగుణ మాట్లాడుతూఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి ఆయనకున్న నిబద్ధతను తెలియజేశారుఆయన అంకితభావం సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (సిసిఐఎం), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదరాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ సహా అనేక సంస్థల స్థాపనకు దారితీసిందన్నారువైద్య త్రిగుణ కృషి ఫలితంగా ఆయుర్వేద పరిధి గణనీయంగా విస్తరించిందిప్రపంచవ్యాప్తంగా 80 దేశాలను ప్రభావితం చేసిందిఆయుష్ రంగానికి వైద్య శ్రీ దేవేంద్ర త్రిగుణ మార్గదర్శకుడిగా నిలిచారు.

ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024, ఆయుష్ రంగంలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు సంబంధించి భారతదేశాన్ని అంతర్జాతీయ కేంద్రంగా నిలబెట్టనుందికేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖమహారాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖముంబైలోని కీలక భాగస్వాముల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేదయోగాయునానీసిద్ధహోమియోపతి (ఆయుష్)లను  ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా మెడికల్ వాల్యూ ట్రావెల్ (ఎంవిటిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడమే ఈ ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024 లక్ష్యంఈ సమావేశానికి మహారాష్ట్రగోవాగుజరాత్మధ్యప్రదేశ్రాజస్థాన్ ప్రభుత్వాలకు చెందిన ఆరోగ్యఆయుష్పర్యాటక శాఖ అధికారులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

సమావేశ ప్రధానాంశాలు:
ప్రారంభ సమావేశంలో భారతదేశంలోని విదేశీ మిషన్లతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారుమెడికల్ వాల్యూ ట్రావెల్ ను ప్రోత్సహించడానికిఆయుష్ సేవలందించే సంస్థలను శక్తివంతం చేయడానికి ప్రభుత్వ నిర్ణయాలువిధానాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారుఅనంతరం దేశంలోని విదేశీ మిషన్ల ఇంటరాక్టివ్ సెషన్ లో నియంత్రణ ప్రాథమిక ప్రణాళికబీమా కవరేజీఅంతర్జాతీయ వైద్య సేవలపై చర్చ నిర్వహించారుకేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారుడాక్టర్ మనోజ్ నేసరిమహారాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కమిషనర్ డాక్టర్ రాజీవ్ డి నివాత్కర్ ఇందులో ప్రసంగించారు.


సెషన్ II: ఆయుష్మెడికల్ వాల్యూ ట్రావెల్ లో విజయగాథలు విస్తరిస్తున్న అవకాశాలుఅంతర్జాతీయ వ్యాధిగ్రస్తులను ఆకర్షించే ప్రముఖ వెల్‌నెస్ సెంటర్లుఆసుపత్రుల పరిచయంఈ సెషన్‌లో శ్రీ జాయ్ కుమార్ సింగ్సీఎంవోగుజరాత్ ఆత్మనీమ్ నేచర్ క్యూర్ శ్రీ నిఖిల్ కపూర్సహ వ్యవస్థాపకుడుఆత్మంతన్ వెల్‌నెస్ సెంటర్పూణేశ్రీమతి నటాలీ గ్రాంట్ నందాడైరెక్టర్రూబీ హాల్ క్లినిక్పూణే ప్రసంగించారు.

ప్యానెల్ డిస్కషన్స్ఆయుష్ రంగానికి చెందిన ప్రఖ్యాత నిపుణులుడాక్టర్ రోహిత్ మాధవ్ సానేఎండీవ్యవస్థాపకుడు మాధవ్‌బాగ్ వెల్‌నెస్ముంబైడాక్టర్ సౌరభ్ బి దవేఛైర్మన్ధన్వంతరి సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద ఇందులో పాల్గొన్నారుఆయుష్ సంక్షేమ సేవలలో ప్రపంచ సహకారం కోసం ఎదురయ్యే సవాళ్లు అవకాశాలను వారు ఇందులో అన్వేషించారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ ఉత్పత్తుల తయారీదారులుసేవా సంస్థలు ప్రదర్శన ఏర్పాటు చేశారు.

దేశంలోని అన్నీ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ అవగాహన 87% నుండి 99% వరకు ఉంది. (అరుణాచల్ ప్రదేశ్ (77%) మినహా). పట్టణ భారతదేశంలోఅన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలలో 86% కంటే ఎక్కువ అవగాహన ఉందిఆయుర్వేదం దేశవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా 86 శాతం పైచిలుకు వినియోగిస్తున్నారుఆరోగ్య బీమా సంస్థలుఇతర చికిత్సలతో సమానంగా ఆయుష్ చికిత్సలను అందించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డిఎఐఏప్రిల్ న కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందిఇప్పటి వరకు 49 జీవిత బీమా సంస్థలు, 69 ప్యాకేజీలను అందిస్తున్నాయి.

ఈ సదస్సు ఆయుష్ ఆరోగ్య సంరక్షణమెడికల్ వాల్యూ ట్రావెల్ భవిష్యత్తు గురించి చర్చించడానికి ప్రభుత్వ అధికారులువెల్‌నెస్ సెంటర్లుమెడికల్ ట్రావెల్ సంస్థలుబీమా సంస్థలుపరిశ్రమ నాయకులతో సహా వాటాదారులకు ఒక ప్రత్యేక వేదికను అందించిందినియంత్రణ నిబంధనలుఅంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలుఆయుష్ రంగం ప్రపంచ వృద్ధిని నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ద్వారా అందరూ అవగాహన పొందారు.

ఫిక్కీఇన్వెస్ట్ ఇండియాఐటీడీసీఆయుష్‌ఎక్సిల్ఎస్ఈపీసీల సహకారంతో జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వ కీలక కార్యక్రమాలుపరిశ్రమల లోతైన అవగాహనమెడికల్ వాల్యూ ట్రావెల్‌లో విజయవంతమైన కేసులను చర్చించారుమెడికల్ టూరిజం సూచీలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 10 వ స్థానంలో ఉందిదేశ అగ్రశ్రేణి వెల్‌నెస్ టూరిజం గమ్యస్థానాలు సమగ్రమైనతక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను చూపుతూఅంతర్జాతీయ రోగులను ఆకర్షించడానికి దేశ సామర్థ్యాలను ప్రధానంగా ప్రస్తావించాయి.

 

***



(Release ID: 2061005) Visitor Counter : 47


Read this release in: English , Urdu , Hindi , Marathi