పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యాటక, ఆతిథ్య రంగానికి 'పరిశ్రమ హోదా' మంజూరు, అమలు చేయడంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఉపకరించే హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ

Posted On: 27 SEP 2024 6:41PM by PIB Hyderabad

పర్యాటక, ఆతిథ్య రంగానికి పరిశ్రమ హోదాను మంజూరు చేయడానికి, అమలు చేయడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యత  కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక హ్యాండ్ బుక్ ను ఈ రోజు  ప్రారంభించింది.

పర్యాటక రంగంలో సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పర్యాటకాన్ని ఒక పరిశ్రమగా వర్గీకరించాయి లేదా అధికారిక ఉత్తర్వు ద్వారా పరిశ్రమ హోదాను ఇచ్చాయి. అయితే ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా  పర్యాటక యూనిట్లుగా రూపుదిద్దుకోవడం  పెద్ద ఎత్తున జరగలేదు.

పర్యాటకం, ఆతిథ్య రంగానికి 'పరిశ్రమ హోదా' మంజూరు చేయడం, అమలు చేయడంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రయత్నాలకు తోడ్పడటానికి పర్యాటక  శాఖ ఒక హ్యాండ్ బుక్ ను  ప్రారంభించింది. ఇది రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శి గా పనిచేస్తుంది. ఈ హ్యాండ్ బుక్  రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు పర్యాటకానికి పరిశ్రమ హోదా ఇవ్వడంపై దశలవారీ మార్గదర్శకాలను  అందించి తద్వారా పర్యాటక, ఆతిథ్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ద్వారా ప్రయోజనం కలిగేలా తోడ్పడుతుంది.

 

***


(Release ID: 2059713) Visitor Counter : 38


Read this release in: English , Hindi , Tamil