రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ రంగంలో మైలురాయి, స్వదేశీ సామర్థ్యాలతో రూపొందించిన చారిత్రాత్మక విమానంలోఆర్మీ, నావికాదళం, వైమానిక దళ వైస్ చీఫ్‌ల ప్రయాణం

Posted On: 09 SEP 2024 7:30PM by PIB Hyderabad

భారత రక్షణ దళాలకు ఒక మైలురాయి గా నిలిచిన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళ వైస్ చీఫ్‌లు ఈరోజు దేశీంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సిఏ) తేజస్‌లో ప్రయాణించి చరిత్ర సృష్టించారు. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (విసిఏఎస్) ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, లీడ్ ఫైటర్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, అలాగే వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తేజస్ ట్విన్ సీటర్‌లో ప్రయాణించారు. ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి భూ-తలం, సముద్రతలం, వైమానిక దళాలు కలిసి పని చేసే ఒక వ్యూహాత్మక అడుగు ఇది. క్రాస్-డొమైన్ సహకారంపై మరింత దృష్టి పెడుతూ చేపట్టిన ఈ విన్యాసం వారి ఉమ్మడి భాగస్వామ్యానికి తార్కాణంగా నిలుస్తుంది. ఈ అపూర్వమైన ఉమ్మడి విమాన ప్రయాణం చేసిన మూడు సర్వీసుల వైస్ చీఫ్‌లు భారతదేశం అభివృద్ధి చెందుతున్న సమగ్ర రక్షణ సామర్థ్యాలకు, స్వావలంబనకు నిబద్ధతకు శక్తిమంతమైన నిదర్శనం. ఇది వారి నాయకత్వాన్ని మాత్రమే కాకుండా దేశ సాయుధ దళాల ఉమ్మడి భాగస్వామ్యాన్ని సూచిస్తుంది.

ఈ ఫ్లైట్ జోధ్‌పూర్ లో ప్రయాణం సాగించింది. దీనిలో భారత వైమానిక దళం తరంగ్ శక్తి 2024 విన్యాసం నిర్వహించింది. స్నేహపూర్వక దేశాల (ఎఫ్ఎఫ్సిలు) మధ్య పరస్పర చర్య, కార్యాచరణ సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో భారతదేశ మొట్టమొదటి బహుళ-జాతీయ విన్యాసం ఇది. ఐఏఎఫ్ నేతృత్వంలోని విన్యాసం అనేక సామర్థ్యాలతో సహకారాన్ని బలోపేతం చేసే సన్నిహిత సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్‌లో తేజస్‌ను చేర్చడం దేశ రక్షణ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంలో స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లు పోషిస్తున్న కీలక పాత్రను నొక్కి చెబుతుంది.

భారతదేశ స్వదేశీ రక్షణ ఉత్పాదక పరాక్రమానికి ప్రతీక అయిన తేజస్ విమాన యానం, 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు ఒక ముఖ్యమైన ఘట్టం. ఏరోనాటికల్ డిజైన్ ఏజెన్సీ (ఏడిఏ) రూపొందించిన ఈ ఫ్లైట్ ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారతదేశ సాయుధ బలగాల అవసరాలను తీర్చేందుకు రూపొందించిన అత్యాధునిక బహుళ-పాత్రక యుద్ధ విమానం.
ఈ అవకాశాన్ని ముగ్గురు వైస్ చీఫ్‌లు దేశ, విదేశాల భాగస్వామ్య దళాలతో సంభాషించడానికి కూడా ఉపయోగించారు.

 

***


(Release ID: 2053410) Visitor Counter : 92


Read this release in: English , Urdu , Hindi , Tamil