రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) బండిల్ 16 ని


రూ. 6,661 కోట్లకు కేటాయించిన జాతీయ రహదారుల సంస్థ

రహదారుల వ్యవస్థ విలువను పెంపొందించడంలో టీఓటీ పాత్ర కీలకం - 2024 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం విజయవంతంగా టీఓటీ బండిల్ 16 నుండి రూ 6,661 కోట్ల సమీకరణ: ఎన్ హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ హెచ్ -44లోని హైదరాబాద్-నాగ్ పూర్

కారిడార్ లో 251 కిలోమీటర్ల పొడవు రహదారి నిర్మాణం

Posted On: 20 SEP 2024 8:08PM by PIB Hyderabad

టోల్ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ (టీఓటీబండిల్ 16ను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఎఐ)  రూ.6,661 కోట్లకు కేటాయించిందితెలంగాణ రాష్ట్రంలోని ఎన్ హెచ్ -44లోని హైదరాబాద్-నాగ పూర్ కారిడార్ లో 251 కిలోమీటర్ల పొడవైన టిఓటి బండిల్ -16 కోసం ఫైనాన్షియల్ బిడ్ లను 2024 సెప్టెంబర్ 18 న తెరిచారుదీనిని హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కు రూ .6,661 కోట్లకు అప్పగించారు.

టీఓటీ బండిల్ ఒప్పంద రాయితీ కాలం 20 సంవత్సరాలుదీనిలో రాయితీదారు ఆ మార్గాన్ని నిర్వహించడమే కాకుండా ఆపరేట్ చేయాలిదీనికి బదులుగారాయితీదారు ఎన్ హెచ్ ఫీజు నిబంధనల ప్రకారం నిర్దేశిత రుసుము రేట్లకు అనుగుణంగా ఆ రహదారి కోసం వాడుకదారుల నుండి రుసుము వసూలు చేసినిబంధనలకు లోబడి తన దగ్గర ఉంచుకోవచ్చు

హైవే రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి టీఓటీ నమూనాను అభివృద్ధి చేశారుటోల్ఆపరేట్ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన వివిధ జాతీయ రహదారి విస్తరణల టోల్ వసూలునిర్వహణమరమ్మతుల కోసం ఎన్‌హెచ్ఎఐ ఎప్పటికప్పుడు కాంట్రాక్టులు ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోఎన్‌హెచ్ఎఐ రూ. 10,000 కోట్ల డబ్బు సంపాదన (మానిటైజేషన్లక్ష్యానికిగాను రూ.15,968 కోట్ల విలువైన నాలుగు టీఓటీ బండిళ్లను కేటాయించింది

విజయవంతమైన టీఓటీ బండిల్ -16 ఒప్పందం గురించి ఎన్ హెచ్ ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ  రహదారుల వ్యవస్థ విలువను పెంచడంలో టీఓటీ కీలక పాత్ర పోషించిందనిదేశంలో జాతీయ రహదారి వ్యవస్థ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందని తెలిపారుటీఓటీ బండిల్ 16 నుంచి రూ.6,661 కోట్లు సమీకరించడం సంతోషంగా ఉందన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో టీఓటీ విధానం విజయాల రేటు 100 శాతమనివేలందారుల నుండి చాలా ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను చూసినట్లు పేర్కొన్నారు.  జాతీయ స్థాయిలో నిధుల సమీకరణ లక్ష్యాలను సాధించడానికి భారత ప్రభుత్వం చాలా మద్దతు ఇచ్చిందనిఈ దార్శనికత ను సాకారం చేయడానికి  కట్టుబడి ఉన్నామని చెప్పారు

జాతీయ మానిటైజేషన్ ప్రణాళికకు అనుగుణంగాఎన్‌హెచ్ఎఐ మొత్తం ఆస్తి మానిటైజేషన్ కార్యక్రమం కింద లక్ష కోట్ల రూపాయలు దాటింది. ఇందులో టీఓటీ ద్వారా రూ.48,995 కోట్లుఇన్విట్ ద్వారా రూ.25,900 కోట్లు,  సెక్యూరిటైజేషన్ ద్వారా రూ .42,000 కోట్లు సమకూరాయి
 

 

***


(Release ID: 2057303)
Read this release in: English , Urdu , Hindi