ఆర్థిక మంత్రిత్వ శాఖ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934 ప్రకారం ద్రవ్య విధాన కమిటీ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వ ప్రకటన జారీ
Posted On:
01 OCT 2024 8:17PM by PIB Hyderabad
భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) పర్యవేక్షణలో పనిచేసే ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి)ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీచేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం నిర్దేశించే నిబంధనలకు అనుగుణంగా ఈ కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో ముగ్గురు ‘ఆర్‌బిఐ’ నుంచి, మరో ముగ్గురు కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులవుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934లోని సెక్షన్ ‘45జడ్‌బి’ కింద సంక్రమించిన అధికారాల మేరకు ప్రభుత్వం కింది విధంగా ‘ఎంపిసి’ని పునర్వ్యవస్థీకరించింది:-
ఎ. రిజర్వు బ్యాంకు గవర్నర్ - ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్
బి. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ - సభ్యుడు, ద్రవ్య విధాన ఎక్స్ అఫీషియో ఇన్‌చార్జి
సి. రిజర్వు బ్యాంకు నుంచి ఒక అధికారిని ఎక్స్ అఫీషియో సభ్యుడుగా కేంద్రీయ బోర్డు నియమిస్తుంది.
డి. ప్రొఫెసర్ రామ్ సింగ్, ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డైరెక్టర్ - సభ్యుడు
ఇ. శ్రీ సౌగత భట్టాచార్య, ఆర్థికవేత్త - సభ్యుడు
ఎఫ్. డాక్టర్ నగేష్ కుమార్, డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీ - సభ్యుడు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల (డి, ఇ, ఎఫ్) ల పదవీకాలం తక్షణం ప్రారంభమై, నేటినుంచి నాలుగేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేదాకా ఏది ముందైతే ఆ గడువు వరకూ కొనసాగుతుంది.
****
(Release ID: 2060986)
Visitor Counter : 149