ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐక్య‌రాజ్య స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం (యుఎన్‌జిఎ)లో ఆరోగ్య సామాజిక నిర్ణాయకాంశాలకు కట్టుబాటుపై భారత్ పునరుద్ఘాటన


‘‘ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ప్రాథమ్యాలకు మద్దతులో ఆరోగ్య సామాజిక నిర్ణాయాకాంశాల పాత్ర’’పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ప్రసంగం;

‘ఆరోగ్య రంగం కోసం రుణమార్పిడి’ గరిష్ఠ వినియోగం వల్ల ఆరోగ్య సామాజిక నిర్ణాయాకాంశాలపై ప్రత్యక్ష ప్రభావం గురించి సమగ్ర వివరణ;

జి-20 ‘జాయింట్ ఫైనాన్స్-హెల్త్ టాస్క్ ఫోర్స్’ ఉన్నత స్థాయి సమావేశంలో ఆరోగ్యం-సామాజిక సమానత్వంపై మరింతగా పెట్టుబడులకు భారత్ పిలుపు

Posted On: 27 SEP 2024 9:56PM by PIB Hyderabad

రోగ్య రంగంలో సామాజిక నిర్ణాయకాంశాల (ఎస్‌డిహెచ్‌మెరుగుదలపై కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నామని ఐక్య‌రాజ్య స‌మితి 79వ స‌ర్వ‌ ప్రతినిధి సదస్సులో (యుఎన్‌జిఎ)లో భారత్ పునరుద్ఘాటించిందిఇందులో భాగంగా నిర్వహించిన జి-20 జాయింట్ ఫైనాన్స్-హెల్త్ టాస్క్ ఫోర్స్’ (జెఎఫ్‌హెచ్‌టిఎఫ్‌ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేసిందిఈ సందర్భంగా‘‘ఆరోగ్య రంగంలో పెట్టుబడి ప్రాథమ్యాలు-ఆరోగ్య రంగం కోసం రుణమార్పిడి ఒప్పందాలు/అమలు.. ఆరోగ్య సామాజిక నిర్ణాయాకాంశాల పాత్ర’’పై సభ్యదేశాలు ప్రధానంగా చర్చించాయి.

   కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈ సమావేశంలో ప్రధాన ప్రసంగం చేశారు‘‘ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ప్రాథమ్యాలకు మద్దతులో ఆరోగ్య సామాజిక నిర్ణాయాకాంశాల పాత్ర’’ గురించి ఆమె సమగ్రంగా వివరించారుఅలాగే ఆరోగ్య రంగం కోసం రుణమార్పిడి’ గరిష్ఠ వినియోగం వల్ల ఆరోగ్య సామాజిక నిర్ణాయాకాంశాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని కూడా విశదీకరించారుభవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ప్రభావ ఉపశమనంతోపాటు ఆర్థిక భారం తగ్గింపులో ఆరోగ్యం-ఆర్థిక రంగాల కీలక సంబంధాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.

   ముఖ్యంగా గృహనిర్మాణంపారిశుధ్యంమంచినీటి సరఫరాఆదాయ భద్రత వంటి కీలక ‘ఎస్‌డిహెచ్‌’ సంబంధిత సమస్యల పరిష్కార ప్రాధాన్యాన్ని శ్రీమతి పటేల్ స్పష్టం చేశారుఈ దిశగా భారత్ గణనీయ  ప్రగతి సాధించిందని ఆమె వెల్లడించారుఇందులో భాగంగా ‘‘ఆయుష్మాన్ భారత్పరిశుభ్ర భారత్ కార్యక్రమం (స్వచ్ భారత్ మిషన్నీరే జీవనాధారం కార్యక్రమం (జల్ జీవన్ మిషన్), ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అందరికీ ఇల్లువంటి ప్రధాన సంక్షేమ పథకాల గురించి భారత ప్రతినిధి బృందం విపులీకరించింది.

   ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకం (ప్రతి కుటుంబానికి ఏటా రూ.5 లక్షల విలువైన చికిత్సప్రధానమంత్రి జనారోగ్య యోజన (పిఎం-జెఎవై) గురించి కూడా భారత బృందం వివరించిందిఈ పథకం కింద లక్షలాది ప్రజలకు ద్వితీయతృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం కలిగిందని పేర్కొందిముఖ్యంగా అసాంక్రమిక వ్యాధుల నుంచి ప్రజారోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వెల్లడించింది.

   ప్రభావశీల ఆరోగ్య విధానాల రూపకల్పనలో సమగ్ర సమాచారానికిగల కీలక పాత్రను శ్రీమతి పటేల్ ప్రముఖంగా ప్రస్తావించారుప్రత్యేకించి వివిధ రంగాల ‘ఎస్‌డిహెచ్‌’ సూచీల సంబంధిత సమాచార లభ్యత-ప్రణాళికల మెరుగుదల ప్రాముఖ్యాన్ని ఆమె స్పష్టం చేశారుఆరోగ్యం రంగంలో నిర్దిష్ట ఫలితాలివ్వగల పెట్టుబడులకు విధాన రూపకర్తలు ప్రాధాన్యం ఇవ్వడంలో ఇదెంతో కీలకమని చెప్పారుఅదే సమయంలో అంతర్జాతీయ గుర్తింపువిశ్వసనీయతగల సమాచార వనరుల ప్రామాణీకరణ ఆవశ్యకతను కూడా పునరుద్ఘాటించారుఈ సందర్భంగా ‘‘ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ప్రభావంపై కచ్చితమైన అంచనాల రూపకల్పనకు ఇది తోడ్పడుతుందివివిధ రంగాలపై విశ్లేషణ సౌలభ్యం సహా నిదర్శనాధారిత విధాన రూపకల్పన ప్రక్రియకు ఈ సమాచారం పునాది కాగలదు’’ అని ఆమె విశదీకరించారుఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆరోగ్య వ్యవస్థల మెరుగుదల దిశగా సమాచార సమీకరణవిశ్లేషణ కోసం ఏకీకృత విధానం అనుసరించాలని జి-20 సభ్య దేశాలకు భారత ప్రతినిధి బృందం పిలుపునిచ్చింది.

   అంతేకాకుండా ఆరోగ్య సమానత్వం దిశగా పెట్టుబడులలో ఆర్థిక భారాన్ని తగ్గించగల ‘ఆరోగ్యం రంగం కోసం రుణ మార్పిడి’ ఒప్పందాల ప్రభావశీలతను భారత్ వివరించిందిఈ కార్యక్రమానికిగల ఆశావహ సామర్థ్యాన్ని స్పష్టం చేసిందిదీన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం భాగస్వాములతో సమన్వయం ద్వారా విస్తృత ప్రయోగాత్మక కార్యకలాపాలు నిర్వహించడం అవసరమని పేర్కొంది.

   జి-20 కూటమిలో ఆరోగ్య రంగ సంబంధిత అంశాలపై గట్టిగా గళమెత్తే దేశంగా భారత్ గుర్తింపు పొందిందిఈ నేపథ్యంలో ప్రస్తుత ఉన్నతస్థాయి సమావేశం నిర్వహణలో చొరవపై జి-20కి అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్ సహా సహకరించిన ‘రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్’ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిందినిదర్శనాధారిత విధాన రూపకల్పనప్రపంచ భాగస్వామ్యాలుఆరోగ్య సామాజిక నిర్ణాయకాంశాలలో నిరంతర పెట్టుబడులు వగైరాల ద్వారా ఆరోగ్య సమానత్వం సాధించడంలో తన నిబద్ధతను భారత ప్రతినిధి బృందం పునరుద్ఘాటించింది.

   జి-20 సమావేశం ‘ఎస్‌డిహెచ్‌’లపై దృష్టి సారించడాన్ని భారత్ ప్రశంసించిందివ్యూహాత్మక పెట్టుబడులుసమాచార ఆధారిత విధాన రూపకల్పన ద్వారా ఉమ్మడి లక్ష్యమైన ‘అందరికీ ఆరోగ్యం’ దిశగా ఆరోగ్య సమానత్వ సాధనకు కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రకటించింది.

 

***


(Release ID: 2059960) Visitor Counter : 38


Read this release in: English , Hindi