వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత అంకురాల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేనున్న ‘భాస్కర్’


ఒక వెబ్ సైటును అందుబాటులోకి తెస్తున్న డీపీఐఐటీ

Posted On: 15 SEP 2024 7:03PM by PIB Hyderabad

భారత అంకురాల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోనివ్యాపారఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీఅద్భుతమైన వెబ్ సైటును ప్రారంభించనున్నదిస్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద రూపొందించిన ఈ వెబ్ సైటు పేరుభారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (భాస్కర్). అంకురాలుపెట్టుబడిదారులుమార్గదర్శకులు (మెంటార్స్), సర్వీస్ ప్రొవైడర్లుప్రభుత్వ సంస్థలతో సహా ఔత్సాహిక పారిశ్రామిక వ్యవస్థలోని భాగస్వామ్యాలను ఒకే చోట నిర్వహించేందుకుక్రమబద్దీకరించేందుకుసహకారాన్ని పెంపొందించేందుకు భాస్కర్ ను రూపొందించారు.

 

ఆవిష్కరణలువ్యవస్థాపకతలో భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకురావాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా దీనికి రూపకల్పన చేశారుఇది అంకుర విప్లవం పట్ల దేశం చూపెడుతున్న నిబద్ధతను మరింత బలపరచనుంది.

 

కేంద్రీకృత వేదిక ద్వారా ఆవిష్కరణలకు సాధికారత

 

డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకుర సంస్థలు దేశంలో 1,46,000కు పైగా ఉన్నాయిప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున అంకుర సంస్థలు కలిగిన దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంటున్నదిపారిశ్రామికవేత్తలుపెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఒక వేదికగా ఉన్న ఈ భాస్కర్ ‌ద్వారా పరిష్కారాలు లభిస్తాయని భావిస్తున్నారుకేంద్రీకృత సమాచార నిధి అయిన భాస్కర్ నుంచి విస్తృత వనరులుసాధనాలువిజ్ఞానాన్నీ అంతరాయం లేకుండా పొందవచ్చుఆలోచనల నుంచి కలల్ని సాకారం చేసుకునే వరకూ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రయాణానికి ఉపయోగపడుతుంది.

 

అంకురాల వ్యవస్థలో పరస్పర సంబంధాలుసహకారంవృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుందిప్రతి వాటాదారుకీ ప్రత్యేకమైన భాస్కర్ ఐడీలను అందించనున్నారుదీని ద్వారా ఒకరితోనొకరు బంధాన్ని ఏర్పరుచుకోవడం సులభం కానుందికావాల్సిన సమాచారంపెట్టుబడిదారులుసాంకేతికత తదితర అంశాల గురించి శోధించటాన్ని ఈ వేదిక మెరుగుపరుస్తుందిసంబంధిత అవకాశాలుభాగస్వామ్యాలను సమర్థవంతంగా కనుగొనడానికి ఇది వీలు కల్పిస్తుంది.

 

భాస్కర్ ముఖ్య విశేషాలు

 

అంకురాల వ్యవస్థలోని వాటాదారుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద సమాచార నిధిని తయారు చేయటం భాస్కర్ ప్రాథమిక లక్ష్యందీన్ని సాధించేందుకు వీలుగా ఈ వేదిక అనేక కీలక అంశాలను కలిగి ఉంది అవి:

 

పరస్పర కలయికలుసహకారం: అంకురాలుపెట్టుబడిదారులుమార్గదర్శకులుఇతర వాటాదారుల మధ్య అంతరాన్ని భాస్కర్ భర్తీ చేస్తుందిఇది అన్ని విభాగాల మధ్య అంతరాయం లేని అనుసంధానాన్ని అందిస్తుంది.

 

వనరులకు కేంద్రీకృతంగా అందించడం: వనరులను ఏకీకృతం చేయడం ద్వారాఅంకుర సంస్థలకు ఈ వేదిక కీలకమైన సాధనాలు (టూల్స్), విజ్ఞానాన్ని(నాలెడ్జ్తక్షణమే పొందేందుకు వీలు కల్పిస్తుందిఇది వేగంగా నిర్ణయాలు తీసుకోవడంమరింత సమర్థవంతమైన విస్తరణ దిశగా ఆయా అంకురాలకు సాయపడుతుంది.

వ్యక్తిగత గుర్తింపు: ప్రతి వాటాదారుకూ ప్రత్యేకమైన భాస్కర్ ఐడీ ఇస్తారువ్యక్తిగత అనుసంధానంఅనుభవాలు ప్రతి ఒక్కరికి అందేలా ఇది చూసుకుంటుంది.

అన్వేషణను మెరుగుపరచటంకావాల్సిన అంశాలను తెలుసుకోవడానికి సంబంధించి శక్తివంతమైనఅంశాల వారీ విభాగాలు ఇందులో ఉన్నాయిదీని ద్వారా అవసరమైన వనరులుసహ భాగస్వాములను సులభంగా కనుక్కోవచ్చువేగంగా నిర్ణయాలు తీసుకునేందుకువాటిని అమలు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

ప్రపంచ స్థాయి చిహ్నంగా భారత్‌కు మద్దతు: ప్రపంచంలోని ఆవిష్కరణల కేంద్రంగా భారత దేశ ఖ్యాతిని పెంచేందుకు అంకురాలకుపెట్టుబడిదారులకు ఒకే తరహాలో దేశవిదేశాలనుంచి మరింత సులువుగా సమాచారం అందేలా చూడటం కోసం భాస్కర్ ఒక వాహనంగా పని చేస్తుంది.

 

భారత అంకుర వ్యవస్థకు సంబంధించి ముందు చూపు

ఆవిష్కరణఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడంఉద్యోగ కల్పనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాస్కర్ వేదిక ఒక ముఖ్యమైన ముందడుగుఇది అంకురాలుపెట్టుబడిదారులుసేవల్ని అందించేవారుప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయడానికీఆలోచనలను పరస్పరం పంచుకునేందుకూవృద్ధిని వేగవంతం చేయడానికీ ఒక కేంద్రీకృత వేదికగా పనిచేస్తుంది.

జ్ఞానంవనరులను సులభంగా పొందడానికి వీలు కల్పించడం ద్వారా భాస్కర్ భారత్‌ అంకుర వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవటంలో సహాయపడుతుందిఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడంలో భారత్‌ ప్రపంచ కరదీపికగా ఆవిర్భవించడానికి దోహదపడుతుంది.

మరింత తట్టుకునే సామర్థ్యం గల సమ్మిళితఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడంలోసంపన్న భవిష్యత్తుకు పునాది వేయడంలో ఈ భాస్కర్ వెబ్ సైటు కీలకం కానుంది.

 

అంకుర వ్యవస్థలోని అందరూ భాస్కర్‌లో భాగస్వాములు కావాలని ప్రభుత్వం ఆహ్వానిస్తోందిప్రస్తుత భారత అంకుర వ్యవస్థను పునర్నిర్వచించడానికివ్యవస్థాపకతకు సంబంధించి మరింత అనుసంధానంతో కూడిన సమర్థవంతమైనసహకార వాతావరణాన్ని సృష్టించడానికి భాస్కర్ తయారైందిఈ వెబ్ సైటును రేపు ప్రారంభించనున్నారుఇది భారత ఆవిష్కరణల వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

 

భారత అంకురాల భవిష్యత్తును తీర్చిదిద్దనున్న భాస్కర్

 

భారత అంకుర వ్యవస్థ అభివృద్ధి చెందుతోందిప్రపంచంలో వ్యవస్థాపకతకు సంబంధించి దేశ స్థాయిని పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషిస్తారుసహకార సంస్కృతిని పెంపొందించడం ద్వారాఈ ప్లాట్‌ఫామ్‌ సవాళ్లను అధిగమించడానికిభవిష్యత్ అవసరాలను తీర్చే సృజనాత్మక పరిష్కారాలను అంకురాలు తయారు చేయటానికి సహాయపడుతుంది.

భాస్కర్ ను ఆవిష్కరించటంతో ప్రపంచ స్థాయిలో ఆవిష్కరణలువ్యవస్థాపకతఆర్థిక వృద్ధిలో దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది.

 

***



(Release ID: 2055307) Visitor Counter : 23