వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

‘భాస్కర్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


భాస్కర్ అంటే ఉదయిస్తున్న సూర్యుడు, స్టార్టప్ ఇండియా వెబ్‌సైట్‌కు సరైన పేరు: పీయూష్ గోయల్

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉమ్మడి కృషికీ, సహకరించుకోవడానికీ, పోటీకి భాస్కర్ దోహదపడుతుంది: పీయూష్ గోయల్

భారతీయ అంకురాలు నిలదొక్కుకునేందుకూ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకూ

చిత్తశుద్ధి, నాణ్యత, దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం: పీయూష్ గోయల్

అంకుర వ్యవస్థ అన్ని సమస్యలకూ ఏకైక పరిష్కారంగా భాస్కర్‌: పీయూష్ గోయల్

Posted On: 16 SEP 2024 7:06PM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలో జరిగిన 'స్టార్టప్ ఇండియాకార్యక్రమంలో భాగంగా భాస్కర్ (భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీవెబ్‌సైట్‌ను కేంద్ర వాణిజ్యపరిశ్రమలశాఖా మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రారంభించారుఈ సందర్భంగా కీలకోపన్యాసం చేస్తూ ఈ వెబ్ సైటుకు 'ఉదయించే సూర్యుడుఅని అర్థం వచ్చేలా భాస్కర్‌ అని పేరు పెట్టడం సముచితంగా ఉందన్నారు. సూర్యుడితో జ్ఞానోదయంకాంతిఅభివృద్ధి వస్తాయని, అంకుర సంస్థలుకలిసి పనిచేయడానికీ, సహకరించుకోవడానికీ, పరస్పరం పోటీ పడటానికీ భాస్కర్ తోడ్పడతుందని ఆయన అన్నారుకలలు కనేవాళ్లూదానిని ఆచరణలో పెడుతున్న వాళ్లూపాతను తోసిరాజని కొత్తను పరిచయం చేసేవాళ్లూఇలా అందరినీ ఒకే దగ్గరకు తీసుకొస్తున్న భాస్కర్ ‌వేదిక ఒక గొప్ప ఆలోచన అంటూ ప్రశంసించారుభవిష్యత్తుపై నమ్మకాన్ని ప్రోది చేయడానికీఆశల్ని నెరవేర్చడానికీవిజయం సాధించడానికీ భాస్కర్ ఉపకరిస్తుందనిదీని ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ కలల్ని సాకారం చేసుకోగలరని చెప్పారుఅంకుర వ్యవస్థను ప్రోత్సహించడం గురించి ఆయన మాట్లాడుతూ, అందరికీ చేరువ చేసేందుకూప్రజాస్వామ్యబద్ధంగా ఉంచేందుకూప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకునేందుకూ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.'బ్రాండ్ ఇండియా'ను నిర్మించడానికి సాంకేతికత, కలుపుగోలుతనం భారతీయులకు ఉపకరిస్తాయనితద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఉత్పత్తుల్నీ, సేవలనీ విక్రయించడం తేలికవుతుందన్నారుఅంకుర వ్యవస్థ వల్ల భారత్‌ పట్ల ప్రపంచానికి ఉన్న దృక్ప మారిపోతుందన్నారు.

 

నూతన ఆవిష్కరణలకు ఔత్సాహిక పారిశ్రామిక దృక్పథం తోడైతే అది అంకురం అవుతుందని ఆయన నిర్వచనం చెప్పారు. మంచి భవిష్యత్తు కోసం ముందు విధాన రూపకల్పన జరగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత నేపథ్యంలో స్టార్టప్ ఇండియా భారత వృద్ధికి దోహదపడుతోందన్నారుప్రజలను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు ప్రోత్సహించడంవైఫల్యాలను ఉజ్వల భవిష్యత్తుకు మెట్లుగా చూడటంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయం పడటం వల్ల పెద్ద ఆలోచనలు ఫలిస్తాయని పేర్కొన్నారు

నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్(ఎన్ఎస్ఏసీ)ను సెక్షన్ కంపెనీగా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారుఈ కొత్త కంపెనీ షేర్లను కేటాయించడం ద్వారా 100 కోట్లకు ఎదిగే అవకాశం ఉన్న అంకుర సంస్థల్ని (యూనీకార్న్) గుర్తించవచ్చనీ, ప్రోత్సహించవచ్చనీ తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సాధికారత కల్పించడం సాధ్యం అవుతుందని మంత్రి పేర్కొన్నారుఅంకుర వ్యవస్థ నిజాయితీతోనాణ్యతతోనిబద్ధతతో పని చేయాలనీఅది స్వతంత్రంగా ఉండాలనీ, ప్రపంచ స్థాయిలో ప్రతిష్ఠ తెచ్చుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
అంకుర వ్యవస్థ దేశమంతటాదేశం ఆవల కూడా చక్కగా పని చేసేందుకు వీలుగా సులభతరమైన లింకు ద్వారా మొత్తం అంకుర వ్యవస్థ‌లో సమాచార మార్పిడిచర్చ దిశగా ఉపయోగం ఉండాలనీఇందుకోసం భాస్కర్‌ను ఏకీకృత పరిష్కార వేదికగా మార్చాలని కోరారుమెరుగైన ఫీచర్లుటెక్నాలజీతో కూడిన భాస్కర్ 2.0 త్వరలో విడుదల కావాలని ఆయన ఆకాంక్షించారు.


 

డీపీఐఐటీ కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ.. " మొత్తం అంకుర వ్యవస్థ సమష్టి కృషికి పిలుపునిచ్చే ఈ ప్రత్యేకమైన వెబ్ సైటును ప్రారభించుకోవటం మెచ్చుకోదగిన ముందడుగుగా చెప్పుకోవచ్చుప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న అంకుర వ్యవస్థల కంటే మన అంకుర వ్యవస్థ జయకేతనాన్ని ఎగురవేస్తుందని వ్యాఖ్యానించారుఇన్నోవేషన్‌కు భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందిముఖ్యంగా ద్వితీయతృతీయ శ్రేణి నగరాల్లోని అంకురాల మధ్య మరింత అనుసంధాన్ని పెంపొందిస్తుందిఆవిష్కరణలు సమ్మిళితంగా ఉండేలాఅవకాశాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తుందిఇది ప్రాంతీయ స్థాయి అంకురాలు ఒకదానికొకటి సహకరించుకునేందుకువృద్ధి చెందటానికి అవకాశం కల్పిస్తుంది. తద్వారా దేశ ఆర్థిక పురోగతికి దోహదం చేయడానికి వాటికి వీలు కల్పిస్తుంది” అన్నారు.

భారత వృద్ధికి దోహదపడటంలో అంకురాలు పోషించే కీలక పాత్రను వివరిస్తూ, భాస్కర్ ఈ వృద్ధిని సరైన దిశలో ఎలా వేగవంతం చేస్తుందోడీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ క్లుప్తంగా వివరించారు. "వనరులకు సమగ్రంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించటం ద్వారానిరంతరం మార్పు చెందుతోన్న నేటి మార్కెట్‌ సవాళ్లను తట్టుకొని నిలబడిఅవకాశాలను అందిపుచ్చుకునేలా చేసేందుకు అంకుర వ్యవస్థలో ఉన్న వారికి భాస్కర్ మార్గదర్శకంగా పనిచేస్తుందిజ్ఞానమే శక్తి అని విశ్వసిస్తున్నామనిభాస్కర్ ద్వారా ప్రతి భారతీయ స్టార్టప్‌కు పరిమాణంస్థానంతో సంబంధం లేకుండావాటి ఎదుగుదలను వేగంగా పెంచే వనరులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

అంకురాలు,  పెట్టుబడిదారులుమార్గదర్శకులుసర్వీస్ ప్రొవైడర్లుప్రభుత్వ సంస్థలతో కూడిన భారత అంకుర వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన భాస్కర్ ‌ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వ్యాపారఅంతర్గర వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీతన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం 'స్టార్టప్ ఇండియాకింద నిర్వహించింది.


 

నిరంతర సహకారంవిజ్ఞాన వినిమయంసృజనాత్మకతకు సంబంధించి ఒకే దగ్గర సమాచారంపరిష్కారం లభించే భాస్కర్ వెబ్ సైటును దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంకుర వ్యవస్థను ఏకీకృతంశక్తిమంతం చేసేందుకు రూపొందించారుఆగస్టు 2024 నాటికి 1.4 లక్షలకు పైగా డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకురాలతోభారత్‌ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్దఅత్యంత శక్తిమంతమైన అంకుర వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. అయితే, వనరులువాటాదారులూ ఎవరికి వారే అన్నట్లుగా అయిందిఅందరూ గుర్తించేందుకు వీలుగాఅందుబాటులో ఉండేలా ఇంక్యుబేటర్లువిధాన నిర్ణేతలుఇతర కీలక భాగస్వాములను ఒకే గొడుగు కిందకు తీసుకురావటమే భాస్కర్ లక్ష్యం.
భాస్కర్‌కు సంబంధించిన ప్రతిపాదనలు:

పరిశ్రమతో సంబంధాలు వివిధ రంగాలుపరిశ్రమలుసాంకేతికలుప్రాంతాల నుంచి భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఈ వెబ్ సైటు అందరికీ అవకాశాలను సృష్టిస్తుంది.

చలనశీల వ్యవస్థ: వ్యక్తిగతీకరించిన డ్యాష్ బోర్డులుపీర్-టు-పీర్ కనెక్ట్ ఫీచర్ల ద్వారా భావసారూప్యత కలిగిన వ్యక్తులతో సులభంగా కలిసివారితో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవచ్చుతదుపరి అవకాశం ఒక క్లిక్ దూరంలో ఉండేలా భాస్కర్ చూసుకోనుంది

మెరుగైన విజిబిలిటీ:  ప్రొఫైల్ కార్డులను ఉపయోగించి మిమ్మల్ని మీరు అంకుర వ్యవస్థ అంతటా కనిపించేలా చేసుకోవచ్చు

వ్యక్తిగత గుర్తింపు సంఖ్య: వ్యక్తిగత డ్యాష్ బోర్డ్ కోసం మీ ప్రొఫైల్‌కు లింక్ అయిన మీ భాస్కర్ ఐడీని పొందండిమీ డిజిటల్ గుర్తింపు వివిధ సేవలను మీరు పొందేందుకుఇతరులు మిమ్మల్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. 

నిరంతరం అభివృద్ధి చెందుతున్న అంకుర వ్యవస్థ భాగస్వాములును లేదా వాటాదారులను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే కేంద్రీకృత డిజిటల్ వేదికగా భాస్కర్ పనిచేస్తుందిరాబోయే కాలంలో ఇది ప్రపంచంలోని అంకుర వ్యవస్థకు సంబంధించి అతిపెద్ద డిజిటల్ సమాచార నిధిగా మారుతుంది.

 

***



(Release ID: 2055857) Visitor Counter : 45


Read this release in: English , Urdu , Marathi , Hindi