శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కలుషితాలను గుర్తించే కొత్త కాగిత ఆధారిత పరికరాలు నానో శాస్త్రవేత్తల ఘనత

Posted On: 18 SEP 2024 2:22PM by PIB Hyderabad

ఆధునిక పీఏపీ పెన్నును ఉపయోగించితక్కువ ఖర్చుతో కాగిత ఆధారిత పరికరాలను రూపొందించడానికి శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారుఆధునిక సౌకర్యాల్లేని పరిమిత పరిస్థితుల్లో సంప్రదాయ గ్రాహక పద్ధతులను అనుసరించడం ఎంతో వ్యయంనైపుణ్యతలూ అవసరం అవుతాయి.

అవసరమైన చోటుకు తీసుకుపోయే అవకాశంతేలిగ్గా ఉపయోగించగలగడంతక్కువ వ్యయంలక్షిత ప్రయోజనంవాడిన వెంటనే వాటిని పారవేయడం వంటి అవసరాల దృష్ట్యాఇటీవలి కాలంలో కాగిత ఆధారిత పరికరాల ప్రాధాన్యం పెరుగుతున్నదికాగిత ఆధారిత పరికరాల రూపకల్పనలోఇంక్ జెట్ ప్రింటింగ్మైనం ఆధారిత ప్రింటింగ్లేజర్ చికిత్సకరెక్షన్ పెన్నులు వంటివి ఉన్నాయివనరులు పరిమితంగా ఉంటే పరిస్థితుల్లో ఆయా పరికరాల రూపకల్పనలో క్లిష్టతరమైన పరికరాలనూయంత్రాలనూ ఉపయోగించాల్సి వస్తుందివేడి చేయాల్సినపొడిగా చేయాల్సిన దశలను కూడా అందులో ఉంచాల్సి వస్తుందిఅందువల్ల వాటి వాడకంలో కొంత క్లిష్టత కూడా ఏర్పడుతుంది.

పీఏపీ పెన్నును ఉపయోగించి ఎలాంటి క్లిష్టమైన యంత్రాలతో పనిలేకుండావేడి లేదా పొడిగా చేయాల్సిన దశలూ లేకుండాసొంతంగా తయారు చేసుకోవడానికి వీలుండే పద్ధతిలో ఒక కొత్త తయారీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం పరిధిలోని మొహాలీలోని నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎన్ఎస్టీ)కి చెందిన డాక్టర్ భాను ప్రకాష్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రూపొందించింది.


 

రసాయనిక పరంగా భార లోహాలునైట్రేట్లను గుర్తించేందుకు వీలుగా శాస్త్రవేత్తలు కాగిత ఆధారిత తలాలు (2డీమాత్రమే ఉన్న పరికరాలను రూపొందించారుఇందుకోసం వారు ఏ-పీఏపీ గా పిలిచే పెన్నును ఉపయోగించారుక్షితజ రేఖామాన ప్రవాహాన్ని కలిగిన కాగితంతో తయారైన పరికరాన్ని ఉపయోగించిజీవ రసాయన పరంగా డోపమైన్ అనే రసాయనాన్ని గుర్తించారుతద్వారా వారు కనుగొన్న తయారీ విధానాన్ని విజయవంతంగా ప్రదర్శించగలిగారుకాగితాన్ని మడవడం ద్వారా క్లిష్టమైన మూడు తలాలున్న (3డీపరికరంగా మార్చిభార లోహాలను గుర్తించగలిగారుకొన్ని సెకన్ల వ్యవధిలోనే ఈ కాగిత పరికరాలను తయారు చేసుకునేందుకుఉపయోగించుకునేందుకూ వీలుండటం విశేషంఒక పదార్ధంలో భార లోహాలున్నదీ లేనిదీ క్షణాల్లో తెలుసుకోవచ్చుచౌకగా తయారు చేసుకోవడంసమర్థంగా పని చేయడంఅందరికీ అందుబాటులో ఉంచడానికి వీలు ఉండటం అన్న కారణాల వల్ల ఈ పరికరాలకు ఎంతో విలువ చేకూరింది.

ఈ కాగిత పరికరాలను వాడటానికి ముందు వేడి చేయాల్సిన దశ అవసరం లేదుఇతర ఏ ఆధునిక పరికరాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదుఅభివృద్ధిలేని మారుమూల ప్రాంతాల్లో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయిఅభివృద్ధి చెందని దేశాలకు ఇలాంటి చౌక విధానాల్లో రూపొందించుకునే కాగిత పరికరాలు ఎంతో మేలు చేస్తాయి.

అందుబాటులో ఉన్న ఇతర ఆధునిక విధానాలతో పోల్చితే-పీఏపీ పెన్నును ఉపయోగించి వేడి లేదా పొడి చేయాల్సిన అవసరాలేమీ లేకుండాకేవలం 10 సెకన్లలో అది కూడా కావాల్సిన కోణంలో వీటిని తయరు చేసుకునే అవకాశం అందిరావడంగ్రాహక విధానాల్లో పరీక్షలు నిర్వహించడం ఇందులోని ప్రత్యేకతలుక్షితిజ సమాన ప్రవాహానికి అవకాశం ఉన్న తలాల్లోగానీసంక్లిష్టమైన తాలాల్లోగానీ కాగిత పరికరాలను తయారు చేసుకోవడం ఈ విధానంలో ఉన్న మరో ప్రత్యేకత.

ఆహార పదార్ధాల్లోగానీనీళ్లలోగానీ ఉండే కలుషితాలను తక్కువ ఖర్చుతో గుర్తించడానికీఎంత మేరకు ఉన్నది అంచనా వేయడానికీ ఈ కాగిత పరికరాలు ఉపయోగించవచ్చుఆధునిక లాబొరేటరీ పరీక్షలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఈ పరికరాలు ఒక వరమనే చెప్పాలి.

ప్రచురణ కోసం : https://doi.org/10.1016/j.talo.2024.100325

 

***


(Release ID: 2056558)
Read this release in: Tamil , English , Hindi