కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రాజ భాష హిందీ 75 సంవత్సరాల వేడుకలు - హిందీ భాషా దినోత్సవ సందర్భంగా స్మారక తపాళా బిళ్ల విడుదల చేసిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 14 SEP 2024 4:55PM by PIB Hyderabad

జాతీయ అధికార భాషగా హిందీని స్వీకరించిన 75వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 1949, సెప్టెంబరు 14న కేంద్ర ప్రభుత్వం దేవనాగరీ లిపిలో గల హిందీ భాషను జాతీయ అధికార భాషగా చట్టసభల ద్వారా తీర్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

హోం శాఖ ఆధ్వర్యంలోని అధికార భాషా  విభాగం 1975లో ఏర్పాటైన నాటి నుంచి అధికారిక వ్యవహారాలలో హిందీ వాడకాన్ని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ గొప్ప మైలురాయిని చేరిన సందర్భానికి గుర్తుగా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన అధికార భాషగా హిందీ-75 సంవత్సరాల వేడుకలో స్మారక తపాళా బిళ్లను ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ “ఈ రోజు హిందీ భాష భారత అధికార భాషగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని  కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా విడుదల చేశారు.  స్మారక తపాళా బిళ్లను భారతదేశ సంస్కృతి, చరిత్రను ముందుకు తీసుకెళ్లడంలో హిందీ భాష  సహకారాన్ని ఈ తపాళా బిళ్ల గుర్తుచేస్తుంది. అలాగే నూతన, వికసిత్ భారత్‌ నిర్మాణంలో హిందీ భాష పాత్రను తెలియజేస్తుంది. దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఐక్యత, శాంతి స్థాపనలో 'హిందీ' ప్రాముఖ్యత గురించి ఈ తపాళా బిళ్ల మనకు గుర్తు చేస్తూనే ఉంటుందని నేను కచ్చితంగా భావిస్తున్నాను. జై హింద్!” అని పేర్కొన్నారు.

దేశాన్ని ఏకం చేయడంలో అలాగే విభిన్న భాషా వర్గాలకు సేవ చేయడంలో హిందీ భాష నిరంతర సహకారానికి ఈ స్మారక తపాలా బిళ్ల తగిన గౌరవ సూచిక అవుతుంది. ఇది గత 75 సంవత్సరాలుగా దేశ పరిపాలన, సాంస్కృతిక రంగాలలో హిందీ భాష ప్రయాణాన్ని సూచిస్తుంది.

 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రాజ్ భాష వజ్రోత్సవం సందర్భంగా స్మారక తపాళా బిళ్లను విడుదల చేస్తున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

 

ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రాజ్ భాష వజ్రోత్సవం సందర్భంగా స్మారక తపాళా బిళ్ల విడుదల దృశ్యం

 

 రాజ్ భాష వజ్రోత్సవం సందర్భంగా రూపొందించిన స్మారక తపాళా బిళ్ల

 

రాజ్ భాష వజ్రోత్సవంపై జారీ చేయబడిన మొదటి రోజు కవర్.

****



(Release ID: 2055109) Visitor Counter : 30


Read this release in: English , Urdu , Hindi , Tamil