వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) 0% , 12.5% ​​ వద్ద దిగుమతి చేసుకున్న వంట నూనెలకు సంబంధించి వాటి స్టాక్‌ లభ్యత వుండేంత‌వ‌ర‌కూ నూనెల ఎంఆర్ పీని కొనసాగించాలని సూచించిన కేంద్రం


దేశీయ నూనెగింజల రైతులను ప్రోత్సహించడానికి, వివిధ వంట‌నూనెల‌పై సెప్టెంబర్ 14, 2024 నుండి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పెంపుద‌ల‌

Posted On: 17 SEP 2024 5:09PM by PIB Hyderabad

సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI), ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA),  సోయాబీన్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (SOPA) ప్రతినిధులతో కేంద్ర‌ ప్రభుత్వ ఆహార ,  ప్రజాపంపిణీ శాఖ (DFPD) కార్యదర్శి  సమావేశమయ్యారు. నూనె ధ‌రల నిర్ణ‌యంపై వ్యూహాన్ని చ‌ర్చిండానికి ఈ స‌మావేశం నిర్వ‌హించారు. ​​బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) 0% ,  12.5% వద్ద దిగుమతి చేసుకున్న వంట నూనెలకు సంబంధించి వాటి స్టాక్‌ లభ్యత వుండేంత‌వ‌ర‌కూ  ఎంఆర్ పీని కొనసాగించాలని ప్రముఖ వంట‌నూనెల సంఘాల‌కు కేంద్రం సూచించింది. ఈ విషయాన్ని ఆయా సంస్థ‌లు వెంట‌నే త‌మ స‌భ్యుల‌కు తెల‌పాల‌ని కేంద్రం సూచించింది. 

 

ఇంతకు ముందు కూడా, ప్రముఖ వంట నూనెల సంఘాల‌తో  కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించిన సమావేశాల కార‌ణంగా, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సోయాబీన్ నూనె ,  ఆవాల నూనె వంటి వంట నూనెల ఎంఆర్ పీని వంట‌నూనెల‌ పరిశ్రమ నిర్వాహ‌కులు త‌గ్గించారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం, వంట‌నూనెల‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వంటి కారణాలతో నూనెల‌ ధరలు తగ్గాయి. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకుగాను దేశీయ ధరలను అంతర్జాతీయ ధరలతో ఏకీభ‌వించేలా నూనెల త‌యారీ పరిశ్రమలకు ఎప్పటికప్పుడు కేంద్రం సూచ‌న‌లు చేస్తోంది.

 

దేశీయ నూనె గింజల ధరలకు మ‌ద్ద‌తునివ్వ‌డానికిగాను  వివిధ రకాల వంట నూనెల‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్ర‌భుత్వం పెంచింది. సెప్టెంబర్ 14, 2024 నుండి, ముడి సోయాబీన్ నూనె,  ముడి పామ్ ఆయిల్ , ముడి పొద్దు తిరుగు పువ్వు నూనెపై   బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ని  0% నుండి 20%కి పెంచింది.  దీనితో ముడి నూనెలపై ఎఫెక్టివ్ డ్యూటీ  27.5%కి చేరుకుంది. దీనికి అదనంగా, శుద్ధి చేసిన‌  పామ్ ఆయిల్, శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు నూనె,  శుద్ధి చేసిన సోయాబీన్ నూనెపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీని 12.5% ​​నుండి 32.5%కి పెంచడంతో శుద్ధి చేసిన నూనెల‌పై ఎఫెక్టివ్ డ్యూటీ 35.75%కు చేరుకుంది. 

 

వంట నూనెల ధ‌ర‌ల్లో ప్ర‌భుత్వం చేసిన‌ ఈ సర్దుబాట్లను.. దేశీయ నూనె గింజల రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా చూడాలి . ముఖ్యంగా సోయాబీన్‌, వేరుశెనగ పంటలు అక్టోబర్ 2024 నుండి మార్కెట్‌లలోకి వ‌స్తుండ‌డంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. 

 

సమగ్రమైన చర్చల త‌ర్వాత‌నే ధ‌ర‌ల‌పై నిర్ణ‌యం తీసుకున్నారు.  ఈ నిర్ణ‌యం అనేక అంశాలచే ప్రభావితమవుతుంది. ఆ అంశాలు ఇలా వున్నాయి.   సోయాబీన్, ఆయిల్ పామ్ , ఇతర నూనె గింజలకు సంబంధించి  ప్రపంచ స్థాయిలో ఉత్పత్తి పెరిగింది. గత సంవత్సరంతో పోల్చితే వంట నూనెల‌కు సంబంధించిన‌ హ‌య్య‌ర్ గ్లోబల్ ఎండింగ్ స్టాక్స్,  వంట నూనెల పంట‌ల్లో మిగులు ఉత్పత్తి కారణంగా ప్రపంచ ధరలు తగ్గ‌డం మొద‌లైన‌వి ధ‌ర‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయి. ఈ పరిస్థితి  చవకైన నూనెల దిగుమతుల పెరుగుదలకు దారితీసింది.  దేశీయ ధరలపై ఒత్తిడిని తగ్గించింది. దిగుమతి చేసుకున్న వంట నూనెల  ప్రారంభ ధరను పెంచడం ,  దేశీయ నూనె గింజల ధరలను పెంచడం, పెరిగిన ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం,  రైతులు తమ ఉత్పత్తులకు న్యాయమైన పరిహారం పొందేలా చూడటం లక్ష్యంగా ఈ చర్య‌ల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. 

 

తక్కువ సుంకంతో దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్  దాదాపు 30 ఎల్ ఎం టీ (LMT) ఉందని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు.ఈ స్టాక్‌ 45 నుంచి 50 రోజుల దేశీయ వినియోగానికి సరిపోతుంది. 

 

***



(Release ID: 2055849) Visitor Counter : 28


Read this release in: English , Urdu , Hindi