శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకాక్షి తాచుపాముల విషానికి


స్థానికాధారిత విరుగుడుతో మెరుగైన చికిత్స

Posted On: 26 SEP 2024 4:54PM by PIB Hyderabad

పాముకాటుకు విరుగుడుగా తయారు చేసే యాంటీవీనమ్ ఔషధాల తయారీలో స్థానికతకు ప్రాధాన్యం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘ఎలాపిడే’ రకానికి చెందిన ఏకాక్షి తాచుపాము (నాజా కౌతియా), మన దేశంలో ఈశాన్య ప్రాంతాల్లో,  నేపాల్బంగ్లాదేశ్మయన్మార్థాయిలాండ్వియత్నాంమలేషియాదక్షిణ చైనాల్లో ఎక్కువగా కనిపిస్తాయిఈ జాతి పాములు కరిచినపుడు విషం నాడుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి కణజాలాన్ని ఛిద్రం చేస్తుందిపాముకాటు వివరాలను సక్రమమైన పద్ధతిలో నమోదు చేయకపోవడంఎలాంటి చికిత్స చేయాలన్నది నిర్ధారించే కిట్లు లేకపోవడంఈ సమస్యపై అధ్యయన పద్ధతుల్లో సమన్వయలోపం వంటి కారణాల వల్ల ఏకాక్షి తాచుపాము కాటుకు సంబంధించిన గణాంకాలు అతి తక్కువగా లభ్యమవుతున్నాయి.

నాజా కౌతియా విష ప్రభావం గురించి జరిగిన అధ్యయనంలోకేంద్ర శాస్త్రసాంకేతిక విభాగానికి చెందిన గౌహతి స్వయంప్రతిపత్తి సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్డైరెక్టర్ప్రొఫెసర్ ఆశిష్ కెముఖర్జీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం,  తేజ్ పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ  హిరాక్ జ్యోతి కాకాతిఅమృతా విశ్వవిద్యాపీఠానికి చెందిన డాక్టర్ అపరూప్ పాత్ర పాలుపంచుకున్నారువిభిన్న ప్రాంతాల్లో నాజా కౌతియా తరహా పాముల విషంలో ప్రాంతాలవారీ తేడాలను గమనించేందుకుమానవ శరీరంలో  ప్రోటీన్లపరంగాజీవ రసాయనికపరంగా గల తేడాలపై అధ్యయనాన్ని చేపట్టారు.     

ఒకే రకమైన వరుసక్రమం గల అమైనో ఆమ్లాలు – ఐసోఫార్మ్లలోగుణాత్మకపరిణామాత్మక తేడాల వల్ల విషప్రభావ స్థాయిశరీరంపై కలిగించే ప్రభావంలో తేడా ఉంటుందనిఇది విషం విరుగుడు ఔషధాల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలుసుకున్నారు.

సాధారణంగా లభ్యమయ్యే విషం విరుగుడు మందులు వాడినప్పుడు శరీరంలో విడుదలైన యాంటీబాడీస్ సంఖ్యను పరిశీలించిన బృందం.. నాజా కౌతియా విషంపై ఈ మందులు ఎటువంటి ప్రభావాన్నీ చూపలేదని తెలుసుకున్నారుఅందుబాటులో ఉన్న ‘పాలీవేరియంట్ యాంటీవీనం’ ఔషధ వాడినప్పటికీ ఎటువంటి సానుకూల ప్రభావాన్ని చూపలేదని నిర్ధారించారు.

 ‘ఎల్సేవియర్’ సంస్థ పత్రిక ‘టాక్సికాన్’ ప్రచురించిన అధ్యయన పత్రంనాజా కౌతియా పాముకాటు చికిత్సకు వినియోగించే ‘పాలీవేరియంట్ యాంటీవీనం’ లోస్థానిక జాతులుపరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తదనుగుణమైన యాంటీబాడీలను

మేళవించాలని  తెలిపింది.

శరీరంపై నాజా కౌతియా విష ప్రభావాన్ని గురించి సంపూర్ణ అవగాహన కోసంఆ జాతి పాము ఆవాస ప్రాంతాల్లో  వైద్యపరమైన అధ్యయనాలు చేపట్టాలని సూచించిన బృందంఆ విధంగా లభ్యమైన సమాచారాన్ని స్థానికంగా వినియోగంలో ఉన్న  నాజా కౌతియా విషం విరుగుడు మందుల తయారీకి  అనుసంధానించాలని సూచించింది.


(Release ID: 2059516) Visitor Counter : 49


Read this release in: English , Urdu , Hindi , Tamil