ఆర్థిక మంత్రిత్వ శాఖ
2024-25 మదింపు సంవత్సరానికి ఆడిట్ నివేదికల దాఖలుకు గడువు పొడిగించిన సీబీడీటీ
Posted On:
30 SEP 2024 6:15PM by PIB Hyderabad
2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించి 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆడిట్ నివేదికలను ఈ సంవత్సరం సెప్టెంబరు 30 లోపు సమర్పించాలని సూచించిన ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ - సీబీడీటీ) ఆ గడువు తేదీని అక్టోబరు 7 వరకు పొడిగించినట్లు తెలిపింది. నిర్దేశిత గడువు లోగా ఆడిట్ నివేదికలను దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పన్నుల చెల్లింపుదారులు, ఇతర సంబంధిత వర్గాలు సీబీడీటీ దృష్టికి తీసుకువెళ్లాయి. దీంతో, ఆ నివేదికల దాఖలు కు నిర్దిష్ట తేదీని పొడిగించినట్లు సీబీడీటీ పేర్కొంది.
సీబీడీటీ ఈ మేరకు ఎఫ్. నంబరు 225/205/2024-ITA-II తో సర్క్యులర్ నంబర్ 10/2024 ను సెప్టెంబరు 29 న జారీ చేసింది. ఈ సర్క్యులర్ ను www.incometaxindia.gov.in లో అందుబాటులో ఉంచారు.
(Release ID: 2060573)
Visitor Counter : 32