రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ (క్యుకెడి) టెక్నాలజీ’ కోసం ‘ఆర్మీ ఐడెక్స్ ప్రాజెక్ట్’ ద్వారా ఒప్పందంపై సంతకాలు

Posted On: 30 SEP 2024 6:57PM by PIB Hyderabad

స్వయం సమృద్ధ భారతం కార్యక్రమంపై భారత సైన్యం తన నిబద్ధతను చాటుకుంటోందిఈ మేరకు ఇవాళ ‘ఇన్నొవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్’ (డెక్స్ద్వారా 8వ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసిందిన్యూఢిల్లీలో సౌత్ బ్లాక్‌లోని ఆర్మీ స్టాఫ్ వైస్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.సి.రాజా సుబ్రమణి సమక్షంలో ‘జనరేషన్ ఆఫ్ క్వాంటం సెక్యూర్ కీ (క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్-క్యుకెడి)’ కొనుగోలు దిశగా మెస్సర్స్ ‘కును’ (క్యుయుఎన్‌యు) ల్యాబ్స్‌ సంస్థతో ఈ ఒప్పందం కుదిరింది. ‘డెక్స్’ నిర్వహించిన ‘సార్వత్రిక పోటీ 2.0’లో 200 కిలోమీటర్ల  ‘సింగిల్ హాప్ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్’ సాంకేతికతను ‘కును’ ల్యాబ్స్ ప్రతిపాదించింది. ‘ఆల్గరిథమ్-ఆధారిత ఎన్‌క్రిప్షన్ సిస్టమ్‌’ల స్థానంలో ఈ సాంకేతికత వినియోగంలోకి వస్తుందితద్వారా మానవశక్తి సామర్థ్య గరిష్ఠం కావడంతోపాటు మరింత భద్రతకు భరోసా ఉంటుంది.

   గౌరవనీయ ప్రధానమంత్రి ‘డిఫెన్స్ ఎక్స్‌పో ఇండియా-2018’ సందర్భంగా ఏప్రిల్ 12న ‘డెక్స్’ను ప్రారంభించారువిద్యాపరిశోధన-అభివృద్ధి సంస్థలతోపాటు ‘ఎంఎస్ఎంఇ’లుఅంకుర సంస్థలు సహా వ్యక్తిగత ఆవిష్కర్తలను ఈ వ్యవస్థ ఒక వేదికపైకి తెస్తుందితద్వారా ‘డిఫెన్స్-ఏరోస్పేస్‌’ రంగంలో సాంకేతిక ప్రగతినిఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణ రూపకల్పన లక్ష్యంగా ‘డెక్స్’ కృషి చేస్తుందిఇందులో భాగంగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాల కోసం వాటికి ఆర్థిక సహాయంనిధుల మంజూరుతోపాటు ఇతరత్రా మార్గాల్లోనూ  చేయూతనిస్తుందిభవిష్యత్తులో భారత ‘డిఫెన్స్-ఏరోస్పేస్ ఆర్గనైజేషన్’ (డిఐఒఅవసరాలకు తగిన ఆవిష్కరణలకు రూపమిచ్చే సామర్థ్యం వీటికుందికాగాఅంకుర సంస్థలతోఆవిష్కర్తలతో సముచిత సంబంధాలు ఏర్పరచుకోవడంలో ‘డిఐఒ’ పరిధిలోని ‘డెక్స్’ అగ్రభాగాన నిలిచిందిముఖ్యంగా రక్షణ రంగ అంకుర సంస్థల సమూహంలో గణనీయ ఉరవడిని ప్రేరేపించింది.

   ‘డెక్స్’ పరిధిలో ప్రస్తుతం కృత్రిమ మేధ సంబంధిత 74 ప్రాజెక్టులున్నాయిఇవన్నీ ‘ఏసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఆఫ్ ఇన్నొవేషన్  టెక్ విత్ డెక్స్’ (అదితి), ‘డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్’ (డిఐఎస్‌సి), ‘ఓపెన్ ఛాలెంజ్ స్కీమ్’లో అంతర్భాగంగా ఉన్నాయివీటిద్వారా 77 అంకుర సంస్థలకు చేయూత లభిస్తోందిఈ సంస్థలు భారత సైన్యం కోసం అత్యాధునిక ఆవిష్కరణలను రూపొందిస్తాయిఈ నేపథ్యంలో వివిధ ‘డెక్స్’ పథకాల కింద ఇప్పటికే అందిన నాలుగు పరికరాలను భారత సైన్యం క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా వినియోగిస్తోందిఈ ఫలితాల ప్రాతిపదికన అంకుర సంస్థల ద్వారా తదుపరి తరం వినూత్న సాంకేతిక పరిజ్ఞాన నమూనాల రూపకల్పనలో ముందడుగు పడుతుంది.

 

***


(Release ID: 2060483)
Read this release in: English , Urdu , Hindi