యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav g20-india-2023

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీల్లో, 2024 సంవత్సర ప్రవేశాల కోసం జరిగిన రాతపరీక్ష ఫలితాలను ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

Posted On: 20 SEP 2024 9:27PM by PIB Hyderabad

1. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ నావల్ అకాడమీల్లో 2024లో  ప్రవేశాల కోసం సెప్టెంబర్ 1న  జరిగిన రాతపరీక్ష (II) ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ విభాగాలైన సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో ప్రవేశం కోసం, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ జరిపే ఇంటర్వ్యూలకు దిగువ రోల్ నంబర్లు గల అభ్యర్థులు ఎంపికయ్యారు. జులై 2, 2025 న ప్రారంభమయ్యే 154 వ  కోర్సు, ఇండియన్ నేవల్ అకాడమీ 116వ కోర్సుల కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కమిషన్ అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in. లో కూడా ఫలితాలను చూడవచ్చు.  

2. జాబితాలోని రోల్ నంబర్లు గల అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికమని గమనిక. పరీక్ష అర్హతకు సంబంధించిన నిబంధనలను అనుసరించి, రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డ రెండు వారాల్లోగా అభ్యర్థులు  భారత సైన్యం నియామకాల వెబ్సైట్ joinindianarmy.nic.in లో ఆన్లైన్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. పాసైన అభ్యర్థులకు నమోదైన ఇ-మెయిల్ ద్వారా సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూలు జరిపే ఎంపిక కేంద్రాలు, పరీక్ష తేదీ వివరాలను తెలియచేస్తారు. ఇదివరకే సైట్ లో నమోదు చేసుకున్న అభ్యర్థులు తిరిగి వివరాలను సమర్పించనవసరం లేదు. లాగిన్ సమస్యలు/ ఇతర సందేహాలకు dir-recruiting6-mod[at]nic[dot]in. కు ఇ-మెయిల్ పంపి సమాధానాలు తెలుసుకొనవచ్చు.

సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్  జరిపే ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ వయసు/విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించవలసి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపకూడదు  మరింత సమాచారం కోసం కమిషన్ గేట్ ‘సి’ వద్ద గల సహాయ కేంద్రాన్ని నేరుగా సంప్రదించవచ్చు, లేదా కార్యాలయాల పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు 011-23385271/011-23381125/011-23098543 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు.  సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ అంశం కాక, సైన్యం తొలి ప్రాధాన్యమైన అభ్యర్థులు 011-26175473 అనే నంబరు కు ఫోన్ లేదా  joinindianarmy.nic.in కు ఇ-మెయిల్ చేయవచ్చు. భారత నౌకాదళం ప్రథమ ప్రాధాన్యం గల అభ్యర్థులు 011-23010097 అనే నంబరు కు ఫోన్, లేదా officer-navy[at]nic[dot]in / joinindiannavy.gov.in కు ఇ-మెయిల్ చేయవచ్చు. అదే విధంగా వాయుసేన ప్రథమ ప్రాధాన్యమైన అభ్యర్థులు 011-23010231 Extn.7645/7646/7610 నంబర్లకు ఫోన్ చేయవచ్చు, లేదా  www.careerindianairforce.cdac.in కు ఇ-మెయిల్ చేయవచ్చు.

3. (సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ అనంతరం) తుది ఫలితాలను ప్రచురించిన 15 రోజుల్లోగా కమిషన్ వెబ్సైట్ లో అభ్యర్ధుల మార్క్ షీట్లు లభిస్తాయి. ఫలితాలు 30రోజుల పాటు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.  

ఫలితాల కోసం :  Click here to see Result:

 

***



(Release ID: 2057652) Visitor Counter : 14


Read this release in: English , Hindi